S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/21/2016 - 23:16

హైదరాబాద్, అక్టోబర్ 20: నిజామాబాద్ జిల్లాలో ఉన్న నాగిరెడ్డిపేట మండలాన్ని కామారెడ్డి జిల్లాలో విలీనం చేయడంపై మూడువారాల్లోగా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాగిరెడ్డిపేట మండలానికి చెందిన జగ్గి జయరాజు మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ విచారించారు.

10/21/2016 - 04:15

షాద్‌నగర్, అక్టోబర్ 20: భారతదేశం శాస్త్ర సాంకేతికపరంగా అన్నిరంగాలలో పురోగతి సాధించాలంటే యువత నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలోని సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన మల్టీడిసిప్లినరీ లా కాన్ఫరెన్స్‌ను గవర్నర్ ప్రారంభించారు.

10/21/2016 - 04:13

సంగారెడ్డి, అక్టోబర్ 19: రాష్ట్రంలో ఇటీవల నూతనంగా రూపుదిద్దుకున్న 31 జిల్లాల్లో సంగారెడ్డి జిల్లా ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, భారతావనిలోని అతి పెద్ద విద్యాసంస్థలతో తులతూగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాటి మెదక్ జిల్లాకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక జిల్లాగా గుర్తింపు కలిగివుంది. తాజాగా జిల్లాల విలీనంతో ఆ పేరును సంగారెడ్డి స్వంతం చేసుకుంది.

10/21/2016 - 04:11

హైదరాబాద్, అక్టోబర్ 20: మిషన్ భగీరథ పనులు జెట్ వేగంతో సాగుతున్నాయని భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరం అయిన ఎలక్ట్రో, మెకానికల్ యంత్రాలను బిహెచ్‌ఇఎల్ తయారు చేస్తోంది.

10/21/2016 - 04:09

బోధన్/బోధన్ రూరల్, అక్టోబర్ 20: నిజాం షుగర్స్ కర్మాగారం, ఆస్తులపై ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం కనే్నసిందని, అందువల్లనే జాయింట్ వెంచర్‌లో నడుస్తున్న కర్మాగారాన్ని పూర్తిగా మూసివేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.

10/21/2016 - 23:15

హైదరాబాద్, అక్టోబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ పథకం కింద కూలీల వేతన బకాయిలు పేరుకుపోయాయని, వెంటనే బకాయిలు చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

10/21/2016 - 03:42

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుందని ప్రశ్నించిన వారికి ఇప్పుడు సమాధానం లభిస్తోందని, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఫలితాలు మొదలయ్యాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే బుడిగ శోభ ఆధ్వర్యంలో కొందరు రైతులు మంత్రి రాజేందర్‌ను కలిసి ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

10/21/2016 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 20: జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించడంలో జిల్లాల కలెక్టర్లు నిమగ్నమయ్యారు. ప్రధానంగా కొత్త జిల్లాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, వౌలిక సదుపాయలు లేకపోయినా తన దృష్టికి తీసుకువస్తే, తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కలెక్టర్లకు తెలియచేశారు.

10/21/2016 - 03:35

హైదరాబాద్, అక్టోబర్ 20: గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు కేంద్రం నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను జత చేసి పావలా వడ్డీకే రుణం పథకం వర్తింప జేయాలని నిర్ణయించారు. గొర్రెలు, మేకల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

10/21/2016 - 03:33

హైదరాబాద్, అక్టోబర్ 20: కొత్త సచివాలయ నిర్మించే అంశాన్ని చర్చించడానికి మంత్రిమండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. పాత భవనాన్ని కూల్చివేయడంతోపాటు ప్రస్తుతం దీంట్లో కొనసాగుతున్న కార్యాలయాలను తాత్కాలికంగా ఇతర భవనాలలోకి తరలించడం వంటి కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొదట నిర్ణయించిన విధంగా రూ.

Pages