S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు యాత్రికులు కేదార్‌నాధ్‌లో క్షేమం

గుంటూరు : కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన గుంటూరు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో అక్కడి యాత్రికులను హెలికాప్టర్లలో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ ‌రావు ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడి తెలుగువారిని హెలికాప్టర్ల ద్వారా తరలించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

తిరుపతి: టెన్త్, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షా ఫలితాలు ప్రకటించడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ లైన్లలో అన్ని కంపార్టుమెంట్లు కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనానికి 15 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్ల వద్దనే భక్తులకు మంచినీరు, ఫలహారాలను అందిస్తున్నారు. టిటిడి ఇవో సాంబశివరావు, ఇతర అధికారులు తనిఖీలు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు.

నేరం ఒప్పుకున్న రాకీ యాదవ్

పాట్నా: తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని తానే రివాల్వర్‌తో కాల్చి చంపినట్లు నిందితుడు రాకీ యాదవ్ అంగీకరించినట్టు బిహార్ పోలీసులు చెబుతున్నారు. జెడియు ఎమ్మెల్సీ మనోరమ కుమారుడైన రాకీని కొద్ది రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్యను తాను హత్యచేయలేదని తొలుత చెప్పిన రాకీ ఇపుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసుల సమాచారం. మనోరమను జెడియు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

తమిళనాడులో రూ. 765 కోట్లు స్వాధీనం

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుండగా ఎన్నికల అధికారులు శనివారం దాడులు నిర్వహించి 765 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లలో తరలిస్తుండగా ఈ నగదును పట్టుకున్నారు. అయితే, ఇది ఎస్‌బిఐకి చెందిన డబ్బు అని పట్టుపడిన వారు చెబుతున్నారు. తిర్పూరు వద్ద 3 కంటైనర్లలో 570 కోట్లు, కోయంబత్తూరు వద్ద 2 కంటైనర్లలో 195 కోట్లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. విచారణలో ఇది ఎస్‌బిఐ డబ్బు అని తేలితే ఆ బ్యాంకుకు అప్పచెబుతామని ఎన్నికల అధికారులు తెలిపారు.

డివైడర్‌ను ఢీకొన్న ఓల్వో బస్సు

ఏలూరు: కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న మేఘనా ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు శనివారం ఉదయం బుద్ధంపూడి వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన 8 మందిని తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

హైదరాబాద్: పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ ఇన్నాళ్లూ తప్పించుకుతిరుగుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగరంలోని వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు, 33 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

షాపును తొలగించారని ఆత్మహత్యాయత్నం!

విశాఖ: విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగరపువలసలోని షాపింగ్ కాంప్లెక్సులో తన షాపును తొలగించడంపై మనస్తాపం చెందిన ఆటోమోబైల్ దుకాణం యజమాని కుమార్ శనివారం ఉదయం వొంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే గమనించి కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కుమార్ ఆత్మహత్యకు యత్నించడం తగరపువలసలో సంచలనం కలిగించింది.

3 రాష్ట్రాల్లో ప్రచారానికి నేడు తెర

దిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగుస్తుంది. చివరిరోజు కావడంతో ఈ మూడు రాష్ట్రాల్లో ప్రచారం వేడెక్కింది. 16న జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం విస్తృత సన్నాహాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలను పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు.

16న ఎపి ఐసెట్

విశాఖ: ఈనెల 16న జరిగే ఐసెట్ పరీక్షకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 138 కేంద్రాల్లో సుమారు 72వేల మంది ఈ ఎంట్రన్స్‌కు హాజరవుతున్నట్లు ఐసెట్ కన్వీనర్ రామ్మోహన్‌రావు తెలిపారు.

ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు

విశాఖ: జివిఎంసి పరిధిలోని మధురవాడ ప్రాంతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం పర్యటించి పారిశుద్ధ్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

Pages