S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/26/2019 - 01:30

మన జీవన విధానంలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జా తీయ అంతర్జాతీయ ఆరోగ్య విశే్లషకులు చెపుతున్న మాట! ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’- వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్- డబ్ల్యూహెచ్‌ఓ-వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు. ‘అల్లోపతి’ వైద్యవిధానంలోని మందులు, మందులిస్తున్న వైద్యులు మనుషులలో రోగ నిరోధకశక్తి తగ్గిపోవడానికి దోహదం చేస్తుండడం దశాబ్దుల వైపరీత్యం.

06/25/2019 - 02:11

మన రక్షణ అవసరాలకు అనుగుణంగా మన సమర పరిజ్ఞాన పాటవం పెంపొందకపోవడం ఏడు దశాబ్దుల వైపరీత్యం. అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు తరచు మన ఆంతరంగిక వ్యవహారాలలో అక్రమ ప్రమేయం కల్పించుకొంటూ ఉండడానికి ఇది అతి ప్రధానమైన కారణం! రక్షణ రంగంలో సైతం విదేశీయ సంస్థల పెట్టుబడులకు మన ప్రభుత్వం అనుమతినివ్వడం ‘ప్రపంచీకరణ’ ఫలితం!

06/21/2019 - 21:52

నీరు పల్లమెరుగు- అన్నది ప్రాకృతిక వాస్తవం! నీరు పైకి ఎగురు- అన్నది ప్రాకృతిక నియమ ప్రవాహానికి ఎదురీదగలిగిన తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం! ఈ విజయం ‘కాళేశ్వరం బహుళ ప్రయోజనకరమైన ఎత్తిపోతల పథకం’గా ఆకృతిని ధరించడం శుక్రవారం సంభవించిన చారిత్రక పరిణామం! ఈ చారిత్రక అద్భుతం తెలంగాణ జన మానస సీమలలో హరిత ఆనంద పరిమళాలను సభతీర్చనున్న అవిరళ జలప్రవాహం!

06/21/2019 - 01:56

అంతర్జాతీయ యోగ దినోత్సవం- అంతర్ రాష్ట్రీయ యోగ్ దివస్- ఇంటర్ నేషనల్ డే ఆఫ్ యోగ- హైందవ జాతీయ విశ్వ గురుత్వానికి లభిస్తున్న సమకాల ప్రపంచ పరిగణనకు నిదర్శనం. సుదీర్ఘ మానవ చరిత్రలో ఒక ప్రధానమైన పునరావృత్తికి ఇది ధ్రువీకరణ! నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన అంతర్జాతీయ విజయం ‘యోగ విద్య’కు దాదాపు ప్రతి దేశంలోను ఆచరణ సిద్ధించడం! ‘యోగం’ భారతీయుల సనాతన సంస్కారం.

06/20/2019 - 01:28

రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ భవనాలను ఉన్నచోటనే పునర్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం విచిత్రమైన పరిణామం.. రాజధాని మహానగరం నడిబొడ్డున- కోర్ ఏరియా- వెలసి ఉన్న రాష్ట్ర సచివాలయం దశాబ్దుల తరబడి ‘‘కేంద్రీకరణ’’కు దోహదం చేసింది.

06/19/2019 - 01:59

జగత్ ప్రకాశ్ నడ్డా భారతీయ జనతాపార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడుగా నియుక్తుడు కావడం విలక్షణ పరిణామం. ఈ విలక్షణ వైచిత్రి ముప్పయి తొమ్మిదేళ్ల ‘భాజపా’ చరిత్రలో గతంలో సంభవించలేదు. మొదటిసారిగా సంభవించింది కనుక విలక్షణమైనది. ‘భాజపా’లో కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కూడ- అధ్యక్ష పదవితోపాటు- ఉందన్న విషయం తెలియని ‘అనభిజ్ఞుల’కు ఇది విచిత్రం. అందువల్లనే నడ్డా ఎంపిక విలక్షణ వైచిత్రి!

06/18/2019 - 01:51

కొత్త లోక్‌సభ తొలిసారి కొలువుతీరడం మన ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ ప్రస్థాన పథంలో ఒక ప్రధానమైన పరిణామం! బ్రిటన్ దురాక్రమణ విముక్త భారత్‌లో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత క్రీస్తుశకం 1952 నుంచి ఈ చారిత్రక పరిణామం పదిహేడుసార్లు సంభవించింది. పదిహేడవ లోక్‌సభ సోమవారం సమావేశం కావడం ఈ పరిణామక్రమంలో వర్తమాన ఘట్టం. ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రాతిపదిక నిర్ణీత కాలవ్యవధిలో ప్రస్ఫుటించే జనాదేశం.

06/14/2019 - 22:21

కిర్గిఝస్థాన్ రాజధాని బిష్‌కెక్ నగరంలో జరిగిన ‘షాంఘయి సహకార సమాఖ్య’- షాంఘయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్-ఎస్‌సిఓ- దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశం అంతర్గత వైరుధ్యాలను మరోసారి స్ఫురణకు తెచ్చింది. గురువారం, శుక్రవారం జరిగిన ఈ ‘శిఖర’ సభకు- ‘హాంకాంగ్’ ప్రజలపై చైనా ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ వికృతమైన నేపథ్యం... 1997లో ‘హాంకాంగ్’ నగర రాజ్యం చైనాలో కలసిపోయింది.

06/14/2019 - 01:46

చం ద్ర మండలానికి రెండవసారి యాత్ర జరుపడానికి ‘భారత అంతరిక్ష పరిశోధక మండలి’ వారు సమాయత్తం కావడం మన అంతరిక్ష విజ్ఞాన ప్రస్థాన పథంలో మరో ప్రగతి పదం.. 2008వ సంవత్సరంలో తొలిసారిగా మన ‘చంద్ర ప్రస్థానం’ ఆరంభమైంది. మొదటి ‘చంద్రయాన్’ ప్రస్థానం 2008 అక్టోబర్‌లో ఆరంభమై నవంబర్‌లో చంద్ర మండల గగన పరిధిలోకి ప్రవేశించడం గొప్ప చారిత్రిక ఘటన.

06/13/2019 - 01:16

నిపుణులు నిగ్గుతేల్చిన ఆర్థిక వాస్తవాల గురించి కూడ భిన్నస్వరాలు వినబడుతుండడం ‘ప్రపంచీకరణ’ కల్పించిన మాయాజాలం. రాజకీయ వాస్తవాల గురించి పరస్పర వైరుధ్య భావాలను వేత్తలు వెళ్లగక్కుతుండడం సహజం. కానీ ప్రామాణిక వాస్తవాలు, గణాంకాలు, అధ్యయనాలు, విశే్లషణల ప్రాతిపదికగా నిర్ధారణకు గురి అవుతున్న ఆర్థికప్రగతి గురించి కూడ విభిన్న అభిప్రాయాలు వెలువడుతుండడం విచిత్రమైన వ్యవహారం.

Pages