S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/04/2016 - 00:44

న్యూఢిల్లీ, నవంబర్ 3: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను కొనసాగించాలా వద్దా అనే విషయంగానీ, ఆ బాధ్యతగానీ తమ పరిధిలోకి రాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ స్పష్టం చేసింది. సిరీస్‌లతో తమకు ఎలాంటి సంబంధం లేదని, వివిధ సభ్య సంఘాలకు చేస్తున్న చెల్లింపుల వివరాలను మాత్రం తప్పనిసరిగా తెలపాల్సిందేనని ఆదేశించింది.

11/04/2016 - 00:40

వారణాసి, నవంబర్ 3: భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ వచ్చే నెల 9న ఒక ఇంటివాడు కానున్నాడు. బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌తో అతని వివాహం జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 19న వీరి నిశ్చితార్థం జరగ్గా, వివాహ తేదీని ఇరు కుటుంబాల పెద్దలు ఖరారు చేశారు. వారణాసికి చెందిన ప్రతిమ ఆసియా గేమ్స్‌సహా పలు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. కెప్టెన్‌గా కూడా సేవలు అందించింది.

11/04/2016 - 00:38

సార్‌బ్రకెన్ (జర్మనీ), నవంబర్ 3: బిట్‌బర్గర్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు సౌరవ్ వర్మ, సమీర్ వర్మ ప్రీ క్వార్టర్స్ చేరారు. ఈ అన్నదమ్ములు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేశారు. చైనాకు చెందిన యూ సాంగ్‌తో తలపడిన సౌరవ్ 16-9 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దశలో సాంగ్ కండరాల నొప్పితో వైదొలగ్గా, సౌరవ్‌కు ప్రీ క్వార్టర్స్‌లో చోటు దక్కింది.

11/04/2016 - 00:38

షార్జా, నవంబర్ 3: పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌ను కోల్పోయనప్పటికీ వెస్టిండీస్‌ను వైట్‌వాష్ నుంచి కార్లొస్ బ్రాత్‌వెయట్ తప్పించి, పరువు నిలిపాడు. చివరిదైన మూడో టెస్టులో విండీస్ 5 వికెట్ల తేడాతో విజ యం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను నాటౌట్‌గా నిలవడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 281 పరుగులు చేసిం ది.

11/04/2016 - 00:36

దోహా, నవంబర్ 3: బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ జట్టు మాజీ కోచ్ ఆష్లే వెస్ట్‌వుడ్ జోస్యం చెప్పాడు. ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) కప్ ఫైనల్ చేరిన తొలి భారత జట్టుగా రికార్డు సృష్టించిన బెంగళూరు ఆటగాళ్లు ఇక్కడికి చేరుకున్నప్పుడు ఘనస్వాగతం లభించింది. సునీల్ చత్రీ నాయకత్వంలోని బెంగళూరు జట్టుతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

11/03/2016 - 05:06

ముంబయి, నవంబర్ 2: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతనికి స్థానం లభించింది. చికున్‌గున్యా బారిన పడి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు మళ్లీ జట్టులో చోటు దక్కింది.

11/03/2016 - 05:04

ముంబయి: స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఫలితంగా ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి అతను దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో గత నెల 29న విశాఖపట్నంలో జరిగిన చివరి, ఐదో వనే్డ ఆడుతున్న సమయంలో రోహిత్ గాయపడ్డాడు. తొడ కండరాలు చిట్లడంతో అతనికి అత్యవసర వైద్య సేవలు అందించారు. అతని గాయం పట్ల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశాడు.

11/03/2016 - 05:03

సెగయా, (బహ్రెయిన్), నవంబర్ 2: భారత యువ బాడ్మింటన్ ఆటగాడు ప్రతుల్ జోషి తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఇక్కడ జరిగిన బహ్రెయిన్ అంతర్జాతీయ చాలెంజ్ బాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో 22 ఏళ్ల ప్రతుల్ 21-17, 12-21, 21-15 ఆధిక్యంతో తన సహచరుడు ఆతిద్య జోషిని ఓడించాడు.
‘వర్మ’ సోదరుల ముందంజ

11/03/2016 - 05:03

వార్సా, నవంబర్ 2: సాకర్ ప్రపంచంలో ‘జిజో’గా సుపరచితుడైన ఫ్రెంచ్ మాజీ సూపర్ స్టార్ జినెదిన్ జిదానే సెంచరీకి ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన తర్వాత అతను కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. ప్రస్తుతం రియల్ మాడ్రిడ్‌కు మార్గదర్శకం చేస్తున్నాడు. చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్‌లో భాగంగా గురువారం లెగియా వార్సాతో రియల్ మాడ్రిడ్ తలపడే మ్యాచ్‌తో అతను అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు.

11/03/2016 - 05:02

న్యూఢిల్లీ, నవంబర్ 2: టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న వారిని గుర్తించాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఎస్)లకు కేంద్రం సూచించింది. రియో ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో భారీ బృందాన్ని పంపిపన్పటికీ భారత్ కేవలం రెండు పతకాలతో సంతృప్తి చెందిన విషయం తెలిసిందే. బాడ్మింటన్‌లో పివి సింధు రజత పతకాన్ని గెల్చుకోగా, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్యాన్ని సాధించింది.

Pages