S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2017 - 23:37

హైదరాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పంయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాయం వెంకటేశ్వర్లు, రాథోడ్ బాపూరావు, రవీంద్రకుమార్ రమావత్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలను సిఎం కెసిఆర్ ఏర్పాటు చేశారని చెప్పారు.

11/04/2017 - 03:52

హైదరాబాద్/ఉప్పల్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలోని గిరిజిన ఆశ్రమ పాఠశాలలో టీచర్ల కొరత లేదని ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శుక్రవారం శాసన మండలి సమావేశం చైర్మన్ కె.స్వామి గౌడ్ అధ్యక్షతన జరిగింది.

11/03/2017 - 23:36

హైదరాబాద్ : పేదరికాన్ని అడ్డం పెట్టుకుని మైనర్ బాలికలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న అరబ్ షేక్‌లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు.

11/03/2017 - 04:05

హైదరాబాద్, నవంబర్ 2: ఆదిలాబాద్‌తో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలవల్ల పత్తిపంటకు విపరీతమైన నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డిని, బిసి సంక్షేమం, అటవీ శాఖ మంత్రి జోగురామన్న కోరారు.

11/03/2017 - 04:03

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ సంస్కాృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను పూర్తిగా వినియోగించుకుందామని పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపు ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై రవీంద్రభారతిలోని కళాభవన్‌లో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దాదాపు 25 దేశాల్లో ఉన్న తెలుగువారిని ఈ సభల్లో పాల్గొనేలా చూడాలని ఆమె కోరారు.

11/03/2017 - 03:31

హైదరాబాద్, నవంబర్ 2: హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-బోధన్ రహదారి అభివృద్ధికి రూ.460 కోట్లతో చేసిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వీటికి త్వరగా అనుమతులు సాధించాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

11/03/2017 - 03:26

హైదరాబాద్, నవంబర్ 2: విజయ డెయిరీ స్థాయి పెంచుతామని పశువైద్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గురువారం నాడు శాసనసభలో గొంగిడి సునత, అంజయ్య ఎల్గనమోని, వి శ్రీనివాస్ గౌడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ పారిపరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రంలో విజయ డెయిరీ మినహా ప్రైవేటు డెయిరీలకు తావులేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

11/03/2017 - 03:25

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్రంలో పెద్ద ఎత్తున పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి పరచాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం నాడు శాసనసభలో డి వినయ్ భాస్కర్, మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచడానికి అనేక ప్రణాళికలను రూపొందించి అమలుచేస్తున్నామని అన్నారు.

11/03/2017 - 03:25

హైదరాబాద్, నవంబర్ 2: దక్షిణ కొరియా-తెలంగాణ ప్రభుత్వం మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత అభివృద్థి చెందాలని ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు, ఆ దేశ హైదరాబాద్ కాన్స్‌లేట్ సురేశ్ చుక్కపల్లి ఆకాంక్షించారు. హైదరాబాద్ కాన్సలేట్ జనరల్‌గా నియామకమైన సురేశ్ చుక్కపల్లి గురువారం ఢిల్లీ రాయబార కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

11/03/2017 - 03:21

హైదరాబాద్, నవంబర్ 2: దేశంలో తన ఓటు బ్యాంకు కోసం మతోన్మాద రాజకీయాలను తిరిగి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఈ కారణంగానే దేశంలో మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాని అన్నారు. గురువారం నాడిక్కడ ఆర్టీసి కళ్యాణమండపంలో నిర్వహించిన సిపిఎం జాతీయ సమావేశాల సన్నద్ధ సమావేశానికి ఏచూరి హాజరయ్యారు.

Pages