S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/11/2017 - 00:47

చెన్నై, నవంబర్ 10: భారత మాజీ టెస్టు క్రికెటర్ ఏజీ మిల్కా సింగ్ శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్న ఆయన వయసు 75 సంవత్సరాలు. 1960 దశకం ఆరంభంలో అతను నాలుగు టెస్టుల్లో ఆడాడు. అతని అన్న కృపాల్ సింగ్ భారత మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. సోదరుడి స్ఫూర్తితో క్రికెట్‌లో రాణించిన మిల్కా సింగ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా సేవలు అందించాడు.

11/11/2017 - 00:47

న్యూఢిల్లీ, నవంబర్ 10: క్రికెటర్లకు డోప్ పరీక్షను నిర్వహించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తేల్చిచెప్పింది. తాత్సాలికంగా శక్తిసామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా లాభపడాలని అనుకునే క్రీడాకారులు మాదక ద్రవ్యాలను వాడడం కొత్తేమీ కాదు. ఎంతో మంది ఒలింపియన్లు సైతం డోప్ పరీక్షలో పట్టుబడుతున్నారు.

11/11/2017 - 00:46

సిడ్నీ, నవంబర్ 10: ఇంగ్లాండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ దూరమయ్యాడు. చాలాకాలంగా వేధిస్తున్న వెన్నునొప్పి మరోసారి తిరగబెట్టడంతో అతను ఈనెల 23 నుంచి మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) స్పోర్ట్స్ మెడిసిన్ మేనేజర్ అలెక్స్ కౌంటోరిస్ తెలిపాడు.

11/10/2017 - 00:56

కోల్‌కతా, నవంబర్ 9: భారత్‌తో జరిగే టెస్టుల్లో నలుగురు బౌలర్ల వ్యూహానే్న అనుసరిస్తామని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ సూచన ప్రాయంగా తెలిపాడు. యుఎఇలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రీలంక ఐదుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడింది. గురువారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం చండీమల్ విలేఖరులతో మాట్లాడుతూ, దుబాయ్‌లోని వాతావరణానికి, అక్కడి పిచ్‌ల తీరుకు ఆ వ్యూహం సత్ఫలితాలనిచ్చిందని చెప్పాడు.

11/10/2017 - 00:54

కోల్‌కతా, నవంబర్ 9: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అంటే తాము బెదిరిపోవడం లేదని, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక చీఫ్ కోచ్ నిక్ పొథాస్ స్పష్టం చేశాడు. శ్రీలంక క్రికెటర్లు గురువారం నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు.

11/10/2017 - 00:52

కోల్‌కతా: శ్రీలంకతో జరిగే రెండు రోజుల టూర్ మ్యాచ్‌లో పాల్గొనే బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టుకు వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నమన్ ఓఝా గాయపడడంతో అతని స్థానంలో సెలక్టర్లు శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించారు. నమన్‌కు బదులు పంజాబ్ యువ బ్యాట్స్‌మన్ అన్‌మోల్‌ప్రీత్ సింగ్‌కు జట్టులో చోటు కల్పించారు.

11/10/2017 - 00:52

కోల్‌కతా, నవంబర్ 9: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి దూరమైనప్పటికీ, ఆ ఫార్మాట్ పట్ల ఇప్పటికీ ఆసక్తిని ప్రదర్శిస్తునే ఉన్నాడు. మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో కలిసి ఇక్కడ ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్‌కు అతను హాజరయ్యాడు. షూటింగ్ విరామం ప్రకటించగానే, ఈడెన్ గార్డెన్స్ మైదానానికి వెళ్లాడు. అక్కడ పిచ్ తీరును ఎంతో ఆసక్తిగా పరిశీలించాడు.

11/10/2017 - 00:50

మిలాన్, నవంబర్ 9: దక్షిణ కొరియా ఆటగాడు హుయెన్ చుంగ్ ఇక్కడ జరుగుతున్న నెక్ట్స్ జనరేషన్ ఎటిపి టూర్ ఫైనల్స్‌లో సెమీ ఫైనల్ చేరాడు. ప్రతి ఏడాది చివరిలో అటు మహిళలు, ఇటు పురుషుల విభాగంలో మేటి స్టార్ల మధ్య టూర్ ఫైనల్స్ జరుగుతాయి. డబ్ల్యుటిఎ ఆధ్వర్యంలో జరిగే మహిళల టూర్ ఫైనల్స్ టైటిల్‌ను కరోలిన్ వొజ్నియాకి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తుది పోరులో ఆమె వీనస్ విలియమ్స్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించింది.

11/10/2017 - 00:49

న్యూఢిల్లీ, నవంబర్ 9: సోషల్ మీడియాతో ఎంతో విలువైన సమయం వృథా అవుతున్నదని, కాబట్టి, దాని బదులు ఔట్ డోర్ క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ యువతకు స్పష్టం చేశాడు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ తాను కూడా ఒకప్పుడు ఎక్కువ సమయాన్ని ఈ విషయం సోషల్ మీడియాలో గడిపేవాడనని అన్నాడు.

11/10/2017 - 00:48

దమ్మామ్ (సౌదీ అరేబియా), నవంబర్ 8: ఎఫ్‌సి అండర్-19 చాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్‌ను భారత్ సమర్థంగా ముగించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో తుర్కమెనిస్తాన్‌ను ఢీకొన్న భారత్ 3-0 తేడాతో గెలిచింది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధం మొదట్లోనూ రెండు జట్లు ఆచితూచి ఆడాయి.

Pages