S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్పగిరి మఠం అవకతవకలపై దర్యాప్తు

తిరుమల, ఏప్రిల్ 30: తిరుమల్లో సంచలనాలకు దారి తీసిన పుష్పగిరి మఠం అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని తిరుమల డిఎస్పీ మునిరామయ్య తెలిపారు. ఆయన శనివారం తమ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్పగిరిమఠానికి సంబంధించిన నిర్వహణ, అవకతవకలపై మఠం యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ మేరకు గతంలో మఠాన్ని నిర్వహించిన వ్యక్తులు వారి ఆనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ వ్యవహారానికి సంబందించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విలువైన సమాచారాన్ని రాబట్టామన్నారు.

ఒక్క మాట మాట్లాడవేం బాబూ?

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఆంధ్రనోట మట్టికొట్టే తెలంగాణకు చెందిన పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మూడు రోజుల దీక్షకు ఉపక్రమిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మే 16నుంచి మూడు రోజులపాటు కర్నూలులో నిరసన దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. కృష్ణా డెల్టాకు నీళ్ళురాకుండా మహబూబ్‌నగర్ నుంచే తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతలకు పాల్పడుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నోరెత్తరెందుకని జగన్ ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల దిగువనున్న ఆంధ్ర జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ చుక్క నీరు రాదని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్‌

చిత్తూరు, ఏప్రిల్ 30: ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 600గ్రాముల బంగారు నగలు, నాలుగు మోటార్ సైకిళ్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తెలిపారు. ఎస్పీ కథనం మేరకు అనంతపురం జిల్లా వేలంమంది గ్రామానికి చెందిన మంగళ శీన(34), కడప జిల్లా మర్యపురంకు చెందిన ఎఆర్ కానిస్టేబుల్ మోల్ల జోహన్నస్(50), అనంతపురం జిల్లా అయ్యవారిపల్లెకు చెందిన గోరవ ఎర్రిస్వామి(24)లతోపాటు మరో ఇద్దరు మైనర్ బాలురు ఆంధ్ర, కర్నాటక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళల మెడలో నుంచి మంగల సూత్రాలను చోరీ చేయడంలో ఆరితేరిన ముఠాఅని ఎస్పీ తెలిపారు.

భారీగా ఎర్రచందనం స్వాధీనం

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 30: శ్రీ కాళహస్తి టూటౌన్ పోలీసులు శనివారం స్వర్ణముఖి నది వడ్డున రూ.4 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని నలుగురు దొంగలను అరెస్ట్‌చేశారు. ఈ సంఘటనపై డి ఎస్పీ వెంకటకిశోర్ విలేఖరులతో మాట్లాడుతూ బైపాస్ వంతెన వద్ద శువ్రకారం రాత్రి నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో టౌట్ సి ఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్‌చేసినట్లు తెలిపారున నదివడ్డున ఉన్న చెత్తకుప్పలతో 4 ఎర్రచందనం దుంగలు దొరికాయని తెలిపారు.

సత్యదేవుని కల్యాణోత్సవాల వాల్ పోస్టరు విడుదల

శంఖవరం, ఏప్రిల్ 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దివ్య కల్యాణమహోత్సవ వేడుకల గోడ పత్రికను దేవస్థానం ఇఒ కాకర్ల నాగేశ్వరరావు శనివారం విడుదల చేశారు. స్వామి వారి కల్యాణ ఉత్సవాలను వచ్చే నెల మే 16 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. 17వ తేదిన స్వామివారి దివ్య కల్యాణమహోత్సవం జరుగుతుందని గోడ పత్రికలో ప్రచురించారు. కార్యక్రమంలో దేవస్థానం పిఆర్వో తులా రాముడు, దేవస్థానం వేద పండితులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రాయవరం, ఏప్రిల్ 30: ట్రాక్టర్ ట్రాలీ, ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా ఇరువురు గాయపడిన సంఘటన మండలంలోని లొల్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాయవరానికి చెందిన కల్యాణి గనె్నమ్మ (58) రామచంద్రపురం నుండి ఆటోలో స్వగ్రామం వస్తుండగా లొల్ల సమీపానికి వచ్చేసరికి వెల్ల నుండి అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో లోడును దించి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీకి సంబంధించిన హుక్ విడిపోవడంతో ట్రక్కు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జనుజ్జయింది.

పూడికతీత పనులు పరిశీలన

అనపర్తి, ఏప్రిల్ 30: అనపర్తి మండలంలో నీరు - చెట్టు పథకంలో జరుగుతున్న చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టరు అరుణ్‌కుమార్ శనివారం పరిశీలించారు. మండలంలోని దుప్పలపూడి గ్రామ శివారు కృష్ణంరాజు చెరువును పరిశీలించిన కలెక్టరు అరుణ్‌కుమార్ పూడికతీతలో వచ్చిన మట్టిని ఏమి చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఆర్డీవో సుబ్బారావు సమాధానం ఇస్తుండగా అనపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శిరసపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, పాఠశాల క్రీడా పాంగణాల అభివృద్ధితోపాటు సారవంతమైన మట్టి కావడంతో రైతులకు అందజేస్తున్నట్టు తెలిపారు.

రెండు రోజుల్లో ఉపాధి కూలీల బకాయిలు చెల్లింపు

మండపేట, ఏప్రిల్ 30: ఉపాధి కూలీలకు రావలసిన కూలీ బకాయిలు మరో రెండు రోజుల్లో చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణకుమార్ తెలిపారు. శనివారం మండలంలోని వెలగతోడు గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ చేపడుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలనుద్దేశించి మాట్లాడుతూ ఉపాధి కూలీలకు బకాయిలు మరో రెండురోజుల్లో ఇస్తామని, ఇందుకోసం కేంద్రం నుండి నిధులు విడుదలయ్యాయన్నారు. చెరువులో పూడికతీసిన మట్టిని ప్రభుత్వ ఇళ్ల స్థలాలకు మెరక వేసుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. చెరువుగట్టును పటిష్టం చేసుకుని పార్కులుగా అభివృద్ధి చేసుకుంటే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు.

నేడే నీట్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆదివారం నేషనల్ ఎలిజబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) దేశవ్యాప్తంగా 52 నగరాల్లో జరగనుంది. ‘నీట్’ పరీక్షకు సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు శనివారం నిరాకరించడంతో ఆదివారం నాటి నీట్ పరీక్షకు మార్గం సుగమమైంది. నీట్‌కు సంబంధించి మరో బెంచ్ ఈ నెల 28న ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను అత్యవసరంగా వినడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది ‘ఈ లోగా ఏమీ అయిపోదు.

ముగ్గురు మాయ‘లేడీ’లు అరెస్టు

అమలాపురం, ఏప్రిల్ 30: వారి కన్నుపడితే చాలు..క్షణాల్లో ఆ వస్తువు మాయం. చూడ్డానికి మంచి సాంప్రదాయ కుటుంబానికి చెందినవారిలా కనిపిస్తారు. మాటలు కలుపుతారు. సమయం చిక్కగానే కన్నుపడిన వస్తువును కనుల ముందే మాయం చేస్తారు. అలాంటి ముగ్గురు మాయలాడిలను పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘరానా మాయ లేడీలకు సంబంధించి అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

Pages