S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్ మార్కెట్‌కు ‘పి-నోట్’ షాక్

ముంబయి, మే 13: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతానికి పడిపోవడం, ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతానికి పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు పి-నోట్ నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేయడం విదేశీ మదుపరుల పెట్టుబడులకు విఘాతం కలిగించింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 300.65 పాయింట్లు పతనమై 25,489.57 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 85.50 పాయింట్లు క్షీణించి 7,814.90 వద్ద స్థిరపడింది.

మళ్లీ ఎండలు

హైదరాబాద్, మే 13: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత వారం రోజుల కింద కురిసిన వర్షాలు, వాతావరణ పరిస్థితుల్లో సంభవించిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గి వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతున్నాయి. శుక్రవారం అనంతపురం, నందిగామ, నెల్లూరు, కర్నూల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిజామాబాద్, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో శుక్రవారం వడగాల్పుల తీవ్రత పెరిగింది.

వర్షాకాలంలోగా పూర్తి చేయండి

హైదరాబాద్, మే 13: వర్షాకాలం రావడానికి ముందే మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని, వర్షాల వల్ల ఈ పథకానికి సంబంధించిన పనులకు ఆటంకం కలగకుండా చూడాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిషన్ భగీరథ పనులను వేముల ప్రశాంత్‌రెడ్డి, సిఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆర్‌డబ్ల్యుయస్, అండ్ ఎస్ ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డిలు శుక్రవారం సమీక్షించారు.

ప్రజాసేవకు రిటైర్మెంట్ ఉండదు

న్యూఢిల్లీ,మే 13: రాజ్యసభ నుండి రిటైర్ అవుతున్న 53మంది సభ్యులకు రాజ్యసభ శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ,ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో పాటు వివిధ పార్టీల నాయకులు రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు ఇస్తూ అభినందనలు తెలిపారు. సభ నుండి రిటైర్ అయినంత మాత్రాన ప్రజాసేవ నుండి రిటైర్ కాకూడదని వారు సూచించారు. రాజ్యసభ జిఎస్‌టి తదితర ప్రధాన బిల్లులను అమోదించకకపోవటం పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిన మోదీ రిటైర్ అయిన తరువాత కూడా ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

సాహును బెదిరించారు

హైదరాబాద్, మే 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. యూనివర్శిటీలో నిరాహార దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌కు విద్యార్థుల విరాళాలతోనే డబ్బు చెల్లిస్తున్నామని సెంట్రల్ యూనివర్శిటీ జెఎసి ప్రతినిధులు వెంకటేశ్ చౌహాన్, అర్పిత, సంజయ్, భాస్కర్ పేర్కొన్నారు. ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతల బెదిరింపులకు భయపడే రాజ్‌కుమార్ సాహు ఎస్‌ఎఫ్‌ఐకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడని శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. రాజ్‌కుమార్ సాహు గత నాలుగు రోజుల నుండి ఫోన్‌లో కూడా అందుబాటులో లేరని, ఎక్కడున్నారో తెలియడం లేదని చెప్పారు.

ఏపి సర్కారుకు మళ్లీ ఇరకాటం!

రాజమహేంద్రవరం, మే 13: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూపంలో మరో సవాల్ ఎదురుకానుంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన నినాదంతో ఉద్యమం ప్రారంభించిన ముద్రగడ త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక వాహనం ఇప్పటికే ఆయన స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చేరుకుంది. చైతన్య వాహనంగా దీనికి పూజలు కూడా నిర్వహించారు. పర్యటన ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించుకోవడమే తరువాయి.

వాచీలు, సెల్‌ఫోన్లు నిషేధం

హైదరాబాద్, మే 13: తెలంగాణ ఎమ్సెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్, జెఎన్‌టియుహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్‌వి రమణారావు శుక్రవారంనాడు చెప్పారు. ఇంజనీరింగ్‌కు 1,43,481 మంది, మెడికల్‌కు 1,00,983 మంది దరఖాస్తు చేశారని, వారందరికీ హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇంజనీరింగ్‌కు 276, మెడికల్‌కు 190 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారి కోసం హైదరాబాద్‌లో మూడు కేంద్రాలు, వరంగల్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు.

అర్చకుల సమస్యలు పరిష్కరించండి

హైదరాబాద్, మే 13: ఆంధ్రప్రదేశ్‌లో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య డిమాండ్ చేసింది. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన రాష్ట్ర అర్చక సమాఖ్య సమావేశంలో దేవాలయాల పరిక్షణ కమిటీ కన్వీనర్, తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు సిఎస్ రంగరాజన్ మాట్లాడుతూ రాయలసీమలో అర్చకుల సమస్యలను పరిష్కరించాలని, దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని విడనాడాలన్నారు.

చర్చకు రాని ‘ప్రత్యేక హోదా’

న్యూఢిల్లీ, మే 13: రాజ్యసభ బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజైన శుక్రవారం నాడు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ కోసం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కె.వి.పి రామచందర్‌రావు, జె.డి.శీలం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజ్యసభ ఎజెండాలో హోదా బిల్లును చేర్చనందున ఓటింగ్ జరపటం సాధ్యం కాదని చైర్మన్ హమీద్ అన్సారీ స్పష్టం చేశారు.

కర్నాటక నుండే వెంకయ్య

న్యూఢిల్లీ,మే 13: పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నాలుగో సారి కూడా కర్నాటక నుండి రాజ్యసభకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆయన అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెంకయ్యనాయుడిని నాలుగో సారి కర్నాటక నుండి రాజ్యసభకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన పట్ల రాష్ట్ర బిజెపిలో మొదట కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యెడ్యూరప్ప కూడా వెంకయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచటంతో రాష్ట్ర బిజెపి నాయకులు దారికి రాక తప్పలేదని అంటున్నారు.

Pages