S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/16/2018 - 00:52

వెల్లింగ్టన్, ఆగస్టు 15: న్యూజిలాండ్ కొత్త కోచ్‌గా మాజీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ గారీ స్టెడ్ నియమితుడయ్యాడు. స్టెడ్ నియామకం న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న సరైన నిర్ణయంగా క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ‘కోచ్ హెస్సన్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. న్యూజిలాండ్ జట్టును మేటిగా తీర్చిదిద్దడానికి అహరహం కృషి చేశాడు.

08/16/2018 - 01:36

లండన్, ఆగస్టు 15: టీమిండియా మొత్తం విరాట్ కోహ్లీపైనే ఆధారపడిందన్న వ్యాఖ్యలు ఎంతమాత్రం సహేతుకం కాదని శ్రీలంక మాజీ స్కిప్పర్ కుమార్ సంగక్కర అన్నాడు. సరైన ప్రిపరేషన్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి రెండు టెస్టుల్లో భారత్ విఫలమైంది తప్ప, జట్టును తక్కువ అంచనా వేయొద్దన్నాడు. ‘జట్టు మొత్తం కోహ్లీపైనే ఆధారపడిందన్న వ్యాఖ్యలు ఇతర బ్యాట్స్‌మెన్లను అవమానించడమే.

08/15/2018 - 05:05

లండన్: బలహీనంగావున్న భారత జట్టుకు బూస్ట్‌లాంటి వార్త. పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయాల నుంచి కోలుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఎంపిక కమిటీకి అందుబాటులోకి వచ్చాడు. రెండు టెస్ట్‌ల లీడ్ సాధించిన ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లో శనివారం మొదలయ్యే మూడో టెస్ట్ జట్టులో బుమ్రా ఆడే అవకాశం కనిపిస్తోంది.

08/15/2018 - 00:20

లండన్, ఆగస్టు 14: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌లు చేజార్చుకున్న టీమిండియా.. ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆటగాళ్ల ఫాంనుంచి జట్టు ఎంపిక వరకూ, కోచ్ నుంచి కెప్టెన్ వరకూ.. అన్ని కోణాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. పొగడ్తలతో ప్రత్యర్థుల వెటకారం ఒకవైపు, పరిస్థితిపై అభిమానుల వేదన మరోవైపు.. ఇలా టీమిండియా తీవ్ర వత్తిడి ఎదుర్కొంటోంది.

08/15/2018 - 00:47

* దేశాలనుంచి దిగుతున్న అథ్లెట్లు *భద్రతా బలగాల భారీ మోహరింపు

08/15/2018 - 00:17

న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత మహిళా క్రికెట్ ప్రధాన కోచ్‌గా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పోవర్ నియమితులయ్యాడు. శ్రీలంక టూర్, అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్, నవంబర్‌లో వెస్టిండీస్‌లో ఐసీసీ నిర్వహించనున్న వరల్డ్ టీ-20 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించే వరకూ పోవర్ ఈ పదవిలో కొనసాగుతాడు. ‘్భరత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రమేష్ పోవర్‌ను బీసీసీఐ నియమించింది.

08/14/2018 - 01:37

లండన్: భారత బ్యాటింగ్ యూనిట్ వైఫల్యానికి మానసిక ఇబ్బందులే తప్ప సాంకేతిక సమస్యలేవీ కారణం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ‘గేమ్‌ను సింపుల్‌గా తీసుకోండి. అనవసర అయోమయంతో వత్తిడికి గురికావొద్దు’ అంటూ జట్టుకు సూచన కూడా చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ తొలి (107), మలి (130) ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది.

08/14/2018 - 00:58

లండన్, ఆగస్టు 13: వెయ్యో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌కు చారిత్రక విజయాన్ని కట్టబెట్టిన బెన్ స్టోక్స్ మూడో టెస్ట్‌కూ అవకాశం దక్కలేదు. బ్రిస్టల్‌లో అనుచిత ప్రవర్తనకుగాను క్రౌన్ కోర్టులో కేసు విచారణను ఎదుర్కొంటున్న స్టోక్స్‌ను సెలెక్టర్లు దూరం పెట్టారు. తొలి టెస్ట్‌లో అద్వితీయ విజయానికి కారకుడైన స్టోక్స్, బ్రిస్టల్ కేసు కారణంగా మలి టెస్ట్‌కే కాదు, మూడో టెస్ట్‌కూ దూరంకాక తప్పలేదు.

08/14/2018 - 00:58

దుబాయ్, ఆగస్టు 13: పరాక్రమ విరాటుడు టెస్ట్ క్రికెట్ టాప్ మెట్టునుంచి ఒక మెట్టు కిందికిదిగాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో టాప్‌కు ఎదిగిన కోహ్లీ, లార్డ్స్‌లో విస్మయపర్చిన ఇన్నింగ్స్‌తో ద్వితీయానికి దిగిపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన విరాట్ కోహ్లీ, తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో ద్వితీయస్థానానికి పరిమితమయ్యాడు.

08/14/2018 - 00:57

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా తడబాటు వ్యవహారంలో చీఫ్ కోచ్ రవిశాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యాలపై గుర్రుగావున్న బీసీసీఐ, నాట్టింగ్‌హామ్‌లో శనివారం నుంచి మొదలవుతున్న మూడో టెస్ట్ పూర్తయ్యేవరకూ ఓపికపట్టనున్నట్టు తెలుస్తోంది.

Pages