S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/05/2016 - 01:23

రియో డి జెనీరో, ఆగస్టు 4: దక్షిణాఫ్రికా అథ్లెట్ కాస్టర్ సెమెన్యా మళ్లీ తెరపైకి వచ్చింది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్న కారణంగా మహిళల విభాగంలో పోటీ చేయడానికి వీల్లేదని అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేయడంతో సెమెన్యా క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ సంపాదించింది.

08/05/2016 - 00:41

రియో డి జెనీరోలో 31వ ఒలింపిక్ క్రీడలు శుక్రవారం ఘనంగా ప్రారంభం కానున్నాయ. మన దేశంలో క్రీడాభిమానులకు ఒలింపిక్స్ అర్ధరాత్రి పండుగ అవుతుంది. బ్రెజిల్ మనకంటే ఎనిమిదిన్నర గంటలు వెనుక ఉండడమే అందుకు కారణం. చాలావరకు కీలక ఈవెంట్లు అక్కడ సాయంత్రం వేళ జరుగుతాయి. ఫలితంగా మన దేశంలో వాటిని అర్ధరాత్రి దాటిన తర్వాతే చూడగలుతాం.

08/04/2016 - 09:01

రియో డి జెనీరో, ఆగస్టు 3: రియో డి జెనీరోలో భారత బృందానికి బుధవారం ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులు రియో క్రీడా గ్రామానికి చేరుకొని, తమకు కేటాయించిన గదుల్లో బస చేస్తున్నారు. అయితే, ఒక్కో దేశ బృందాన్ని ఆహ్వానించడానికి ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఒసి) ఒక్కో తేదీని ఖరారు చేసింది. అధికారికంగా బుధవారం భారత్ వంతు వచ్చింది.

08/04/2016 - 08:58

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో శుభారంభమే అత్యంత కీలకమని భారత హాకీ జట్టు గోల్‌కీపర్, కెప్టెన్ శ్రీజేష్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఎనిమిది పర్యాయాలు ఒలింపిక్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత్ చాలా కాలంగా అదే స్థాయిలో రాణించలేకపోతున్నది. పతకం మాట ఎలావున్నా, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడానికే నానా తంటాలు పడుతున్నది.

08/04/2016 - 08:58

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఒలింపిక్స్‌లో భారత హాకీ గత కీర్తి ఎంతో ఘనం. నేడు అది అంతంత మాత్రం. ఒకప్పుడు ప్ర పంచాన్ని శాసించిన భారత హాకీ నేడు ఉనికి కోసం అల్లా డుతున్నది. ఒలింపిక్స్‌లో మన ప్రస్థానం సాగిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒలింపిక్స్‌లో అంతకు ముందు మూడు పర్యాయాలు స్వర్ణ పతకాలు సాధించినా అప్పటి మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు.

08/04/2016 - 08:57

కింగ్‌స్టన్, ఆగస్టు 3: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి విండీస్ పోరాడు తున్నది. నాలుగు వికెట్లకు 48 పరు గుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రో జైన బుధవారం ఆటను కొనసాగిం చిన ఆ జట్టు భోజన విరామ సమ యానికి మరో వికెట్ కోల్పోయ 215 పరుగులు చేయగలిగింది. జెర్మయ న్ బ్లాక్‌వుడ్ 63 పరుగులు సాధించి అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యా డు.

08/04/2016 - 08:57

న్యూఢిల్లీ, ఆగస్టు 3: యువ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి లైన్ క్లియర్ అయంది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్లుడబ్ల్యు) అమోదముద్ర వేయడంతో అతనికి రియో టికెట్ ఖాయమైంది. భారత రెజ్లింగ్ సంఘం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విషయాన్ని ధ్రువీకరించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా నర్సిం గ్‌పై తాత్కాలిక వేటు పడిన విషయం తెలిసిందే.

08/03/2016 - 00:34

న్యూఢిల్లీ, ఆగస్టు 2: డోపింగ్ వ్యవహారంలో సోమవారం నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) నుంచి క్లీన్‌చిట్ పొందిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నాడు. పార్లమెంట్ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

08/03/2016 - 00:31

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి పతకాన్ని అందిస్తాడని ఆశించిన షాట్‌పుటర్ ఇందర్‌జీత్ సింగ్ వరుసగా రెండోసారి కూడా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ద్వారాలు మూసుకుపోయాయి.

08/03/2016 - 00:29

కింగ్‌స్టన్ (జమైకా), ఆగస్టు 2: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే అజేయ అర్ధ శతకంతో సత్తా చాటుకున్నాడు.

Pages