S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/01/2017 - 01:21

హైదరాబాద్, జనవరి 31: స్వైన్‌ఫ్లూ మళ్లీ వణికిస్తున్నది. బేగంపేటకు చెందిన రెండేళ్ళ ఆరుషిని తల్లిదండ్రులు ఈ నెల 26న గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరింది. జిల్లాల్లోని వేర్వేరు ఆసుపత్రుల్లో మృతి చెందిన వారి సంఖ్య 15 వరకు ఉండవచ్చని అనధికార వర్గాల సమాచారం.

01/31/2017 - 05:57

ఆదిలాబాద్, జనవరి 30: విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన ఎజెండాగా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని, వచ్చే ఎన్నికల నాటికి గిరిజన గూడేలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

01/31/2017 - 05:55

హైదరాబాద్, జనవరి 30: పులిచింతల రిజర్వాయర్‌లో క్రస్ట్ లెవెల్ వరకు నీటిమట్టం కొనసాగించాలని కోరుతూ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు లేఖ రాశారు. పులిచింతల బ్యాక్‌వాటర్ ఆధారంగా నడుస్తున్న ఎనిమిది లిఫ్టుల పరిధిలో ఆయకట్టును ఆదుకోవడానికి క్రస్ట్ లెవెల్ వరకు రిజర్వాయర్ నీటిమట్టం కొనసాగించాల్సిందేనని లేఖలో పేర్కొన్నారు.

01/31/2017 - 05:55

దేవరకొండ, జనవరి 30: ప్రభుత్వ ఉద్యోగులై ఉండి తనకు కనీసం అన్నం కూడా పెట్టని తన ఇద్దరు కుమారుల నుండి నెల నెలా జీవనభృతిని ఇప్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అనసూయమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఆర్డీవో లింగ్యానాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రీవెన్స్‌డే సందర్భంగా తన సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలని ఆమె వేడుకొంది.

01/31/2017 - 05:53

హైదరాబాద్, జనవరి 30: సిసి రోడ్ల నిర్మాణం, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల నిర్మాణం, చెరువుల్లో పూడిక తీసివేత వంటి పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్నట్టు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సెర్ఫ్ కార్యాలయంలో సోమవారం ఉపాధి హామీ కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు.

01/31/2017 - 05:52

దేవరకొండ, జనవరి 30: నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలోని నేరెడుగొమ్ము మండలం కాసరాజ్‌పల్లి పరిధిలోని గాజుబేడ గుహలను పరిశీలించేందుకు సోమవారం వెళ్ళిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఎమ్మెల్యేతో సహా ఆయన గన్‌మెన్ సైదులు, టిఆర్ ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

01/31/2017 - 05:50

హైదరాబాద్, జనవరి 30: రాష్ట్రప్రభుత్వం పశుసంపదకు వచ్చే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తుందని పశుసవంర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన తెలంగాణ నాన్‌గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం పశుగణాభివృద్ధి, మత్స్యసంపదను పెంపొదించేందుకు పాడిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.

01/31/2017 - 05:50

హైదరాబాద్, జనవరి 30: యాదగిరిగుట్టను దేశంలో ఒక ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, శనివారం నాటికి ముసాయిదా మాస్టర్ ప్లాన్ అందజేయాలని మున్సిపల్ పాలనా శాఖ డైరెక్టర్ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. యాదగిరిగుట్టలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులను మిట్టల్ సమీక్షించారు.

01/31/2017 - 05:49

హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభంకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్టబ్రడ్జెట్‌ను సైతం ముందుగానే ఉభయ సభల్లో ప్రతిపాదించి ఆమోదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

01/31/2017 - 05:45

హైదరాబాద్, జనవరి 30: పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వనరుల వినియోగంపై దృష్టి సారించనున్నట్టు రవాణాశాఖ మంత్రి డాక్టర్ పి.మహీందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న ఇంధన పొదుపు మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో

Pages