S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/10/2016 - 07:59

రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకొస్తుందని ఆశించిన పిస్టల్ షూటర్ హీనా సిద్ధు మరోసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల 25 మీటర్ల ఈవెంట్‌లో మొత్తం 40 మంది పోటీ పడగా, ప్రథమార్థం ముగిసే సమయానికి సిద్ధు ఎంతో వెనుకబడి 30వ స్థానంలో నిలిచింది.

08/10/2016 - 07:58

రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ అతాను దాస్ అద్భుత ప్రదర్శనతో ముందుకు కొనసాగుతున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్‌లో అతను వరుస సెట్ల తేడాతో నేపాల్‌కు చెందిన ముక్తాన్ జీత్‌బహదూర్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దాస్ 29-26, 29-24, 30-26 సెట్ల తేడాతో జీత్‌బహదూర్‌ను చిత్తు చేశాడు.

08/10/2016 - 07:58

రియో డి జెనిరో, ఆగస్టు 9: ఒలింపిక్ మహిళల హాకీ ఈవెంట్‌లో భారత జట్టుకు రెండో లీగ్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న గ్రేట్ బ్రిటన్ జట్టుతో జరిగిన మంగళవారం తెల్లవారు జామున జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత జట్టు 0-3 గోల్స్ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

08/09/2016 - 03:52

జిమ్నాస్టిక్స్‌లో అత్యంత క్లిష్టమైన ‘ప్రొడునొవా’ విన్యాసాన్ని
ప్రదర్శించి భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్‌లో ఫైనల్స్ చేరి చరిత్ర పుటల్లో స్థానం
సంపాదించింది. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి
భారతీయురాలిగా రికార్డు సృష్టించిన దీప క్వాలిఫయింగ్ రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసి ఫైనల్ చేరింది. ప్రాణాలతో

08/09/2016 - 02:26

రియో డి జెనీరో, ఆగస్టు 8: ఒలింపిక్స్‌లో రెండోసారి పతకాన్ని సాధించాలనుకున్న భారత ఏస్ షూటర్ అభినవ్ బింద్రా ఆశ నెరవేరలేదు. గురి తప్పిన అతను నాలుగో స్థానంతోనే సరిపుచ్చుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో నాలుగో స్థానంతో సంతృప్తి చెందాడు.

08/09/2016 - 02:24

రియో డి జెనీరో: ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన దీపా కర్మాకర్ క్వాలిఫయర్‌లో చక్కటి ప్రతిభ చూపి, ఫైనల్స్‌లో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. అత్యంత సంక్లిష్టమైన ‘ప్రొడునొవా’ వాల్ట్‌లో నైపుణ్యాన్ని కనబరచిన ఆమె మహిళల ఇండివిజువల్ వాల్ట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో మొత్తం 14.850 పాయింట్లు సంపాదించి ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించింది.

08/09/2016 - 02:18

రియో డి జెనీరో: భారత మహిళా ఆర్చర్లు రికర్వ్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో పరాజయాన్ని ఎదుర్కోవడంలో తమ తప్పు ఏమీ లేదని, గాలి వేగంగా వీయడం వల్లే గురి తప్పించదని వాదిస్తున్నారు. దీపికా కుమారి, లైష్రామ్ బొంబాల్యా దేవి, లక్ష్మీరాణి సభ్యులుగా ఉన్న భారత జట్టు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో కొలంబియాను ఓడించిన క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా పతకం రేసులో ఉన్నామని సంకేతాలు పంపింది.

08/09/2016 - 02:16

న్యూఢిల్లీ, ఆగస్టు 8: లోధా కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి మరోసారి చుక్కెదురైంది. ఇప్పటికే సుప్రీం కోర్టు చేతిలో పలుమార్లు చీవాట్లు తిన్న బిసిసిఐకి ఇప్పుడు లోధా ప్యానెల్ నుంచి కూడా తిరస్కరణ తప్పలేదు. కమిటీ సిఫార్సులను ఆరు నెలల్లోగా అమలు చేయాలని బిసిసిఐని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించింది.

,
08/09/2016 - 02:16

రియో డి జెనీరో, ఆగస్టు 8: అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఒలింపిక్స్‌లో మరోసారి సత్తా చాటాడు. ఇప్పటికే 18 స్వర్ణ పతకాలతో ఒలింపిక్స్ చరిత్రను తిరగరాసిన అతను పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో అమెరికా గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కెరీర్‌లో 19వ ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకున్నాడు.

08/09/2016 - 02:13

రియో డి జెనీరో, ఆగస్టు 8: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కి అర్జెంటీనా సీనియర్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రో షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో జొకోవిచ్‌పై 7-6, 7-6 తేడాతో సంచలన విజయం సాధించాడు. అనూహ్య పరాజయంతో కంగుతిన్న జొకోవిచ్ కంటనీరు పెట్టుకొని, అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టును విడిచిపెట్టాడు.

Pages