S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/09/2017 - 01:43

చిత్రం..ఆదివారం కరిసిన భారీ వర్షానికి హైదరాబద్‌లోని అల్వాల్‌లో జలమయమైన రహదారి

10/09/2017 - 03:35

హైదరాబాద్, అక్టోబర్ 8: దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన తపాసు రిజర్వాయర్ ఆలేరు నియోజకవర్గంలో రాజాపేట మండలం సింగారం పక్కనే ఉన్నా సాగు నీరు మాత్రం రావడం లేదని తెలిపారు.

10/09/2017 - 03:35

హైదరాబాద్, అక్టోబర్ 8: జోనల్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని బిజెపి జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్. ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జోనల్ వ్యవస్థ ఎందుకని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లోగడ ప్రశ్నించారని ఇంద్రసేనారెడ్డి ఆదివారం పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, ఎ.నరేష్‌రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించారు.

10/08/2017 - 04:06

హైదరాబాద్, అక్టోబర్ 7: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిరంకుశ, కుటుంబ పాలనపై తమ పోరాటం ఆగదని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. ప్రజలు అటో-ఇటో తేల్చుకోవాలన్నారు. జెఎసిని ఆయన బాణం తరహాలో పోల్చారు. విల్లు నుంచి బాణం విడుదలైన తర్వాత ఆగదని, అలాగే జెఎసి కూడా ఆగదని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు.

10/08/2017 - 04:04

హైదరాబాద్, అక్టోబర్ 7: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఐడిసి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆయా లిఫ్ట్ పనుల పురోగతిపై లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

10/08/2017 - 04:01

హైదరాబాద్, అక్టోబర్ 7: జిఎస్‌టికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, ఉద్దేశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎస్‌టి సమావేశాల్లో గట్టిగా వినిపించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన 22 వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఈటెల, ఈ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌ను శనివారం కలిసి వివరించారు.

10/08/2017 - 03:59

హైదరాబాద్, అక్టోబర్ 7: దండు మల్కాపూర్‌లోని 450 ఎకరాల్లో టిఐఎఫ్-ఎంఎస్‌ఎంఈ గ్రీన్ మాడల్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి 450 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పార్కులో అంతర్జాతీయ స్థాయిలో వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

10/08/2017 - 03:56

హైదరాబాద్, అక్టోబర్ 7: మంచినీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులపై వస్తు సేవాపన్నును తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ సూచనను కేంద్రం అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు.

10/08/2017 - 03:56

హైదరాబాద్, అక్టోబర్ 7: కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లు, జిల్లా అధికారుల కార్యాలయాలకు ఈ నెల 11 న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధిపేట, సిరిసిల్లా, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేస్తారు. మిగతా జిల్లాల్లో మంత్రులు శంకుస్థాపన చేస్తారు.

10/08/2017 - 03:55

హైదరాబాద్, అక్టోబర్ 7: ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించాల్సిన ముఖ్యమంత్రి సింగరేణి ఎన్నికలకు రెండు రోజుల ముందు అన్ని ప్రముఖ హామీలను గుప్పించి, గెలవడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా మిగిలిన వారిని కించపర్చడం, తిరస్కరించడం, అవాస్తవాలను ఆపాదించడం సరైన విధానం కాదని అన్నారు.

Pages