S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/10/2017 - 01:17

హైదరాబాద్, జూన్ 9: వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను రెండు నెలల్లో చేపట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కనె్సల్టెన్సీని పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశించారు. ప్రాజెక్టు ప్రారంభానికి అవసరమైన ప్రణాళిక, డిజైనింగ్, టెండర్లు పిలిచే ప్రక్రియ అంతా రెండు నెల్లోగా పూర్తి చేసి పనులు చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

06/10/2017 - 01:17

హైదరాబాద్, జూన్ 9: యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం, దండు మల్కాపూర్‌లో వంద కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న టిఐఎఫ్-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనా సంస్ధ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.

06/10/2017 - 01:16

హైదరాబాద్, జూన్ 9: కబ్జాకు గురైన భూములపై న్యాయ పోరాటం చేస్తానని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. భూ కబ్జాలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, దీనిపై కేంద్రానికి నివేదిక ఇస్తామని డాక్టర్ నాగం శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. భూకబ్జాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎన్నో నివేదికలు అందాయని ఆయన చెప్పారు.

06/10/2017 - 01:16

శేరిలింగంపల్లి, జూన్ 9: సంచలనంగా మారిన మియాపూర్ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితుల కస్టడీ గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు జరిపించిన పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావును కస్టడీ గడువు కన్నా ఒక రోజు ముందే జైలుకు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

06/10/2017 - 01:14

హైదరాబాద్, జూన్ 9: ఉగ్రవాదుల కదలికలు, దాడుల నేపథ్యంలో హైటెక్ సిటీలోని అన్ని సంస్ధలకు భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. దీంతో పోలీసు భద్రతను పెంచారు. నిఘా వ్యవస్ధను పటిష్టం చేశారు. మాదాపూర్‌లో అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. హైటెక్ సిటీ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. పోలీసు గస్తీని పెంచారు.

06/10/2017 - 01:14

హైదరాబాద్, జూన్ 9:ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఖరీఫ్‌లో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జల సౌధలో ఎల్లంపల్లి ప్రాజెక్టుపై శుక్రవారం మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని చెరువులను నింపడానికి అవకాశం ఉందో ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

06/10/2017 - 01:13

హైదరాబాద్, జూన్ 9:ఈనెల 18న ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం ఒక్కో మసీదుకు లక్ష రూపాయల చొప్పున 432 మసీదులకు 4.80 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. సచివాలయంలో శుక్రవారం మసీదు కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లతో మంత్రి సమావేశం అయ్యారు.

06/10/2017 - 01:12

హైదరాబాద్/ కాచిగూడ, జూన్ 9: దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయంలో అవినీతిరహిత పాలన కొనసాగుతుందని, దేశానికి సమర్థ న్యాయకత్వం దొరికిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ ఫెస్ట్ కార్యక్రమాన్ని నగరంలోని అంబేద్కర్ కళాశాలలో ప్రారంభించారు.

06/09/2017 - 03:09

హైదరాబాద్, జూన్ 8: పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఖరీఫ్ సీజన్‌కు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులతో సమావేశం నిర్వహించారు.

06/09/2017 - 03:08

హైదరాబాద్, జూన్ 8: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచన మేరకు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక, నమూనా సిద్ధమైంది. ఈ నమూనాకు ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపకల్పన చేశారు. చిన్నజీయర్ స్వామి సలహాను తీసుకుని చిన్న చిన్న మార్పులతో ఈ ప్రణాళిక, నమూనాను రూపొందించారు. భద్రాద్రి ఆలయం అభివృద్ధికి కెసిఆర్ 100కోట్ల రూపాయలను మంజూరు చేశారు.

Pages