S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/27/2016 - 02:27

మెల్బోర్న్, డిసెంబర్ 26: పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సోమవారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటను వర్షం వెంటాడింది. మొత్తం 50.5 ఓవర్ల ఆట సాధ్యంకాగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నాలుగు వికెట్లకు 142 పరుగులు చేసింది. ఓపెనర్ అజర్ అలీ 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, పాక్‌కు భారీ స్కోరును అందించే దిశగా సాగుతున్నాడు.

12/27/2016 - 02:26

బెంగళూరు, డిసెంబర్ 26: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో సైనా నెహ్వాల్ ఆడినంత మాత్రాన నష్టమేమీ జరగదని ఆమె కోచ్ విమల్ కుమార్ స్పష్టం చేశాడు. మోకాలి గాయానికి ఇంగ్లాండ్‌లో శస్త్ర చేయించుకున్న సైనా ఇటీవలే మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమె గతంలో మాదిరి రాణించలేకపోతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

12/27/2016 - 02:24

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 26: ఓపెనర్ టామ్ లాథమ్ శతకంతో కదంతొక్కగా, బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్ 77 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 341 పరుగుల భారీ స్కోరు చేయగా, అందుకు సమాధానంగా బంగ్లాదేశ్ 44.5 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.

12/27/2016 - 02:23

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 26: శ్రీలంకతో సోమవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయా నికి దక్షిణాఫ్రికా ఆరు వికెట్లకు 267 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టుకు ఓపెనర్లు స్టెఫెన్ కుక్, డీన్ ఎల్కార్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 104 జోడించిన తర్వాత కుక్ (59) అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయంది.

12/27/2016 - 02:22

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 26: రాష్ట్రంలో 2018 జాతీయ క్రీడలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటించినప్పటికీ భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఒఎ) మాత్రం ఇప్పటివరకూ దానిపై అధికారిక ప్రకటన చేయలేదు. ఇందుకు అవసరమైన కసరత్తు సక్రమంగా జరగకపోవడంతో రాష్ట్రానికి జాతీయ క్రీడల నిర్వహణ బాధ్యతలు దక్కలేదలేదు.

12/26/2016 - 05:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారత క్రికెట్ జట్టు, జూనియర్ హాకీ జట్లు ఇటీవల సాధించిన అద్వితీయ విజయాలను చూసి యావత్ దేశం గర్విస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’లో ఆయన క్రీడా రంగాన్ని కూడా ప్రస్తావించారు. గత పదిహేను రోజుల కాలంలో ఈ రెండు జట్లూ చిరస్మరణీయ విజయాలను సాధించాయని అన్నారు.

12/26/2016 - 02:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే, టెస్టు పార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రోత్సాహమే యువ క్రికెటర్లకు బలాన్నిస్తున్నది, ఇది శుభసూచకమని భారత్ ‘ఎ’, అండర్-19 క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

12/26/2016 - 02:26

మెల్బోర్న్, డిసెంబర్ 25: దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, చివరి టెస్టును గెల్చుకోవడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియాకు పాకిస్తాన్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన మొదటి టెస్టు మరింత ఉతాత్సహాన్నిచ్చింది.

12/26/2016 - 02:24

కరాచీ, డిసెంబర్ 25: తనకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా ఒక మ్యాచ్‌ని ఎంపిక చేయాలని కోరుకోవడం లేదని పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ స్పష్టం చేశాడు. జట్టులో స్థానం లభించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వస్తున్న వార్తలను అతను ఖండించాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని అఫ్రిదీ తేల్చిచెప్పాడు.

12/26/2016 - 02:23

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 25: టీవల కాలంలో ఎదురైన వరుస సిరీస్ పరాజయాల నుంచి గట్టెక్కడానికి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌ను సరైన వేదికగా న్యూజిలాండ్ ఎంచుకుంది. భారత్‌లో పర్యటించినప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కోల్పోయిన కివీస్, ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో కొంత మెరుగ్గానే ఆడింది. కానీ, చివరికి 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత ఆస్ట్రేలియా వెళ్లి దారుణ పరాజయాలను మూటగట్టుకుంది.

Pages