S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/12/2017 - 01:48

హైదరాబాద్, ఆగస్టు 11: హైదరాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచ్‌వెల్లీ ఎయిడెడ్ కో-అపరేటివ్ సొసైటీకి బాచుపల్లి మండలం నిజాంపేటలో 32 ఎకరాలను స్వాధీనం చేయాల్సిందిగా మేడ్చెల్ కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

08/12/2017 - 01:47

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్, సభ్యుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి వేతనాన్ని రూ. 80 వేల నుండి 2.25 లక్షల రూపాయిలకు పెంచింది. సభ్యుల వేతనాన్ని 79వేల రూపాయిల నుండి రెండు లక్షల 24వేల వంద రూపాయిలకు పెంచింది. 2016 జనవరి 1వ తేదీ నుండి పెరిగిన జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. 19 నెలల జీతాల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి.

08/12/2017 - 01:45

హైదరాబాద్, ఆగస్టు 11: అధిక రద్దీని నివారించేందుకు గాను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి దర్భంగ, హైదరాబాద్ నుంచి రక్సాల్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. రానున్న దసరా, దీపావళి పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ 2 నుంచి నడుపుతున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్-దర్భంగా- సికింద్రాబాద్ మధ్య 51 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది.

08/12/2017 - 01:45

హైదరాబాద్, ఆగస్టు 11: జలవనరుల రంగంలో సవ్యమైన ప్రణాళికలు సకాలంలో చేసుకోకుంటే రానున్న రోజుల్లో సాగు- తాగునీటికి పెను సవాలు ఎదురవుతుందని రెండు రోజులుగా హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. దేశ విదేశాల నుండి వచ్చిన మేధావులు, ప్రతినిధులు వాటర్ రీసెర్సెస్ ఇంజనీరింగ్ రంగంలో సంభవించిన పరిణామాలు, అనేక అంశాలపై చర్చించారు.

08/12/2017 - 01:44

హైదరాబాద్, ఆగస్టు 11: ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట అంచనాల పెంపును నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

08/12/2017 - 01:44

హైదరాబాద్, ఆగస్టు 11: గణేష్ చవితి పండుగ, గణేష్ నిమజ్జనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిథిలో శాంతియుతంగా, ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గణేష్ చవితి పండుగ, గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో శుక్రవారం మంత్రి నాయిని సచివాలయంలో సమీక్షించారు.

08/11/2017 - 23:19

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పేదరిక నిర్మూలన సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు అందజేస్తున్న రిజర్వేషన్ల శాతాన్ని 3 నుంచి 5 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజర్వేషన్లలో మహిళా దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. అన్ని పేదరిక నిర్మూలన పథకాల్లో 5 శాతం దివ్యాంగులకు కేటాయించి ఉంచాలని తెలిపింది.

08/11/2017 - 23:19

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు తొమ్మిదేళ్ల నుంచి 15 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ తట్టు టీకాలు వేయించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణలో 90లక్షల మందికి ఈ టీకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. బడిలో చదువుకుంటున్న పిల్లలతో పాటు బడి బయట ఉన్న వారికి సైతం టీకాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

08/11/2017 - 23:18

హైదరాబాద్, ఆగస్టు 11: ఈ నెల 14, 15 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజుల పాటు రుతుపవనాలు మందగించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే గురువారం నుంచి ఉత్తర, దక్షిణ దిశ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో భాగంగా రెండు రోజుల నుంచి వర్షాలు అక్కడక్కడా భారీగా కురుస్తున్నాయి.

08/11/2017 - 23:18

హైదరాబాద్, ఆగస్టు 11:్ఫర్మాసిటీ, మెడ్ డైవైసెస్ పార్కుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యుఏఈ ఎక్చేంజ్ చైర్మన్ బిఆర్ షెట్టి తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును బిఆర్‌షెట్టి ఈరోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. తెలంగాణలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు షెట్టి సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారు.

Pages