S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/31/2017 - 05:43

హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది. నార్త్, వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో కొకైన్ ముఠా పట్టుబడింది. ఈ ముఠా సభ్యులతో పాటు సినీ హీరో అభిషేక్ కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

01/31/2017 - 05:40

హైదరాబాద్(ఖైరతాబాద్), జనవరి 30: రాజధాని హైదరాబాద్‌లో సోమవారం ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు బంజారాహిల్స్ షేక్‌పేట నాలా సమీపంలో విధ్వంసానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అపోలో ఆసుపత్రిలో నర్సింగ్ శిక్షణ పొందుతున్న సుమారు 13 మంది నర్సింగ్ విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.

01/31/2017 - 05:37

హైదరాబాద్, జనవరి 30: రాష్టమ్రంతటా మంగళవారం ప్రమాదరహిత దినంగా పాటించాలని డిజిపి అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం సెంట్రల్ క్రైం స్టేషన్, సైబర్ క్రైం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని డిజిపి సంబంధిత అధికారులకు సూచించారు.

01/31/2017 - 05:36

హైదరాబాద్, జనవరి 30: పెద్ద నోట్ల రద్దు ఒక కుంభకోణమని చిదంబరం పేర్కొనడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఇఎస్‌ఐసి కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారని దత్తాత్రేయ చెప్పారు.

01/31/2017 - 05:35

న్యూఢిల్లీ, జనవరి 30: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమవేశానికి జితేందర్ రెడ్డి హాజరయ్యారు.

01/31/2017 - 05:34

హైదరాబాద్, జనవరి 30: సైనికుల సంక్షేమం కోసం తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఎన్‌జిఓల వేతనం నుండి ఒకరోజు వేతనాన్ని సేకరించి సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని టిఎన్‌జిఓల సంఘం రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు టిఎన్‌జిఓల కేంద్ర కమిటీ అధ్యక్షుడు 2017 డిసెంబర్ 23 న ప్రభుత్వానికి లేఖరాశారు.

01/31/2017 - 05:33

హైదరాబాద్, జనవరి 30: సనత్‌నగర్, ఎర్రగడ్డలోని మానసిక వైద్య శాల ఆవరణలో సంవత్సరాల తరబడి ఆక్రమించి ఉన్న వారిపై చర్యలు తీసుకుని మూడు నెలల్లో తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్ జె. గీతా రెడ్డి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జను ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో పిఎసి చైర్మన్ గీతా రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది.

01/31/2017 - 05:32

హైదరాబాద్, జనవరి 30: కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్‌లో టిజాక్ నేత కోదండరామ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని టిఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ఎంపిలు బాల్కసుమన్, ఎంపి సీతారామ్‌నాయక్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య టిఆర్‌ఎస్‌ల్‌పిలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన కోదండరామ్ కొందరు నిరుద్యోగులకు నాయకుడిగా మారిపోయారని అన్నారు.

01/31/2017 - 05:32

హైదరాబాద్, జనవరి 30: లౌకిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మతోన్మాద శక్తులు కుట్రలు పన్నాయని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట రెడ్డి విమర్శించారు.

01/31/2017 - 05:31

న్యూఢిల్లీ, జవవరి 30: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేకనే, పక్కరాష్ట్రం నుంచి చిదంబరాన్ని అరువు తెచ్చుకొన్న టీకాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని మండిపడ్డారు.

Pages