S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో సైనా అవుట్

ఉహాన్ (చైనా), ఆగస్టు 30: భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ తన కంటే ఒక స్థానం తక్కువగా ఉన్న వాంగ్ ఇహాన్‌ను ఢీకొని, 16-21, 14-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ తరఫున బరిలోకి దిగిన మిగతా వారంతా ఇంతకు ముందే నిష్క్రమించారు. సైనా ఓటమితో భారత్ పోరాటానికి తెరపడింది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న సైనా పూర్తిగా కోలుకున్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ, కీలక మ్యాచ్‌ల్లో రాణించలేకపోతున్నది.

చర్చిస్తాం.. పరిష్కరిస్తాం

సెయింట్ జాన్స్, ఏప్రిల్ 30: పలు సమస్యలపై ఆటగాళ్లతో చర్చించి, వాటిని పరిష్కరిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్టులోని కొన్ని అంశాలు తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తున్న కొంత మంది వెస్టిండీస్ క్రికెటర్లు జీతభత్యాలను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల భారత్‌తో జరిగిన ప్రపంచ టి-20 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తర్వాత కెప్టెన్ డారెన్ సమీ మాట్లాడుతూ విండీస్ బోర్డు నుంచి తమకు ఎలాంటి సహాయసహకారాలు అందడం లేదని విమర్శించిన విషయం తెలిసిందే. అసలు టోర్నీలో ఆడతామో లేదో అన్న విషయం కూడా తమకు చివరి క్షణం వరకూ తెలియదని అన్నాడు.

‘సుప్రీం’ వ్యాఖ్యలు బాధాకరం

కోల్‌కతా, ఏప్రిల్ 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా సేవలు అందించిన జగ్మోహన్ దాల్మియాపై చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలపై అతని భార్య చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేసింది. క్రికెట్ అభివృద్ధికి జీవితకాలం శ్రమించిన అతనిని విమర్శించే అధికారం ఎవరికీ లేదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. భగవంతుడు కూడా దాల్మియాను తప్పుపట్టలేరని వ్యాఖ్యానించింది. ఎవరూ దాల్మియాకు కితాబునివ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

శాంతి

ఉమ ఆ రోజు హుషారుగా ఉంది. అవును తన స్నేహితురాలు రమను కలువబోతున్నందుకు. అది పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా వారు చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నేహితులందరు కలువబోతున్నారని ఊహించుకుంటూ.. బస్సు ఎక్కింది ఉమ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ..

శాంతి

ఉమ ఆ రోజు హుషారుగా ఉంది. అవును తన స్నేహితురాలు రమను కలువబోతున్నందుకు. అది పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా వారు చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నేహితులందరు కలువబోతున్నారని ఊహించుకుంటూ.. బస్సు ఎక్కింది ఉమ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ..

కుబేరుడి గర్వభంగం

గణపతి శివపార్వతుల కొడుకు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా! పొట్టిగా ఏనుగు తలతో, పెద్దపెద్ద చెవులతో బొద్దుగా, ముద్దుగా ఉంటాడు. ఒకరోజు గణపతి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అతనికి ఉన్న రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయింది. కోపం వచ్చి ఆటలు ఆపేసి ఇంటికి వచ్చేశాడు. మిగిలినవాళ్లు కూడా ఆడటం ఆపేశారు. గణపతికి రుచిగా ఉండే ఆహారం తినాలనిపించింది. స్నేహితులు అతనికి రకరకాల పిండివంటలు, పండ్లు తీసుకొచ్చి పెట్టారు. గణపతి అవి తనకి చాలవని, ఇంకా కావాలని పేచీ పెట్టాడు. స్నేహితులు మాత్రం అంతకంటే ఏం చెయ్యగలరు?

బాబోయ్ పులి!

క్లాసులో అటెండెన్స్ తీసుకోవడమయ్యాక, ప్రారంభించే ముందు అటెండరు గోపాలం సర్క్యులర్ పుస్తకం తీసుకొచ్చాడు. అప్పటివరకు గుసగుసగా మాట్లాడుతున్న విద్యార్థులు నిశ్శబ్దంగా మారిపోయారు.
ఇంగ్లీషు మాస్టారు ప్రకాష్ ‘సర్య్కులర్’ చదవటం ఆరంభించాడు. ‘మూడు నెలల నుండి ఎన్.సి.సి. కోర్సులో చేరిన వారికి వచ్చేవారికి క్యాంప్ నిర్వహించబడును. కావున ఎన్.సి.సి. విద్యార్థులందరూ తమ తమ యూనిఫాం, కావాల్సిన సామగ్రితో తయారుగా వుండవలెను. ముందుగా తెలియజేయడమైనది’
ప్రకాష్ సార్ ‘సర్క్యులర్’ చదివి సంతకం పెట్టి అటెండరుకిచ్చాడు. అటెండరు వెళ్లిపోయాడు.

వెలుగుల చీకట్లు

‘నాకు నీ వాలకం నచ్చటం లేదు’ కోపంగా అన్నాడు శ్రీరాజ్.
‘ఏం నేనేం తప్పు జేశాను’ ఏడుపు ముఖంలో అంది ఉషా సింగ్.
‘నీవు ఫోన్ మాట్లాడేటపుడు స్పీకర్‌లో పెట్టమన్నానా?!’ రౌద్రంగా ఉంది అతని ముఖం.
ఇక్కడ ఉష బుల్లితెర హీరోయిన్. అందరూ ఆమె నటనకు నీరాజనాలు పడతారు. ఆమె నవ్వితే నవ్వుతారు. ఏడిస్తే ఏడుస్తారు. మానసికంగా కుమిలిపోతుంటే అంతే ప్రమాణంలో వీళ్లు ఆవేదన పడతారు. కాని తెరవెనుక ఆమె పడే బాధలు ఎవరికీ తెలియవు.
‘ఏంటాలోచిస్తున్నావ్. పర్ డే లక్షన్నర డ్రా చేస్తున్నావట. ఎవరి ఎకౌంట్‌లోకి వెళ్తుంది?’ అతని స్వరం తీవ్రంగా ఉంది.
‘నా ఎటిఎం నీ దగ్గరే ఉంది కదా రాజ్! అర్ధోక్తితో అంది ఉష.

గ్రామాల్లో ఏడాది పని నిబంధనకు చెల్లు

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఎంబిబిఎస్ విద్యార్ధులు గ్రామాల్లో ఏడాదిపాటు సేవ చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి జీవో ఎంఎస్ నెంబర్ 28ను జారీ చేశారు. చాలాకాలంగా జూనియర్ డాక్టర్లు ఈ నిబంధనను తొలగించాలని తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. పదేళ్లుగా జూనియర్ డాక్టర్లు ఐదు ప్రధాన డిమాండ్లపై సమ్మె చేస్తుండగా ఆ ఐదింటిలో ఇదో ప్రధాన డిమాండ్‌గా ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం మూడున్నరేళ్లు పనిచేయాలనే నిబంధన ఉండేది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో దానిని ఏడాదికి తగ్గించారు.

జ్ఞానజ్యోతి

‘‘నళినీ నళినీ’’ అదే పనిగా పిలుస్తున్నారు సూర్యనారాయణమూర్తిగారు పెద్ద కోడల్ని.
‘‘అబ్బబ్బ తినేస్తున్నారీ ముసలాయన. ఎప్పుడు పీడ విరగడ అవుతుందో కానీ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను’’ విసుక్కుంటూనే మామగారి దగ్గరికి వెళ్లింది నళిని.
‘‘అమ్మా నళినీ... కోపగించుకోకమ్మా. ఏం చేయను చెప్పు మంచం పట్టిన వాడిని. ఏదో అలా పిలుస్తుంటాను. నాకంటే ముందుగా దాన్ని తీసుకుపోయి నాకు అన్యాయం చేసాడా భగవంతుడు’’ నిస్సహాయంగా చెప్పారు ఆయన.

Pages