S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/24/2019 - 01:47

నూతన ‘అమరావతి’ నిర్మాణ ప్రక్రియ నుంచి ‘ప్రపంచ బ్యాంకు’ తప్పుకొనడం భారతీయుల స్వాభిమాన గరిమను పెంపొందించగల శుభ పరిణామం. ‘అంతర్జాతీయ స్థాయి’ అంటే విదేశీయ సంస్థల లేదా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం- అన్న భ్రాంతికి గురి అయి ఉండిన అధికార, ప్రతిపక్ష రాజకీయవేత్తలకు ఇది జ్ఞానోదయ ఘట్టం.

07/23/2019 - 02:46

అస్మిన్ అంతరిక్షే మహార్ణవే- ఈ అంతరిక్ష మహాసముద్రంలో- ఇది మరో మథనం, మరో అద్భుతం, మరో చారిత్రక శుభ పరిణామం, మరో విజయం. మహార్ణవ మథనం నుండి చంద్రుడు ఉద్భవించడం సృష్టి నిహిత వాస్తవం, సనాతన-శాశ్వత- తత్త్వం! అంతరిక్ష ‘మథనం’ సాగిస్తూ ‘ద్వితీయ చంద్రయాన్ ఉపగ్రహం’ చంద్రుని వైపు దూసుకొని వెడుతుండడం వర్తమాన వాస్తవం.

07/19/2019 - 22:10

తోడేళ్లకు నక్కలతో
తుది సమరం జరుగువేళ
తదుపరి ఘట్టం కోసం
తహతహలాడుట మేలా?
అధికారం అవధి అయిన
పదవీ స్వామ్య ‘ప్రయోక్త’ల
గెలుపుఓటముల మధ్య
విలువల విచికిత్స ఏల?

07/19/2019 - 02:26

మార్కెట్ ఎకానమీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించి ‘చిత్తశుద్ధి’తో కృషిచేస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ ‘చిత్తశుద్ధి’ని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి లోక్‌సభలో ఆవిష్కరించాడు, దేశ ప్రజలను చకితులను చేశాడు. దేశ ప్రజలు విస్మయ చకితులయ్యారా? లేక ఆనంద ఆశ్చర్య చకితులయ్యారా? అన్నది ఏకాభిప్రాయం కుదరని విషయం.

07/18/2019 - 22:09

కులభూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం విధించిన ‘మరణశిక్ష’ను అమలు జరుపరాదని హేగ్ నగరంలోని ‘అంతర్జాతీయ న్యాయస్థానం’ తీర్పుచెప్పడం మానవత్వపు విలువలకు లభించిన విజయం, అంతర్జాతీయ వ్యవహార నియమావళికి లభించిన బలం, సహజ న్యాయసూత్ర పరిరక్షణ సిద్ధాంతానికి అనుగుణమైన అంతర్జాతీయ పరిణామం, మన ప్రభుత్వానికి లభించిన మరింత నైతిక స్థైర్యం.

07/17/2019 - 05:05

నిలబడి ‘సుఖంగా’ ప్రయాణం చేయాలన్నది ‘నిలువున’ పెరుగుతున్న నగరాలలోని జీవన రీతి- లైఫ్ స్టయిల్-! ఆధునిక విలాసం- మోడరన్ ఫాషన్. ఎందుకంటె పద్దెనిమిది ఏళ్లు నిండిన నలబయి ఐదు ఏళ్లు నిండని నాగరిక యువజనులలో అత్యధికులకు- కూచోవడానికి వీలుగా వంగవలసిన- మోకాళ్లు వంగడం లేదు. లావెక్కి ఉన్న నడుములు ఎలాగూ వంగవు. ‘అదేమిటయ్యా? నేలమీద కూర్చొనడానికి కదా నడుములు, మోకాళ్లు వంగవలసిన అవసరం ఉంది..

07/16/2019 - 22:27

తదుపరి ‘దలైలామా’ను తాము నియమిస్తామని చైనా ప్రభుత్వ నిర్వాహకులు ప్రకటించడం దురహంకార ప్రవృత్తికి, దురాక్రమణ చిత్తవృత్తికి మరో నిదర్శనం. తమ నిర్ణయాన్ని వ్యతిరేకించరాదని, దాన్ని అమలు జరుపడంలో జోక్యం చేసుకోరాదని మన ప్రభుత్వాన్ని చైనా నియంతలు హెచ్చరించడం అక్రమ ఆధిపత్య వైఖరికి, దౌత్య దౌర్జన్యానికి మరో నిదర్శనం.

07/13/2019 - 01:46

తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు నూతన సచివాలయ నిర్మాణ పథకం కేంద్ర బిందువుగా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలకు నూతన రాజధాని నిర్మాణ పథకం కేంద్ర బిందువు కావడం నడచిన చరిత్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చరిత్రగతి ‘మందకొడి’ కావడం, తెలంగాణలో ఈ చరిత్ర వేగవంతం కావడం సమాంతర పరిణామాలు!

07/12/2019 - 02:01

‘ఉండేదంతా ఉండంగ ఉయ్యూరొచ్చి మేడూరు మీద పడింద’న్న లోకోక్తికి ఇది మరో ఉదాహరణ.. మిజోరమ్‌లో తలదాచుకుంటుండిన రెండువందల పంతొమ్మిది మంది శరణార్థులను మన అధికారులు బలవంతంగా బర్మాకు తరలించారట. బర్మా-మ్యాన్‌మార్-లోని ‘అరకాన్’- రఖైన్- ప్రాంతంలో ‘రోహింగియా’ జిహాదీ బీభత్సకారులు ఇస్లాం మతేతరులపై దశాబ్దులుగా దాడులు జరుపుతున్నారు.

07/11/2019 - 01:30

వ్యవసాయపు వాటాల వినిమయ కేంద్రం- అగ్రికల్చరల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్- ఏర్పడకపోవడం దశాబ్దుల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం. ఈ వైపరీత్యం విదేశీయ దురాక్రమణ నాటి వారసత్వం. కొనసాగుతున్న ఈ విపరీత వారసత్వం మన ఆర్థిక వ్యవస్థలో నిహితమై ఉన్న డొల్లతనం. ప్రతి ఏడాది ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’-బడ్జెట్-ఆవిష్కృతం కాగానే ‘వాటాల వినిమయ సూచిక’ పెరుగుతోంది లేదా తరుగుతోంది.

Pages