S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2017 - 02:53

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 3 శుక్రవారం అన్ని కార్యాలయాల పరిధిలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

11/03/2017 - 02:52

హైదరాబాద్, నవంబర్ 2: ఉద్యోగ నియామకాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైందని బిజెఎల్‌పి నేత జి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 486 పోస్టులకు పరీక్షలు నిర్వహించినా అందులో మెరిట్ వివరాలు ప్రకటించకుండానే ఫలితాలను ప్రకటించి నియామకాలు పూర్తిచేశారని అన్నారు.

11/03/2017 - 02:51

హైదరాబాద్, నవంబర్ 2: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్యాబ్ డ్రైవర్లు గురువారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రోడ్డుపై కార్లను పార్క్ చేసి తాళం వేసి ఆందోళనకు దిగారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొన్ని క్యాబ్ సంస్థలను నిషేధించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

11/03/2017 - 02:51

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ జైళ్ల శాఖ నూతన సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఖైదీల హక్కులను వివరించే ప్రక్రియ దేశంలోనే తొలిసారి రికార్డుకెక్కింది. ఖైదీల హక్కులు, విధివిధానాలతో ముద్రితమైన ప్రతులను ఖైదీలకు అందజేస్తుంది. ఈ ప్రక్రియ ఈనెల నుంచే అమల్లోకి తెచ్చింది. యునైటెడ్ నేషన్స్ స్టాండర్డ్ మినిమమ్ రూల్స్ (ఎస్‌ఎంఆర్)ను ప్రతి ఖైదీకి వివరించేలా చర్యలు చేపట్టింది.

11/03/2017 - 02:48

హైదరాబాద్/ఉప్పల్, నవంబర్ 2: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పక్కదారి పట్టిందని కాంగ్రెస్ సభ్యులు గురువారం శాసనమండలిలో ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు మహమ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం అనర్హులకు వరంలా మారిందన్నారు.

11/03/2017 - 00:17

న్యూఢిల్లీ, నవంబర్ 2: ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయానికి రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్ భూములను ఇవ్వద్దని కాంగ్రెస్ నేత హనుమంతరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విహెచ్ లేఖ రాశారు.

11/03/2017 - 00:16

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో సాంకేతిక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి దార్శనిక పత్రాన్ని రూపొందించింది. రానున్న రోజుల్లో గిరాకీ లేని కోర్సులను రద్దుచేసి మార్కెట్ డిమాండ్ ఉన్న కొత్త కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దార్శనిక పత్రాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పాత్రికేయులకు విడుదల చేశారు.

11/03/2017 - 00:15

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో 44 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఇ- నామ్ అమలులో ఉందని, కొత్తగా మరో 14 మార్కెట్ యార్డుల్లో దీనిని అమలులోకి తెస్తామని సాగునీరు, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బిగాల గణేష్, ఆరూరి రమేష్, అల్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు గురువారం నాడు శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.

11/03/2017 - 03:35

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల జారీకి రెవిన్యూశాఖ కసరత్తు చేస్తుంది. రాష్టవ్య్రాప్తంగా కొనసాగుతున్న భూ ప్రక్షాళన కార్యక్రమం పూర్తి కాగానే పట్టాదారు పాసు పుస్తకాల జారీ కార్యక్రమాన్ని చేపట్టడానికి రెవిన్యూశాఖ సన్నద్ధం అవుతుంది.

11/02/2017 - 01:20

హైదరాబాద్, నవంబర్ 1: ఏడేళ్లుగా ఎటూ తేలకుండా న్యాయవివాదాల మధ్య చిక్కుకున్న 2011 నాటి గ్రూప్-1 ఎంపిక ఫలితాలను ప్రకటించామనుకున్న అర్ధగంటలోనే ఎంపిక జాబితాలో లోపాలు గుర్తించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ దానిని వెనక్కు తీసుకుంది. అంత వరకూ బాగానే ఉన్నా తాజా జాబితాకు సంబంధించి మల్లగుల్లాలు పడుతోంది.

Pages