S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/05/2017 - 04:54

పాపన్నపేట, నవంబర్ 4: సింగూర్ నుండి నిజాంసాగర్-శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పాటు ఘణపురం ప్రాజెక్ట్‌పై నుండి మంజీరా పొం గిపొర్లుతూ పరవళ్లు తొక్కుతోంది.

11/05/2017 - 04:43

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. ఈనెల 12న ప్రస్తుత డిజిపి అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయనున్నట్టు తెలిసింది. అయితే అదే రోజు కొత్త డిజిపిగా మహేందర్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది.

11/05/2017 - 04:42

హైదరాబాద్/బాలాపూర్/వనస్థలిపురం, నవంబర్ 4: పోలీస్ శాఖలో కాలానికనుగుణంగా మార్పులు జరగాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. శనివారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఆధునీకరించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

11/05/2017 - 04:39

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 4: అడవి తల్లిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దాడులు అప్రజాస్వామికమని ప్రజావిచారణలో వక్తలు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘ఆదివాసీ అడవి బిడ్డల అటవీ అధికారుల దమనకాండ’పై ప్రజావిచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ ఎం.

11/05/2017 - 04:38

హైదరాబాద్, నవంబర్ 4: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ సిఐ లింగయ్య హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. దీంతో సిఐ లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. హోంగార్డుతో రోజూ ఇంటిపనులు చేయించుకోవడమే కాకుండా బాడీ మసాజ్ కూడా చేయించుకుంటున్నట్టు ఆ దృశ్యాల్లో ఉన్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

11/05/2017 - 04:37

హైదరాబాద్, నవంబర్ 4: ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న 8 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లపై కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ అధికారులను ఆదేశించారు.

11/05/2017 - 02:25

హైదరాబాద్, నవంబర్ 4: ఎన్నికల సర్వే పేరుతో సిఎం కెసిఆర్ తన శ్రేణుల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘సామాజిక తెలంగాణా-సమగ్రాభివృద్ధి’ అజెండాగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కావాలని ఆశాభావం వక్తం చేస్తున్నట్లు సిపిఎం వెల్లడించింది.

11/05/2017 - 02:24

హైదరాబాద్, నవంబర్ 4: తేమతో నిమిత్తం లేకుండా క్వింటాలు పత్తిని రూ.8 వేలకు కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావును కోరింది. ప్రతి మండలం కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మంత్రి హరీష్‌రావుకు వినతిపత్రాన్ని అందజేసినట్లు సంఘం కార్యదర్శి టి.సాగర్ తెలిపారు.

11/05/2017 - 02:21

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ బస్సుల రాకపోకల సంబంధిన సమాచారం ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలిసేలా కొత్త చర్యలు ప్రారంభించినట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రయాణీకులకు బస్సులకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలుస్తుందన్నారు. అంతే కాకుండా జీపీఆర్ సర్వీస్ ప్రయాణికులకు బస్సుల రాకపోకల వివరాలు పూర్తిగా తెలుస్తాయన్నారు.

11/05/2017 - 02:20

హైదరాబాద్, నవంబర్ 4: పత్తిని పండించిన రైతాంగానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని టిటిడిపి రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఎకరానికి 8 క్వింటాళ్ల పత్తి కూడా దిగుబడి రాకపోవడం, మరో వైపు మద్దతు ధర రాకపోవడంతో ఆత్మహత్యల వైపు రైతులు ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

Pages