S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

01/29/2016 - 07:36

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనపై విభిన్న విశే్లషణలు, వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఏమయినప్పటికీ రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో రాష్టప్రతి పాలన విధించడానికి వీలు కల్పించే అధికారంపై న్యాయసమీక్ష పరిధి క్రమంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు, దాదాపు క్రీస్తుశకం 1980వ దశకం చివరి వరకూ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం విధించే రాష్టప్రతి పాలనను న్యాయస్థానాలలో ప్రశ్నించడానికి వీలుండేది కాదు.

01/28/2016 - 04:15

హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ విషాదాంత కథ మరింత విషాదకరమైన మలుపు తిరిగింది. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండడని, ఎవరో అతనిని హత్యచేసి ఉంటారని రోహిత్ తండ్రి వేముల నాగమణి కుమార్ మంగళవారం విజయవాడలో వ్యక్తం చేసిన అనుమానం ఈ విషాదతరమైన మలుపు...నిండు నూరేళ్లు జీవించవలసి ఉండిన రోహిత్ ఇలా మొగ్గగానే రాలిపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యం.

01/27/2016 - 03:17

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మనదేశంలో జరిపిన పర్యటన ఐరోపాలోని ప్రధాన దేశాలతో మనకు పెరుగుతున్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక మైత్రికి నిదర్శనం. ఇరవైతొమ్మిది దేశాల ఐరోపా సమాఖ్య వారు అప్పుడప్పుడు మనదేశం పట్ల వ్యూహాత్మక వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారు. మనదేశంలో అక్రమ ప్రమేయం కల్పించుకొనడానికి యత్నిస్తున్నారు.

01/25/2016 - 23:34

నేపాల్ ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో విజ్ఞత మళ్లీ మొలకెత్తడం హర్షణీయ పరిణామం. ఈ మొలకలు పల్లవించి, పరిమళిస్తాయా అన్నది వేచి చూడవలసిన వ్యవహారం. తెరాయ్ ప్రాంతలోని మాధేశీలు తదితర జనసముదాయాల ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదం చేయగల రెండు రాజ్యాంగ సవరణలను శనివారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించడం హర్షణీయ పరిణామం. ఈ సవరణలను మన ప్రభుత్వం స్వాగతించడం సహజం.

01/24/2016 - 23:52

నేతాజీ సుభాస్ చంద్రుడు అమరుడు...అమరుడు అని చెప్పడం ప్రతీక-సింబాలిక్-మైన అభివర్ణన కాదు, భారత జాతీయ చారిత్రక జీవన వాస్తవం! ఈ వాస్తవం శనివారంనాడు మరోసారి సమావిష్కృతమైంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద దస్త్రాలను ప్రధాని నరేంద్ర మోదీ సార్వజనీకరించడం ఈ నూతన ఆవిష్కరణ!

01/22/2016 - 23:29

దేశవ్యాప్తంగా జిహాదీ ఉగ్రవాదులు పట్టుబడుతుండడం పాకిస్తాన్ ప్రభుత్వపు ఉసిగొలిపే విధానంలో మార్పు రాలేదనడానికి సరికొత్త నిదర్శనం. ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం పేరుతో చెలామణి అవుతున్న జిహాదీ ముఠాకు చెందిన పధ్నాలుగు మంది పట్టుబడడం విస్తరించిపోతున్న ఉగ్రవాద విష వ్యూహానికి మరో సాక్ష్యం.

01/21/2016 - 23:33

తిమింగలాలను దిగమింగుతున్న కాలుష్యం తాబేళ్లను మాత్రం వదలిపెడుతుందా? కాలుష్యం, అతి భయంకరమైన పరిణామాలకు కారణం! భూమి ఉపరితలంపై ఏనుగులు సముద్ర జలాలలో తిమింగలాలు పెద్ద జంతువులు. పిల్లలకు పాలిచ్చి పెంచే తిమింగలాలు భూమిపై ఏనుగుల వలెనే సముద్రంలో సాధు జంతువులు. ఈ సాధు జంతువులు చెలరేగినప్పుడు హాని జరుగుతుంది, కానీ మామూలుగా ఉన్నప్పుడు అవి మానవులకు హాని చేయవు!

01/21/2016 - 04:16

నమామి గంగే-గంగానదీ నమస్కారం-అన్నది గంగానది ప్రక్షాళన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరు! నమస్కారం భక్తికి చిహ్నం...కానీ గంగా ప్రక్షాళన-క్లీన్ గంగా పథకం నినాదాలకు మాత్రమే పరిమితమై పోయిందన్న జాతీయ హరిత న్యాయమండలి వ్యాఖ్య ప్రభుత్వ నిర్వాహకులకు మరో అభిశంసన!

01/20/2016 - 05:04

ప్రాథమిక విద్యకు ఆంగ్లభాషా దాస్యం నుండి విముక్తి లభించగలదన్న ఆశలు మళ్లీ అంకురిస్తున్నాయి. క్రమంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంగా మాత్రమే బోధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు మాధ్యమాలలో ప్రచారవౌతోంది.

01/18/2016 - 23:40

చిత్రవిచిత్ర మానసిక శారీరక వ్యాధులకు గురి అయినవారిని బహుళ జాతీయ వాణిజ్య సంస్థల యజమానులు వెక్కిరిస్తుండడం ప్రపంచీకరణ మారీచ మృగ మాయాజాలంలో భాగం. ఎండోసల్ఫాన్ అన్న క్రిమినాశక రసాయనం లక్షల ప్రజల బతుకులను నాశనం చేయడం ఒక ఉదాహరణ మాత్రమే. ఎండోసల్ఫాన్‌ను ప్రపంచమంతటా నిషేధించిన తరవాత మాత్రమే మనదేశంలో నిషేధించడం ప్రభుత్వ నిర్వాహకుల ప్రపంచీకరణ నిబద్ధతకు ఒక సాక్ష్యం మాత్రమే.

Pages