S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/13/2018 - 02:49

వెయ్యి ఏనుగుల్ని తిన్న రాబంధు సైతం ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. ఇది తెలుగు నానుడి. వెయ్యి టెస్ట్‌లాడిన ఇంగ్లీష్ జట్టు టీమిండియా ముందు మోకరిల్లుతుంది. ఇది సిరీస్ ఆరంభంలో క్రికెట్ నానుడి. కాకపోతే, ఇక్కడ టీమిండియా గాలివాన కాలేదు. వెయ్యి టెస్ట్‌లు ఆడిన ఇంగ్లీషోళ్లు రాబంధులూ కాలేదు. పైగా సీన్ రివర్స్ అయ్యింది. ఆశలు, అంచనాలు వాస్తవాలు కాజాలవన్న విషయం రెండో టెస్ట్ పూర్తయ్యేసరికి అర్థమైంది.

08/13/2018 - 02:47

హో చి మిన్ సిటీ, ఆగస్టు 12: ఇండియన్ షట్లర్ అజయ్ జయరామ్ టైటిల్‌కు అడుగు దూరంలోనే ఆగిపోయాడు. వియత్నాం ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో జయరామ్‌పై ఇండోనేసియా ప్రత్యర్థి షెసర్ హిరెన్ రుస్తావితో సునాయాస విజయం సాధించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అటాక్ ఇవ్వలేకపోయిన జయరామ్ 14-21, 10-21 సెట్లతో పరాజయాన్ని చవిచూసి టోర్నీ రన్నరప్‌గా నిలిచాడు.

08/13/2018 - 02:45

జకర్తా, ఆగస్టు 12: ఓ పక్క తీవ్రవాద భయం. మరోపక్క తీవ్ర ట్రాఫిక్‌మయం. మధ్యలో స్థానిక నేరగాళ్ల చేతివాటం. అప్పుడప్పుడూ మండే అడవులతో దట్టంగా అలముకునే పొగ. అయినా క్రీడా పండుగకు సర్వం ముస్తాబైంది. ఆరంభానికి సమయమూ ఆసన్నమైంది. కౌంట్‌డౌన్‌గా జకర్తా, పాలెంబాగ్‌లు రోజులు లెక్క పెడుతున్నాయి. ఆసియా క్రీడోత్సవం వారం దూరంనుంచి ఊరిస్తోంది.

08/12/2018 - 04:26

లండన్: జానీ బెయిర్‌స్టో (93- 144 బంతుల్లో). క్రిస్ వోక్స్ (120- 159 బంతుల్లో). ఇద్దరే ఇద్దరు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆడేశారు. 107 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించిన భారత్ ముందు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 250 పరుగుల ఆధిక్యత ఉంచారు. ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 357 పరుగులు సాధించింది. సరిపడా వెలుతురు లేకపోవడంతో 81 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ముగించారు.

08/12/2018 - 00:06

హో చి మిన్ సిటీ, ఆగస్టు 11: ఈ సీజన్‌లో తొలి టైటిల్ కోసం భారత సీనియర్ షట్లర్ అజయ్ జయరామ్ అహరహం కృషి చేస్తున్నాడు. వియత్నాం ఓపెన్ టూర్ సూపర్ 100 టోర్నీ సెమీఫైనల్‌లో జపాన్ ప్రత్యర్థి యు ఇగరషిని శనివారం స్ట్రెయిట్ గేమ్స్‌లో (21-14, 21-19) మట్టికరిపించి ఫైనల్‌కు చేరాడు. ఇదిలావుంటే, మరో సెమీఫైనల్ హోరాహోరీ పోరులో భారత షట్లర్ మిథున్ మంజునాథ్ ఇండోనేసియా ప్రత్యర్థి రుస్తావితో చేతిలో ఓటమి పాలయ్యాడు.

08/11/2018 - 23:53

లండన్, ఆగస్టు 11: కోహ్లీతో జరుగుతోన్న తాజా యుద్ధం తనకెంతో సౌకర్యంగా ఉందని అంటూనే, టీమిండియా మొత్తం కోహ్లీపైనే ఆధారపడిందన్న వాదనను ఆండర్సన్ కొట్టిపారేశాడు. ‘అందర్నీ ఎదుర్కొన్నట్టే కోహ్లీని ఎందుకు ఎదుర్కోలేమనే ఆలోచిస్తుంటా. అతనికి, నాకూ మధ్య జరుగుతోన్న పోరును ఎంజాయ్ చేస్తున్నా. ప్రపంచంలో అతను నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ కావొచ్చు. నా వరకు ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లతో తలపడటానికే ఇష్టపడతా.

08/11/2018 - 23:53

లండన్, ఆగస్టు 11: సవాళ్లతోకూడిన ప్రతికూల వాతావరణంలో టీమిండియా పొరబాట్లు చేసిన మాట వాస్తవం. మరోపక్క అలవాటుపడిన వాతావరణంలో ఇంగ్లాండ్ సీమర్లు చక్కని ప్రతిభ చూపించారు. దీంతో లార్డ్స్‌లో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 107 పరుగుల వద్దే ఆలౌటైందని వైస్ కెప్టెన్ రహానె అభిప్రాయపడ్డాడు. ‘ఇంతకంటే ప్రతికూల వాతావరణాన్ని బహుశ ఇంకెప్పుడూ ఎదుర్కోమేమో.

08/11/2018 - 23:52

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆసియా గేమ్స్, ఒలింపిక్ 2020లో పసిడి పతకాలపై దృష్టి పెట్టమంటూ భారత ఒలింపిక్ చాంపియన్ అభినవ్ బింద్రా పిలుపునిచ్చాడు. అంతేకాదు, అథ్లెట్లలో ప్రేరణ నింపేందుకు చారిత్రక పసిడి పతకం సాధించి పదేళ్లయిన సందర్భంగా అప్పటి ప్రదర్శనను వీడియో రూపంలో విడుదల చేశాడు.

08/11/2018 - 02:27

లండన్: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్ట్ రెండో రోజు వరుణుడి దోబూచులాట మధ్య మొదలైంది. ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో 107 పరుగులకే భారత్ ఆలౌటై దారుణ స్థితిలో వుంది. ఓపెనర్ల నుంచి మిడిల్ ఆర్డర్ వరకూ బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు.

08/11/2018 - 01:40

న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఆసియా గేమ్స్‌లో భారత బృందానికి అగ్రభాగాన పతాకధారియై నిలిచే అవకాశం అందింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జకర్తా, పాలెంబాగ్‌లో జరగనున్న ఆసియా గేమ్స్ ఆరంభ వేడుకల్లో భారత బృందానికి ముందు పతాకధారియై నిలబడి జట్టును చోప్రా నడిపిస్తాడని భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఏ) ప్రకటించింది.

Pages