S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/28/2016 - 23:53

గోడ దూకడం తోడేలునకు నిరంతర కృత్యం..చైనా మళ్లీ గోడ దూకింది! ఈసారి ఉత్తరఖండ్‌లోకి చొరబడింది! ఒకచోట దూకుతున్న తోడేలును కాపరులు కనిపెట్టనంతవరకు ఆ వికృత మృగం దూకుతూనే ఉంటుంది! కనిపెట్టిన కాపరులు తోలడానికి తరమడానికి బద్ధకించినట్టయితే ఆ కోరల వృకానికి మరింత ధైర్యం వస్తుంది. తరమడానికి వెళ్లినట్టయితే ఆ హింసమృగం తమను కూడ కరిచి గాయపరస్తుందన్న భయం కాపరులకు కలిగితే మరీ ప్రమాదం.

07/28/2016 - 02:55

మరో చారిత్రక రాజకీయ లాంఛనం పూర్తయింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికై హిల్లరీ రోథమ్ క్లింటన్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున నామాంకితురాలయింది. ఆమె అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం ఖాయమన్న విశ్వాసం డెమొక్రాటిక్ పార్టీ జాతీయ మహాసభలో వెల్లివిరిసింది. హిల్లరీ క్లింటన్ డెమొక్రాటిక్ పార్టీ నామాంకితురాలి-నామినీ-గా అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఖాయమని జూన్ నెల ఆరంభంలోనే స్పష్టమైంది.

07/27/2016 - 03:49

హిందీ చలనచిత్ర నటుడు సల్మాన్ ఖాన్ నల్ల జింకను హత్య చేసినట్టు నిరూపించడానికి తగినన్ని ఆధారాలు లేవన్నది రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం సోమవారం చెప్పిన తీర్పు.

07/26/2016 - 00:15

నేపాల్ ప్రధానమంత్రి పదవికి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి రావడం చైనా అమలు జరుపుతున్న రాజకీయ వ్యూహంలో భాగం. ఖడ్గప్రసాద్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి నేపాల్ ఏకీకృత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తుండిన సమయంలోనే ఆయనను పదవిలో నిలబెట్టడానికి చైనా ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోందన్న ప్రచారం జరిగింది. ఖడ్గప్రసాద్ ప్రభుత్వాన్ని గద్దెదించడం లేదా ఆయన పదవిలో కొనసాగడం నేపాల్ అంతర్గత సమస్య.

07/25/2016 - 05:06

ఈ మొత్తం వ్యవహారంలో గొప్ప పైశాచిక ఆనందం నిబిడీకృతమై ఉంది. అది నిరంతరం తన వికృతమైన తలను నిక్కబెడుతూ ఉంది-దేర్ ఈజ్ ఏ గ్రేట్ అవౌంట్ ఆఫ్ సాడిజం ఇన్‌హరెంట్ ఇన్ ది హోల్ అఫైర్, విచ్ హాస్ ఆల్ వేస్ బీన్ పీపింగ్ ఔట్ ఇట్స్ అగ్లీ హెడ్- అన్నది డోనాల్డ్ ట్రంప్ ప్రచార సరళి గురించి అమెరికాలోను ఇతర దేశాలలోను జరిగిపోయిన వ్యాఖ్యల సారాంశం!

07/23/2016 - 00:19

పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పీఓకే-లో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం పాతబడిన సమాచారం. చైనా, పాకిస్తాన్ దళాలు ఉమ్మడిగా ‘సరిహద్దు’ వెంబడి గస్తీ తిరుగుతుండడం సరికొత్త వ్యూహంలో భాగం. లడక్‌లో మన భద్రతా వ్యవస్థ పటిష్ఠమవుతున్న నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తలపెట్టిన సరికొత్త కవ్వింపు చర్య ఇది. చైనాకు, పాకిస్తాన్‌కు మధ్య సహజమైన సరిహద్దు లేదు.

07/21/2016 - 23:53

బుర్హన్ వని వధ తరువాత కల్లోల గ్రస్తమైన కశ్మీర్ లోయ ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు అంతర్గతంగాను, సరిహద్దులకు వెలుపలి నుండి కూడ అవరోధాలు ఎదురవుతుండడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. గురువారం లోక్‌సభలో కశ్మీర్ గురించి జరిగిన చర్చకు ఇదీ నేపథ్యం.

07/21/2016 - 04:26

యావజ్జీవ కారాగారవాస శిక్షను గురించి మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టీకరణ నేర విచారణ ప్రగతికి మరో దిశా నిర్దేశనం. ఈ ఆజీవన నిర్బంధ శిక్ష స్వభావం గురించి, స్వరూపం గురించి ఆవశ్యకత గురించి గతంలో సైతం సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించి ఉంది, విశే్లషించి ఉంది, పథ నిర్దేశనం చేసి ఉంది.

07/20/2016 - 04:37

మన వైద్యులలో అధిక శాతానికి వైద్య వృత్తిని సాగించే అర్హతలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. నకిలీ వైద్యుల గుట్టు నిరంతరం రట్టు అవుతూనే ఉంది. ఈ రట్టవుతున్న వాస్తవాలను ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలో అల్లోపతి డాక్టర్లుగా సేవ చేస్తున్నవారిలో ముప్పయి ఒక్కశాతం కేవలం పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నారట.

07/18/2016 - 23:37

ప్రజలు గెలిచారు. ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజాగళానికి మరింతగా విలువ పెరిగింది. నియంతలు, నియంతృత్వాలకు ఇది కాలం కాదు. సమస్యల పరిష్కారానికి తిరుగుబాట్లు శరణ్యం కాదన్న వాస్తవం మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం కోసం కొనే్నళ్ల క్రితం అరబ్బు దేశాల ప్రజలు తిరగబడి ‘నియంతా..నువ్వెంత,,’అన్న రీతిలో తరిమికొట్టిన చారిత్రక క్షణాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.

Pages