S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గంగి’ గోవు... వారి ఆధరవు!

సంగారెడ్డి, మే 13: ‘కుల విద్య మానకురా గువ్వల చెన్నా’ అన్న నీతి వాక్యాన్ని వారు అక్షరాలా పాటిస్తున్నారు. వృత్తినే నమ్ముకుని కుల సంప్రదాయాన్ని ఆచరిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నారు. కులాల కట్టుబాట్లకు తూట్లు పడి అనేక వృత్తులు చిన్నాభిన్నమైనా గంగిరెద్దుల కుటుంబాలు మాత్రం తమ కుల సంప్రదాయాన్ని యధావిధిగా కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. మండలానికో గ్రామంలో ఈ కుటుంబాలు తరుచుగా కనిపిస్తుంటాయి. కొన్ని మండలాల్లో ఈ జాతి వారు అసలే కనిపించరు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో ఉన్న నాలుగు కుటుంబాలు ఇప్పుడు 40కి చేరుకున్నాయి.

కాళ్ల పారాణి ఆరకముందే..

భూత్పూర్, మే 13: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగం కోసం మహబూబ్‌నగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో రహదారిపై లారీ ఢీకొని కొత్త దంపతులు మృత్యువాత గురైన సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ సమీపంలో జరిగింది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వైపునకు గొర్రెల లోడ్‌తో వస్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని ఎదురుగా వస్తున్న డీసీఎంను కొట్టి, డీసీఎం వెనుక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.

కాంగ్రెస్ అడ్డుకున్నా కాళేశ్వరం కడతాం

నర్సంపేట, మే 13: కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిన కాళేశ్వరం బ్యారేజిని నిర్మించి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లానర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువుపై రెండవ విడత మిషన్‌కాకతీయ పనులకు సంబంధించిన భారీ పైలాన్, మినీట్యాంక్ బండ్‌ను శుక్రవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, మహబూబాబాద్ ఎంపి అజ్మీర సీతారాంనాయక్‌లతో కలిసి మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం బ్యారేజికి వ్యతిరేకంగా మహరాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తోందని..

కెసిఆర్ ఆటలు సాగనివ్వం

వరంగల్, మే 13: సందర్భాలను బట్టి ప్రజల దృష్టిని మళ్లించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిట్ట అని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కరువు కోరల్లో విలవిలలాడుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ తెరపైకి తాజాగా జిల్లాల విభజన తీసుకొచ్చాడని ఆయన అన్నారు. అయితే జూన్ 2న జిల్లాల విభజనపై ముసాయిదా ప్రకటన జరుగుతుందా లేదా కరువుపై దృష్టిని మళ్లించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడో అనే అంశం తేలుతుందన్నారు. అయితే జిల్లాల విభజన అశాస్ర్తియంగా జరిగితే ఊరుకునేది లేదన్నారు.

ధనలక్ష్మిగా భద్రకాళి అమ్మవారు

వరంగల్, మే 13: వరంగల్‌లో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం 6వ రోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం జరిపిన తరువాత చతుఃస్థానార్చన సదస్యం ఉదయం 11 గంటలకు అమ్మవారిని పల్లకిసేవలో ఊరేగింపు జరిపారు. సాయంత్రం భద్రకాళీ అమ్మవారిని ధనలక్ష్మీ అలంకరణతో శేష వాహనంపై ఊరేగింపు జరిపారు.

పిఆర్ కండ్రిగ గ్రామాన్ని అభివృద్ధి చేయండి

గూడూరు, మే 13: తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని పుట్టంరాజు కండ్రిక గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆక్సిజన్ సర్వీస్ కంపెనీకి యాజమాన్యాన్ని కోరారు. ఈమేరకు ఆ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం నెల్లూరు వచ్చి గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు రాజ్‌పాల్ సింగ్, శ్రీనివాసరావులను సచిన్ టెండూల్కర్ ప్రతినిధి నారాయణ్ గూడూరుకు తీసుకొచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రామానికి సంబంధించిన పలు వివరాలను సేకరించారు.

కరవు సాయం రూ.700 కోట్లు

విశాఖపట్నం, మే 13: రాష్ట్రంలో కరవు, ఇతర సమస్యలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్‌లో కరవు, ప్రాథమిక రంగాల్లో అభివృద్ధిపై అధికారులతో శుక్రవారం చర్చించిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్రం కరవు సహాయ పనుల కింద రూ.700 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరిస్థితుల్లో కేంద్రం ఉదారంగా ఆదుకోవాల్సి ఉందన్నారు. కరవు సాయంపై కేంద్రానికి ఇప్పటికే నివేదికలు పంపామన్నారు. దీంలో తొలివిడత నిధులు మంజూరయ్యాయన్నారు. కరవును శాశ్వతంగా పారద్రోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రలోభాల పర్వానికి తెర

ఖమ్మం, మే 13: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఆయా పార్టీల రాష్ట్ర నేతలు ఖమ్మంలో మకాం వేసి గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే ఇక మిగిలిన రెండు రోజులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి గెలిచే ప్రయత్నాలు చేయనున్నారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికలు జరగనుండగా గెలుపు కోసం ప్రధాన పక్షాలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్, సిపిఎంలు నూతన ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు.

బాక్సైట్ తవ్వకాల జిఓ బేషరతుగా రద్దు చేయాలి

విశాఖపట్నం, మే 13: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఉద్దేశించిన జిఓ 97ను ప్రభుత్వం బేషరతుగా రద్దుచేయాలని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎపి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి బాక్సైట్ తవ్వకాలను చేపట్టకుండా తీర్మానం చేయాలన్నారు. ఇప్పటికే కేంద్రం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి రెండోదశ అనుమతులు మంజూరు చేసిందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వవైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు.

మూగ జీవాలకు శాపంగా మారిన ఇంకుడు గుంతలు

నూజెండ్ల, మే 13: ఇంకుడు గుంతలు మూగజీవాలకు శాపంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతలు మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో నూజెండ్ల మండలం ములకలూరు, పాత ఉప్పలపాడు, నూజెండ్ల, ముప్పరాజువారిపాలెం తదితర గ్రామాల్లో నాలుగు గేదెలు, ఒక ఆవు మృత్యువాత పడ్డాయి. వెనకటికి కొండనాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిందన్న చందంగా ఇంకుడు గుంతల పుణ్యమా అంటూ పశువులు మృత్యవాత పడటంతో వాటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. శుక్రవారం మండలంలోని పాత నాగిరెడ్డిపల్లికి చెందిన గోగు చెంచయ్య గేదె ఆదే గ్రామానికి చెందిన పున్నటి అప్పయ్య తీసిన ఇంకుడు గుంతలో పడి మృతి చెందింది.

Pages