S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/08/2018 - 02:43

ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో
రజత పతకం కైవసం చేసుకున్న తర్వాత హైదరాబాద్ గోపీచంద్ అకాడమీలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతున్న
పీవీ సింధు

08/08/2018 - 02:40

లండన్, ఆగస్టు 7: ప్రపంచ క్రికెట్ అంటే ఎంతో ప్రాణప్రధంగా భావించి ఆడే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్ వంటి క్రికెటర్ల అవసరం ఎంతో ఉందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ఇదే ప్రపంచ క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ లేదా రాహుల్ ద్రవిడ్ వంటి వారు కూడా అత్యంత కీలకమేనని ఆయన అన్నాడు.

08/08/2018 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 7: జాతీయ జట్టుకు ఒక క్రికెటర్‌ను ఎంపిక చేయాలంటే అతని వయసుతో పనిలేదని, ప్రతిభ ముఖ్యమని క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ అన్నాడు. ‘ఒక వ్యక్తి బాగా ఆడాడంటే అతను జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించవచ్చు. ఇందుకు అతని వయసును ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించాడు.

08/08/2018 - 02:35

న్యూఢిల్లీ, ఆగస్టు 7: వెయిట్‌లిఫ్టింగ్‌లో మనదేశానికి చెందిన ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను ఇండోనేషియాలోని జకార్తాలో నిర్వహించే ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. గత కొంతకాలం నుంచి నడుం నొప్పితో బాధపడుతున్న ఆమె కోలుకునేందుకు మరింత సమయం పడుతున్న నేపథ్యంలో ఆసియా క్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లేనట్టే.

08/07/2018 - 23:53

షార్జా, ఆగస్టు 7: షార్జాలో ఈ ఏడాది 23న నిర్వహించనున్న టీ-10 లీగ్ మ్యాచ్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీ-10 టోర్నమెంట్ నిర్వహించేందుకు వీలుగా నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకుల నుంచి భరోసా వచ్చిన తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికార ప్రతినిధి పీటీఐకి తెలిపాడు.

08/07/2018 - 23:53

లండన్, ఆగస్టు 7: ఇంగ్లాండ్‌తో ఈనెల 9నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా జట్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడే అవకాశం లేదు. ఐర్లాండ్‌తో ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ-20 మ్యాచ్‌లో బుమ్రా ఎడమచేతికి తీవ్ర గాయమైంది. అప్పటినుంచి తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. అయితే, బుమ్రా గాయం నుండి కోలుకుంటున్నాడని, రెండో టెస్టుమ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని బీసీసీఐ కొద్దిరోజుల కిందట ప్రకటించింది.

08/07/2018 - 23:52

లాస్‌ఏంజిల్స్, ఆగస్టు 7: గత ఏడాది కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత నుంచి ప్రసవానంతర సమస్యలు తనను బాధిస్తున్నాయని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ వాపోతోంది. 23సార్లు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను తన ఖాతాలో జమచేసుకున్న ఈ 36 ఏళ్ల స్టార్ దిగ్గజం గర్భం దాల్చడంతో గత ఏడాది జరిగిన డబ్ల్యూటీఏ సీజన్‌లో ఆడలేకపోయింది.

08/07/2018 - 23:52

ముంబయి, ఆగస్టు 7: గత కొనే్నళ్లుగా తాను చూస్తున్న యువ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. దిగ్గజ ఆటగాడికి మరికొంత దూరంలో కోహ్లీ ఉన్నాడని అనానడు.

08/07/2018 - 21:18

హైదరాబాద్: ప్రపంచ చాంపియన్ షిప్ అనేది పెద్ద టోర్నీ అని స్టార్ షట్లర్ పీవీ సింధూ అన్నారు. ప్రపంచచాంపియన్ షిప్‌లో రజితం సాధించి స్వదేశానికి చేరుకున్న ఆమె గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడారు. అందరూ పతకం సాధించాలనే వెళతామని, తాను కూడా అలాగే వెళ్లానని పీవీ సింధూ అన్నారు. ఏకాగ్రతతో ఆడటం వల్లే తాను రజితం సాధించగలిగానని అన్నారు.

08/07/2018 - 04:51

స్పోర్ట్స్ డెస్క్: ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ టెన్నిస్) ప్రపంచ ర్యాంకుల్లో స్పెయిన్ సీడ్ రాఫెల్ నాదల్ తన నెం1 స్థానాన్ని నిలుపుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో నాదల్ 9,310 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిస్తే, తరువాతి స్థానాన్ని స్విస్ ఆటగాడు రోగర్ ఫెదరర్ (7,080) ఆక్రమించాడు.

Pages