S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/09/2017 - 03:06

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి చెందేందుకు, ప్రజలు సుఖసంతోషాలతో జీవించేందుకు దైన సహకారం ఉంటుందని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పేర్కొన్నారు.

06/09/2017 - 03:02

హైదరాబాద్, జూన్ 8: మృగశిరకార్తె సందర్భంగా బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ గురువారం ఉదయం ప్రారంభమై, ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు కొనసాగనున్న ఈ ప్రసాదం పంపిణీకి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయగా, వివిధ ప్రభుత్వ శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.

06/09/2017 - 03:01

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ జిల్లాలు నిన్నటివరకు ఎండలతో సతమతం కాగా, బుధవారం రాత్రి మొదలైన చల్లని గాలులు ఆ తర్వాత భారీ వర్షాన్నీ తీసుకొచ్చాయి. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతా ల్లో భారీ వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. నైరుతీ రుతుపవనాలు ఇంకా రాష్ట్రాన్ని తాకలేదు.

06/09/2017 - 03:00

హైదరాబాద్, జూన్ 8: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎనివేర్ రిజిస్ట్రేషన్ల’ అక్రమాలపై ఏసిబి అధికారులు చేపట్టిన దర్యాప్తు, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిపిన సోదాలపై నివేదిక సిద్ధమైంది. హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణం కేసును ఏసిబి, సిఐడి అధికారులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.

06/09/2017 - 03:00

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రాష్ట్రంలో దేవాలయ భూములను దునే్నవారికే కేటాయించాలని రాష్ట్ర బిసి కమిషన్ ఆదేశించింది. బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, డాక్టర్ ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి జిడి అరుణ నేతృత్వంలో గురువారం ఇక్కడ ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.

06/09/2017 - 02:59

హైదరాబాద్, జూన్ 8: పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకం నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఒక ఇండిపెండెంట్ కమిషన్ ఏర్పాటు చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజని ఆదేశాలు జారీ చేశారు.

06/09/2017 - 02:58

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రాష్ట్రంలో ఆపద్భందు పథకాన్ని అమలు చేసేందుకు రూ.5.46కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పథకం కింద 2014 నుండి 2017 మధ్య కాలంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాకు 96.50లక్షలు కేటాయించగా, ఆదిలాబాద్, మహబూబాబాద్, మెదక్ జిల్లాల నుండి క్లెయిములు లేకపోవడంతో ఈ జిల్లాలకు కేటాయింపులు జరగలేదు.

06/09/2017 - 02:57

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలకు గ్రామం యూనిట్‌గా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని, ఇతర పంటలకు మండలం యూనిట్‌గా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యాదర్శి సునీల్ శర్మ పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామం యూనిట్‌గా ఫసల్ బీమా యోజన అమలు చేసేందుకు నిర్ణయించిన పంటలు, జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

06/09/2017 - 02:57

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ ప్రెస్ అకాడమీ నేతృత్వంలో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని గ్రామీణ విలేఖరులకు రెండురోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ నెల 10, 11 తేదీల్లో కూకట్‌పల్లిలోని జెఎన్‌టియు ఆవరణలో ఉన్న యుజిసి ఆడిటోరియంలో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు.

06/09/2017 - 02:30

కెపిహెచ్‌బి కాలనీ, జూన్ 8: తెలంగాణ రాష్ట్రానికి 82వేల డబుల్ బెడ్‌రూమ్‌లు, అనేక సంక్షేమ పథకాలు చేపట్టడానికి నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూ రు చేసిందని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. కూకట్‌పల్లిలోని కెపిహెచ్‌బి 4వ ఫేజ్, బాలాజీనగర్, మూసాపేట్ తదితర ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.

Pages