S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/11/2017 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రజారవాణా బలోపేతానికి తగు చర్యలు తీసుకోవడంపై మంగళవారం అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్, టిఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. బస్ భవన్‌లో జరిగిన సమావేశంలో ట్రాఫిక్, రవాణా విధానంపై ప్రతినిధులు వారివారి అభిప్రాయాలను వెల్లడించారు.

10/11/2017 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 10: నేరేళ్ల ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వం తీరు పట్ల కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

10/11/2017 - 02:19

హైదరాబాద్, అక్టోబర్ 10: మేడ్చెల్ జిల్లా దూలపల్లి పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిందనే విషయమై కమిటీని నియమించి అంచనా వేయాలని హైకోర్టు మేడ్చెల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ విషయమై జి సతీష్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి గంగారావు విచారించారు.

10/10/2017 - 01:50

హైదరాబాద్, అక్టోబర్ 9: టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌పై కేసు నమోదైంది. రెండేళ్లుగా ఇంటి అద్దె చెల్లించడం లేదని, ఇల్లు ఖాళీ చేయాలనడంతో తనను దుర్భాషలాడుతూ, చెప్పు తీసి తనపై దాడికి యత్నించాడని ఓ మహిళ (ఎన్నారై) నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

10/10/2017 - 01:47

హైదరాబాద్, అక్టోబర్ 9: అండమాన్ నికోబార్‌లో అక్టోబర్ 10 నుండి 14 వరకు జరిగే ‘బేటీ బచావో బేటీ పడావో’ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత నాగేందర్ మంగళవారం వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ఆమె ఈ సందర్భంగా వివరిస్తారు.

10/10/2017 - 01:40

హైదరాబాద్, అక్టోబర్ 9: జోనల్ వ్యవస్థను శాస్ర్తియ పద్దతిలో సమగ్రంగా పరిశీలించి నూతనంగా వ్యవస్ధీకరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

10/10/2017 - 01:39

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటుందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి తెలిపారు.

10/10/2017 - 01:37

హైదరాబాద్, అక్టోబర్ 9: కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలపై బిజెపి, సిపిఎం పార్టీలు సోమవారం హైదరాబాద్‌లో పోటాపోటీ ర్యాలీలకు పూనుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరాపార్కు నుంచి బిజెపి శ్రేణులు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సిపిఎం రాష్ట్ర కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరడంతో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

10/09/2017 - 23:13

హైదరాబాద్, అక్టోబర్ 9: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి రూ.27 కోట్ల 42 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మృతి చెందిన ఒక్కో రైతు కుటుంబానికి ఆరు లక్షల రూపాయాల చొప్పున చెల్లించనున్నారు. రాష్టవ్య్రాప్తంగా 457 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కలెక్టర్లు పంపించిన నివేదిక ప్రకారం వారి కుటుంబాలకు ఈ మొత్తాన్ని అందజేస్తారు.

10/09/2017 - 23:12

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ రాష్ట్ర పాడి అభివృద్ధి సంస్థ ఫెడరేషన్‌లో ఖాళీగా ఉన్న 110 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

Pages