S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/07/2018 - 00:13

బర్మింగ్‌హామ్, ఆగస్టు 6: ద్రోణాచార్యుడిని కుప్పకూల్చాలంటే ‘అశ్వద్థామ హతః’ సమాచారాన్ని ఆయన చెవిన వేయాలి. ఇది కురుక్షేత్ర సన్నివేశం. పరుగుల యంత్రం విరాట్‌ను కట్టడి చేయాలంటే జట్టును కుప్పకూల్చడం ఒక్కటే మార్గం. ఇది మలి టెస్ట్ కోసం ఇంగ్లీష్ జట్టు ప్రతిపాదించుకున్న నియమం. ఆశ్చర్యం అనిపించినా, ఇంగ్లాండ్ కోచ్ మాత్రం ఇదే నియమాన్ని పాటించమని జట్టుకు నూరిపోస్తున్నాడు. ‘జట్టును కుప్పకూల్చండి.

08/07/2018 - 00:11

న్యూఢిల్లీ, ఆగస్టు 6: వరల్డ్ చాంప్ మీరాబాయి చాను ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా సందేహాస్పదమే. వచ్చే ఒలింపిక్‌లో చాను పాల్గొనాలంటే, జకర్తా ఈవెంట్ నుంచి ఉపశమనం కలిగించడమే మంచిదని చీఫ్ కోచ్ విజయ్ శర్మ సిఫార్స్ చేస్తున్నాడు. కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ చాను గత మేనుంచి గుర్తించలేని కటి నొప్పితో ఇబ్బంది పడుతోంది.

08/07/2018 - 00:09

హో చి మిన్ సిటీ, ఆగస్టు 6: వియత్నాం ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ నుంచి భారత షట్లర్, ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య తప్పుకున్నాడు. మోకాలి కండరాల్లో తీవ్రమైన నొప్పి కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నట్టు మెంటార్, మాజీ జాతీయ కోచ్ విమల్ కుమార్ వెల్లడించాడు. ‘వియత్నాం టోర్నీ నుంచి లక్ష్య తప్పుకున్నాడు. ఆసియా జూనియర్ టోర్నీ నుంచి వచ్చిన దగ్గరి నుంచీ అతను మోకాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.

08/06/2018 - 23:41

న్యూఢిల్లీ, ఆగస్టు 6: వచ్చే ఏడాదినుంచి మళ్లీ పాఠశాలల్లో ఆటల పీరియడ్ మొదలవుతుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాధోడ్. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం అవసరమైతే సిలబస్‌ను 50శాతానికి కుదించే యోచన కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచే ‘ఆటల పీరియడ్’ కచ్చిత అమలుకు ఆదాశాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

08/06/2018 - 04:34

దుబాయ్: ఒకే ఒక్కడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై శతకం సాధించిన వీరుడు. జట్టు ఓడితేనేమి వాడొక్కడు గెలిచాడు. ఇప్పుడు సరికొత్త విరాట్ పర్వానికి తెరలేపాడు. ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో టాపర్ కోహ్లీ. 32 నెలలపాటు ఈ స్టేటస్‌లోవున్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రికార్డుకు ఆదివారంతో బ్రేక్‌పడింది.

08/06/2018 - 03:13

బర్మింగ్‌హామ్, ఆగస్టు 5: ఇంగ్లాండ్ చారిత్రక వెయ్యో టెస్ట్‌లో గెలుపు గుర్రమై నిలిచిన బెన్ స్టోక్స్ రెండో టెస్ట్‌లో ఉండకపోవచ్చు. అభిమానులకు షాకింగ్ న్యూసే అయినా, వ్యక్తిగత కేసు కారణంగా స్టోక్స్ ఆడకపోవచ్చని అంటున్నారు. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఆడనున్న రెండో టెస్ట్ లాడ్స్‌లో ఆగస్టు 9నుంచి మొదలవుతుంది.

08/06/2018 - 03:11

నాన్జింగ్ (చైనా), ఆగస్టు 5: భారత్ ఆశలు నీరుగారాయి. ఈసారి ఖాయమనుకున్న స్వర్ణం మరోసారి చేజారింది. ప్రపంచ కప్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. గత 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకానికి దగ్గరైన సింధును అడ్డుకున్న మారినే మరోసారి భారత్ ఆశలకు చెక్ పెట్టింది.

08/06/2018 - 00:22

ప్రపంచ విజేత హోదాలో పసిడి పతకం అందుకోవాలన్న భారత్ ఆశలు మరోసారి అడుగు దూరంలో ఆగిపోయాయి. ప్రపంచ కప్ బాడ్మింటన్ టోర్నీలో అలుపెరుగని ప్రదర్శనతో చివరి అంకానికి చేరిన స్టార్ షట్లర్ పీవీ సింధు, ఆఖరి పోరాటంలో మరోసారి తడబడింది. ఫలితంగా స్పెయిన్ సీడ్ కరోలినా మారిన్ మరోసారి స్వర్ణ పతకం సాధిస్తే, రన్నరప్‌గా నిలిచిన సింధు రజత పతకాన్ని సాధించింది.

08/05/2018 - 01:53

నాన్జింగ్ (చైనా): సుదీర్ఘ ర్యాలీలు.. చక్కని ప్లేస్‌మెంట్లు.. వ్యూహాత్మక మైండ్‌గేమ్. సెమీఫైనల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు చెలరేగిపోయింది. క్వార్టర్స్‌లో నిజోమి ఒకుహరను మట్టికరిపించి పతకం ఖాయం చేసుకున్న సింధు, సెమీస్‌లో యమగుచిని ఓడించి స్వర్ణానికి ‘ఫైనల్’ దూరంలో నిలిచింది. తుది పోరులో చిరకాల స్పెయిన్ ప్రత్యర్థి కరోలినా మారిన్‌ను ఎదుర్కోబోతోంది. గెలిస్తే.. చిరకాల స్వప్నం సాకారమే.

08/05/2018 - 01:32

బర్మింగ్‌హామ్, ఆగస్టు 4: చివరి వరకూ ఊరించిన విజయం చివరి క్షణంలో ఉసూరుమనిపించడంతో గుండెలవిసే బాధలో టీమిండియా మునిగిపోయింది. విరాట్ కోహ్లీ శతక పంతాన్ని ఛేదించి తొలి టెస్ట్‌లో ఇంగ్లీషోళ్లే గెలుపు తలుపుతట్టారు. సొంత గడ్డపై టెస్ట్ గుత్త్థాపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ‘తొలి’ అడుగువేశారు. వెయ్యో టెస్ట్‌లో విజయం, అదీ భారత్‌పై వాళ్లకెప్పటికీ ఆనందమే. నిజానికి భారత్ విజయం 31 పరుగుల దూరంలో ఆగిపోయింది.

Pages