S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/10/2016 - 06:14

టోక్యో, నవంబర్ 9: పర్యావరణ పరిరక్షణతోపాటు, ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యర్థాలను తిరిగి ఉపయోగించే అవకాశాలపై అవగాహన పెంచడానికి వీలుగా 2020 ఒలింపిక్స్‌లో పతకాలను ఆ వ్యర్థాలతోనే తయారు చేయాలని నిర్వాహణ కమిటీ తీర్మానించింది. పాడైన సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ ద్వారా పతకాలు తయారు చేస్తామని తెలిపింది.

11/10/2016 - 06:12

న్యూఢిల్లీ, నవంబర్ 9: రియో ఒలింపిక్స్ మహిళల ఫైనల్‌లో భారత స్టార్ పివి సింధును ఓడించి టైటిల్ సాధించిన స్పెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్‌కు బుధవారం ఇక్కడ జరిగిన 2017 ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) వేలంలో భారీ ధర పలికింది. నిరుటి వేలంలో అందరి కంటే ఎక్కువ మొత్తాన్ని దక్కించుకున్న 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, హైదరాబాదీ సైనా నెహ్వాల్‌కు డిమాండ్ తగ్గింది.

11/10/2016 - 06:11

కరాచీ, నవంబర్ 9: నిబంధనలకు విరుద్ధమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కలిక సస్పెన్షన్‌కు గురైన పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఈనెల 17న బ్రిస్బెన్‌లో బయో మెట్రిక్ పరీక్షకు హాజరవుతాడు. అక్కడ వచ్చే ఫలితంపైనే హఫీజ్ కె రీర్ ఆధారపడి ఉంటుంది. గుర్తింపు పొందిన కేంద్రం కాబట్టే, అక్కడి నివేదికపై ఆధారపడి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయం తీసుకుంటుంది.

11/10/2016 - 06:10

కరాచీ, నవంబర్ 9: ద్వైపాక్షిక సిరీస్ ఆడేదీ లేనిదీ తేల్చిచెప్పాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) డిమాండ్ చేసింది. 2007 నుంచి ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగని విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన షెడ్యూల్‌ను అమలు చేయాలని బిసిసిఐని పదేపదే అడుగుతున్న పిసిబి ఏదో ఒకటి తేల్చాలని కోరింది.

11/10/2016 - 06:09

న్యూఢిల్లీ, నవంబర్ 9: లోధా సిఫార్సులను అమలు చేయకుండా మరికొంత కాలం వాయిదా వేయడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అనుసరించబోయే కొత్త ఎత్తుగడ ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

11/09/2016 - 01:15

రాజ్‌కోట్, నవంబర్ 8: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య హోరాహోగా జరుగుతుందని భావిస్తున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్ బుధవారం ఇక్కడ ప్రారంభం కానుంది. ఇటీవల వెస్టిండీస్, న్యూజిలాండ్‌లపై వరుసగా విజయాలను నమోదు చేయడంతో పాటు ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న భారత జట్టు ఈ సిరీస్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

11/09/2016 - 00:49

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 8: మూలపాడులో ఈ నెల 10 నుండి 22వ తేదీ వరకు జరుగనున్న భారత్, వెస్టెండీస్ సిరీస్ భారత్‌కు చాలా కీలకమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ అన్నారు. మంగళవారం నగరంలోని హోటల్‌గేట్‌వేలో జరిగిన మీడియా సమావేశంలో మిథాలీరాజ్ మాట్లాడుతూ ఈ సిరీస్ గెలిస్తే జూన్ 2017లో జరుగనున్న ప్రపంచకప్ మహిళా క్రికెట్ కప్‌కు అర్హత సాధించడం సులభమవుతుందని పేర్కొన్నారు.

11/09/2016 - 00:47

న్యూఢిల్లీ, నవంబర్ 8: జార్ఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు చెందిన యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృషభ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే వంద పరుగులు పూర్తిచేసి ఫస్ట్‌కాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతంగా శతకాన్ని నమోదు చేసిన భారత ఆటగాడిగా అతను రికార్డులకు ఎక్కాడు.

11/09/2016 - 00:47

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య బుధవారం రాజ్‌కోట్‌లో మొదలయ్యే తొలి మ్యాచ్ నిర్వహణ కోసం 58.66 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి స్పష్టం చేసింది.

11/09/2016 - 00:45

న్యూఢిల్లీ, నవంబర్ 8: కాసుల పంట పండిస్తున్న ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) రెండో ఎడిషన్ టోర్నమెంట్ కోసం బుధవారం ఇక్కడ ఆటగాళ్లను వేలం వేయనున్నారు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, రియో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), రజత పతక విజేత పివి.సింధు సహా పలువురు టాప్ షట్లర్లు ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.

Pages