S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

01/10/2017 - 01:33

రాజకీయ పార్టీల పనితీరులో పారదర్శకత పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుం బిగించడం ‘నల్లధనంపై పోరాటం’లో మరో ముందడుగు. దేశ రాజధానిలో జరిగిన భారతీయ జనతాపార్టీ కేంద్రీయ కార్యకారిణి- నేషనల్ ఎగ్జిక్యూటివ్- సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలోను, సమావేశపు చర్చలలోను రాజకీయ పక్షాల అంతర్గత పారదర్శకత, ఎన్నికల్లో నల్లడబ్బు ప్రభావాన్ని నిరోధించడం ప్రధాన ఇతివృత్తం కావడం హర్షణీయం.

01/09/2017 - 00:48

చైనా ప్రభుత్వ వ్యూహాత్మక దురాక్రమణ పట్ల నిర్లిప్తత వహించే విధానాన్ని మన ప్రభుత్వం విడనాడింది. దశాబ్దుల తరబడి నెలకొన్న ఈ నిర్లిప్తత ఇటీవలి కాలంలో తొలగిపోవడం మన రక్షణ విధానంలో వచ్చిన విప్లవాత్మక పరివర్తనకు నిదర్శనం. మన ప్రతిఘటన పటిమ భౌతికంగాను వ్యూహాత్మకంగాను పెరుగుతున్న కొద్దీ చైనా దురాక్రమణపుకోరలు మరింత పదునెక్కుతుండడం సమాంతర పరిణామం.

01/06/2017 - 23:48

సర్వోన్నతుడు సలహాలను స్వీకరించాలి. సలహాలను ఇవ్వడం సంప్రదాయం కాదు. స్వీకరించిన సలహాలను సమీక్షించి, ఆదేశాలను ఇవ్వడం సర్వోన్నతుని విధి. ఆదేశాలను ఇతరులు పాటించి తీరాలి. మన రాజ్యాంగ వ్యవస్థలో రాష్టప్రతి సర్వోన్నతుడు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన వ్యవహారంపై, సంబంధిత పరిణామాలపై రాష్టప్రతి ప్రణవ్ కుమార్ ముఖర్జీ ఆదేశాలనివ్వడం లేదు. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, సలహాలనిస్తున్నారు.

01/05/2017 - 23:57

మొగ్గలు వికసించడం పువ్వులుగా పరిమళించడం సహజమైన పరిణామం, మొగ్గలు మొగ్గలుగానే రాలిపోవడం సృష్టికి అపవాదం! అపవాదాన్ని నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మొగ్గలు రాలిపోతునే ఉన్నాయి, చీకటిలో మగ్గిపోతూనే ఉ న్నాయి. వెలుగు నిరంతరం విస్తరిస్తున్నప్పటికీ సందు చూసుకుని చీకటి తొంగి చూస్తూనే ఉండడం నడుస్తున్న చరిత్ర. దేశంలోని అన్ని రాష్ట్రాలలోను ఈ చరిత్రకు పునరావృత్తి ఏర్పడుతూనే ఉంది..

01/05/2017 - 07:07

మరోసారి ఎన్నికల కదన కాహలి మారుమోగుతోం ది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల సంఘం-ఎలక్షన్ కమిషన్-బుధవారం సుదీర్ఘ కార్యక్రమాన్ని ఆవిష్కరించడంతో ప్రధాన రాజకీయ పక్షాలు అస్తశ్రస్త్రాలకు మరింత పదును పెడుతున్నాయి.

01/04/2017 - 01:02

చట్టంలో ఉన్న నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం ధ్రువపరచింది. ప్రజాప్రాతినిధ్యపు చట్టం- రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్-లోని నూట ఇరవై మూడవ నిబంధన ఎన్నికల అవినీతి పద్ధతుల- కరప్ట్ ప్రాక్టీసెస్-ను గురించి వివరిస్తోంది. ఈ నిబంధనలోని మొదటి ఉప నిబంధన ప్రకారం వోటర్లకు లంచం ఇవ్వడం అవినీతి. అక్రమంగా వోటర్లను ప్రభావితం చేయడం రెండవ ఉప నిబంధన ప్రకారం మరో అవినీతి పద్ధతి.

01/03/2017 - 01:38

ఉత్కంఠను తట్టుకోలేని రాహుల్ గాంధీ లండన్‌కు వెళ్లిపోవడం ఉత్తరప్రదేశ్‌లో జరిగిపోతున్న అరాజక వీధినాటకంలో ప్రధాన ఘట్టం. సమాజ్‌వాదీ పార్టీ- సపా-నాయకులు, కార్యకర్తలుగా చెలామణి అవుతున్న దౌర్జన్యకారులు గత వారం రోజులుగా ప్రదర్శిస్తున్న ఈ వీధి నాటకాన్ని చూసిచూసి విసుగుపుట్టిన రాహుల్‌గాంధీకి బహుశా విశ్రాంతి అవసరమైంది. అందువల్ల ఆయన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకడానికై ఇంగ్లాండ్‌కు వెళ్లి కూర్చున్నాడట!

01/02/2017 - 00:47

నగదు రహిత నాగరికం గురించి ప్రభుత్వం వారు యాబయి రోజులకు పైగా విచిత్ర విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం మొదలైన సందర్భంగా పాత సంవత్సరం చివరి రోజున ప్రధాన మంత్రి చేసిన శుభప్రసంగం ఈ వైచిత్రికి మరోసారి అద్దంపట్టింది. పాత ఐదువందల, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయడం ప్రభుత్వం సాధించిన విప్లవాత్మక పరిణామం!

12/31/2016 - 00:27

దేశంలోని ఎనిమిది కోట్ల మందికి మంచినీరు లభించకపోవడం దశాబ్దుల ప్రగతిని వెక్కిరిస్తున్న వాస్తవం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీటి సరఫరా కోసం పథకాలను రచిస్తూనే ఉన్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోతూనే ఉన్నాయి, పొంగి పొరలిన చెఱువులు, బావులు, మడుగులు, గడుగులు, పడియలు, వాగులు, అలుగులు ఎండిపోతున్నాయి, పూడిపోతున్నాయి, అదృశ్యమై పోతున్నాయి! ‘చెఱువు’ అంటే ఏమిటి?

12/30/2016 - 00:26

చిన్నమ్మ-అన్నది ఆమె అసలు పేరన్న అభిప్రాయం కలగడం అసహజం కాదు. ‘చిన్నమ్మ’ పేరుతో చెలామణి అవుతున్న శశికళను అసలు పేరుతో పిలవడానికి ‘అఖిల భారత అన్నా ద్రవిడ మునే్నట్ర కజగం’- అ.్భ.అన్నా ద్ర.ము.క- లోని వారెవ్వరు సాహసించడం లేదు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాలన్న ఆధికారిక తీర్మానంలో ఆమెను ‘చిన్నమ్మ’ అని సంబోధించడం పరాకాష్ఠ.

Pages