S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీట్’పై సవాలుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం

హైదరాబాద్, ఏప్రిల్ 30: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సంబంధించి తామిచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని సుప్రీంకోర్టు శనివారం మరో మారు స్పష్టంగా చెప్పినా, రానున్న రోజుల్లో విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకుంటుందనే ఆశాభావాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క నీట్ తొలి దశ పరీక్ష పూర్తికాగానే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ఎమ్సెట్ పూర్తయిందని, దానికి ఎలాంటి ఢోకా ఉండబోదని అధికారులు చెబుతున్నారు.

మెట్రో రైలు కాస్త లేటు!

హైదరాబాద్, ఏప్రిల్ 30: హైదరాబాద్‌లో ఏ రోడ్డున వెళ్లినా అడుగడుగునా ట్రాఫిక్. నిత్యం నరకాన్ని ఎదుర్కొనే మహానగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలు కాస్త ఆలస్యంగా పరుగులు తీయనుంది. ప్రతిపాదనల స్థాయి నుంచే అనేక రకాల అడ్డంకులెదుర్కొంటున్న మెట్రోరైలు కనీసం స్వరాష్ట్రం, స్వపరిపాలనలోనైనా కాస్త ముందుగా అందుబాటులోకి వస్తుందని భావించిన జంటనగరవాసుల అంచనాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం మూడు కారిడార్లుగా 72 కిలోమీటర్ల పొడువునా కొనసాగుతున్న పనుల్లో కొన్ని కారిడార్లలో యాభై శాతం పనులు పూర్తి కాగా, సికందరాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న రెండో కారిడార్ పనులు మరీ వెనుకబడి ఉన్నాయి.

ఇన్ని డ్రై డేలా!

తెలంగాణలో మద్యం షాపుల డ్రై డేలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2వ తేదీ, గణేష్ నిమజ్జనం రోజున డ్రై డేలు ఉంటాయి. ఇటీవల కాలంలో శ్రీరామనవమి, హనుమజ్జయంతికి కూడా హైదరాబాద్‌లో డ్రై డేలు ప్రకటించారు. బోనాల ఉత్సవం, హోళీ పండగకు కూడా మద్యం షాపుల బంద్ ప్రకటించారు. ప్రభు త్వం మద్యం అమ్మకాలను నిరుత్సాహపరిచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల మద్యం వ్యతిరేకులు స్వాగతిస్తున్నారు. కాని మద్యం ప్రియులు మాత్రం ప్రతి పర్వ దినానికి డ్రై డే ప్రకటిస్తే ఎలా అని విసుక్కుంటున్నారు. పర్వ దినాల్లో మద్యం షాపులను మూసివేయడం మంచి పరిణామమని పోలీసులు, సామాజిక వేత్తలు విశే్లషిస్తున్నారు.

101 వ సినిమాకో కథ

‘‘అంత శ్రద్ధగా రాస్తున్నావు.. ఏంటి శ్రీశ్రీకి నివాళినా? ’’
‘‘తెలుగు సినిమాకు నివాళి.. ఆ ఏంటో అన్నావు. సరిగా వినలేదు’’
‘‘ ఏం రాస్తున్నావు ?’’
‘‘ మన హీరో 101వ సినిమాకు కథ రాస్తున్నాను. చదువు’’
***

ఆశయాల సాధనకోసం ‘సందర్భం’ కావాలి

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో మిత్రునికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి చూడటానికి వెళ్లాం.
చిన్ననాటి, పెద్దనాటి, ఈనాటి ముచ్చట్లను మాట్లాడుకున్నాం. అనారోగ్యం మరిచి మా మిత్రుడు ఒకింత జీవిత తత్వం గురించి మాట్లాడాడు. ఎన్నడూ ఎక్కువగా నోరు తెరవనివాడు అలా మాట్లాడ్డం మాకు కొంత ఆనందం కలిగించింది. కాసేపాగి జీవితంలో సాధించాలనుకున్నవి ఏమిటి? ఏం సాధించగలిగాం? అసలు సాధించినవి ఏమైనా ఉన్నాయా? వాటికీ, సమాజానికి సంబంధం ఏ మేరకు ఉంది? అనే అంశాలు చర్చకు వచ్చాయి. సాధించిన విషయాలలో సమాజగతమైనవి, రాజకీయపరమైవి ఏమిటి? ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి? అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242

ప్రజా వైద్యం దారి ఎటు..?

పేదలందరికి ఆధునిక వైద్యసేవలు..2 అంటూ ఏప్రిల్ 19న తన జన్మదిన కానుకగా చంద్రబాబు 275 సంచార్ ప్రాథమిక చికిత్స కేంద్రాలను ప్రారంభిస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) ప్రజారోగ్యం కుంటుపడిందన్నారు. కాని దశాబ్దం క్రితం వరకు రాష్ట్రం బాబు పాలన కిందనే సాగిందనేది మరచిపోయాడు. ఆకాలంలో కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా ఏరియా, జిల్లా, గాంధీ దవఖానల నిర్మాణాల్ని చేపట్టింది మాత్రం నిజమే! ఇదే కాలంలో కార్పొరేట్ వైద్యం ఊపందుకున్నది కూడా నిజమేనన్నది బాబు ఒప్పుకోకపోవచ్చు!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162

పట్టిసంకు ప్రత్యామ్నాయం

భీమవరం, ఏప్రిల్ 30: గోదావరి నదిపై పట్టిసం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా పెనుగొండ మండలం సిద్ధాంతం సమీపంలోని దొంగరావిపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేసిన తాత్కాలిక ఎత్తిపోతల పథకం సత్ఫలితాన్నిచ్చింది. రూ.15 కోట్ల వ్యయంతో 14 భారీ పంపుల ద్వారా సుమారు 150 క్యూసెక్కుల నీటిని తోడి, ఈ దాళ్వాలో పశ్చిమ డెల్టాలోని 30 వేల ఎకరాలకు నీరందించగలిగారు.

శేషాచల అడవుల్లో టాస్క్ఫోర్స్ కాల్పులు

పీలేరు, ఏప్రిల్ 30: శేషాచల కొండల్లో మరోసారి ఎర్రచందనం కూలీలకు, టాస్క్ఫోర్సు సిబ్బందికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కూలీల రాళ్ళదాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడగా, కిందపడ్డ కూలీ సైతం గాయపడ్డారు. తిరుమల శేషాచల కొండల్లోని బోనుగుట్ట వద్ద శనివారం కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్సు సిబ్బందికి దాదాపు 30మంది కూలీలు తారసపడ్డారు. వీరిని గమనించిన టాస్క్ఫోర్సు సిబ్బంది వారివెంట పడగా ఓ చిన్నస్వామి వెంకటేష్ అనే కూలీ కిందపడటంతో ఆతని తలకు గాయమైంది. అతనిని అదుపులోకి తీసుకునే సమయంలో హఠాత్తుగా కూలీలు పోలీసులపై రాళ్ళదాడి చేయడంతో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ తలకు, చేతులకు గాయాలయ్యాయి.

అభివృద్ధికి కలిసిరండి

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాజకీయ స్పృహతోనే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలువురు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను చేస్తున్న కృషికి మీ అందరి మద్దతు అవసరమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే సత్తాఉందన్న నమ్మకంతోనే విపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమవెంట వస్తున్నారన్నారు.

‘అగస్టా’ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనే లేదు

తిరువనంతపురం, ఏప్రిల్ 30: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణంపై అధికార బిజెపి కాంగ్రెస్ పార్టీపై దాడిని మరింత తీవ్రం చేసింది. యుపిఏ హయాంలో ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, అయితే ఎన్డీఏ దాన్ని ఎత్తివేసిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన ‘ఊహాజనితమైన కట్టుకథ’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

Pages