S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/12/2019 - 01:23

మూడేళ్ల పిల్లలకు లాంఛనంగా విద్యాభ్యాసం మొదలుకావాలని కొత్త ‘జాతీయ విద్యావిధానం’ ముసాయిదాలో ప్రతిపాదించారట. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చుకుంటున్నారు. ఐదేళ్లలోపు శిశువులకు చదువుచెప్పే వ్యవస్థ ఇంతవరకు ‘సర్కారీ’ బడులలో ఏర్పడలేదు. ఇకపై ఏర్పడబోతోందట!

06/11/2019 - 01:42

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాల్‌దీవులకు, శ్రీలంకకు వెళ్లిరావడం ‘ఇరుగు పొరుగు’ దేశాల పట్ల మనకున్న మైత్రీభావానికి మరో నిదర్శనం. మన దేశానికి దక్షిణంగా నెలకొని ఉన్న ఈ రెండు చిన్న దేశాలకు విదేశీయ పర్యటన క్రమంలో మన ప్రభుత్వం ప్రాథమ్యాన్ని ప్రాధాన్యాన్ని కల్పించడం చారిత్రక భౌగోళిక వాస్తవాలకు అద్దం.

06/07/2019 - 22:37

మూడేళ్లలో బ్రిటన్ ప్రధానమంత్రులు ఇద్దరు రాజీనామా చేశారు.. కానీ ఐరోపా సమాఖ్య- యూరోపియన్ యూనియన్- ఈయూ-నుంచి బ్రిటన్ వైదొలగే-బ్రెగ్జిట్-ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రక్రియను వ్యతిరేకించిన డేవిడ్ కామెరన్ రాజీనామా చేయవలసిన అవసరం లేకపోయినా హుందాగా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాడు. దీనికి విపరీతంగా ఎప్పుడో రాజీనామా చేయవలసి ఉండిన థెరీసా మేయ్ అనేక నెలలపాటు పదవిని పట్టుకొని వేలాడింది.

06/07/2019 - 01:47

నకారాత్మక-నెగిటివ్-ప్రాతిపదికపై ఏర్పడే ప్రతిదీ ఎప్పుడో అప్పుడు విచ్ఛిన్నం కాక తప్పదన్న వాస్తవానికి ఇది మరో ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని ‘బహుజన సమాజ్ పార్టీ’-బసపా-కి మరో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆధ్వర్యంలోని ‘సమాజ్‌వాదీ పార్టీ’-సపా-కీ మధ్య గత ఏడాది మార్చినుంచి కొనసాగిన ‘మైత్రి’ పరిసమాప్తం కావడం ఇందుకు సరికొత్త ధ్రువీకరణ.

06/06/2019 - 01:24

కానబడక అనుమాన ప్రమాణమునకె
అంది అందని పరతత్త్వమవల నుంచి
పంచభూత భాసితమైన ప్రకృతి కళనె
సన్నిహిత లక్ష్యమనియె వచస్వి నేడు!

06/05/2019 - 02:59

అయ్యవారు ఏమి చేస్తున్నాడు?- అన్న ప్రశ్నకు సమాధానం ‘‘అబద్ధాలను వ్రాసి దిద్దుకుంటున్నాడు..’’అన్నది! నూతన ‘జాతీయ విద్యా విధానం’- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- ఎన్‌ఇపి- ముసాయిదాలో సోమవారం హడావుడిగా జరిగిన ‘‘మహా పరివర్తన’’ ఈ సామెతను మరోసారి స్ఫురింప చేస్తోంది. పాఠశాలలలో ‘త్రిభాషా బోధన’ సూత్రం ప్రకారం హిందీ భాషను ఒకటవ తరగతి నుంచి తప్పనిసరిగా బోధించాలన్నది మొదట ప్రచారమైన ముసాయిదా.

06/04/2019 - 22:03

కేరళ అడవులలోను, పశ్చిమ కనుమలలోను వేల రకాల మొక్కలు, తీగలు, ఇతర వృక్షజాతులు లక్షల ఏళ్లుగా పరస్పర పరిపోషకాలుగా వికసించాయి. ఒక మొక్క తాను ఎంతగా ఎదిగినప్పటికీ మరో మొక్క కు హాని కలిగించక పోవడం చరిత్ర. ఈ చరిత్రకు కొన్ని దశాబ్దులుగా విఘాతం కలుగుతున్నట్టు శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. విదేశాల నుంచి వచ్చిపడిన కొన్ని ‘జాతుల’ మొక్కలు, తీగలు స్థానికంగా పెరిగిన వృక్షజాలానికి నష్టం కలిగిస్తున్నాయట.

06/01/2019 - 01:35

అమిత్ షా ప్రాధాన్యం ఇంత గొప్పది. కేంద్రమంత్రి పదవి ప్రాధాన్యం ఇంత గొప్పది. దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాధాన్యం మరింత విస్తృతమైనది. బ్రిటన్ విముక్త భారతదేశపు తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ సమకాల జాతీయ మహాపురుషుల- స్టేట్స్‌మెన్-లో అగ్రగణ్యుడు. ఆయన స్వయంగా నిర్వహించినందువల్ల దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ గరిమ, ఘనత, ప్రాధాన్యం, ఔన్నత్యం మరింత పెరిగాయి.

05/24/2019 - 23:35

చెట్టుచెడు కాలమునకు ‘కుక్కమూతి’ పిందెలు- అన్నది ప్రకృతిని పరిశీలించిన వేత్తలు చేసిన నిర్ధారణ కావచ్చు. ఈ ‘సామెత’ కాంగ్రెస్ పార్టీ పట్ల నిజం కారాదన్నది దేశంలోని ప్రజాస్వామ్య సమర్థకుల ఆకాంక్ష! ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ నిరంతర విజయానికి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పటిష్ఠమైన ప్రతిపక్షం కూడ అవసరం.

05/24/2019 - 02:27

ప్రజాస్వామ్య సుప్రభాత
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వజాతీయ స్వాభిమాన
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి జగతి కనులు
‘తూర్పు’వైపు చూస్తున్నవి,
అరుణ తరుణ కిరణమ్ములు
ధరణి చరిత వ్రాస్తున్నవి..

Pages