S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/22/2016 - 07:16

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణలో న్యాయవిద్య ప్రక్షాళనకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుండి సుప్రీంకోర్టు నిబంధనలను పాటించడం ద్వారా వయోపరిమితిని విధించాలని నిర్ణయించింది. మూడేళ్ల కోర్సుకు గరిష్ఠంగా 30 ఏళ్లు, ఐదేళ్ల కోర్సుకు 20 ఏళ్ల వయోపరిమితిని అమలుచేయనునద్నారు. దీనికి తోడు అక్రమాలను అరికట్టేందుకు ఈ ఏడాది నుండే బయోమెట్రిక్‌ను, ఆధార్ విశిష్ట సంఖ్యను వినియోగించనున్నారు.

10/22/2016 - 07:15

హైదరాబాద్, అక్టోబర్ 21: డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధలో డైరెక్టర్ జనరల్ నివాసంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పివి.రమేష్‌ను ఖాళీ చేయించేందుకు నిర్బంధ చర్యలు తీసుకోవద్దని తెలంగాణ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

10/22/2016 - 07:13

హైదరాబాద్/ చార్మినార్, అక్టోబర్ 21: స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కార్పొరేటర్, ఆర్య సమాజ్ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ ఆర్య (95) శుక్రవారం కన్నుమూశారు. పాతబస్తీలోని శాలిబండలో నివాసముండే ఆయన నాంపల్లి మెడ్విన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.

10/22/2016 - 07:12

హైదరాబాద్,అక్టోబర్ 21: తెలంగాణ సౌర విద్యుత్ డెవలపర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుందని రాష్ట్ర సదరన్ పవర్ డిస్కమ్ సిఎండి జి.రఘుమారెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన ఇక్కడ సౌర విద్యుత్ డెవలపర్లతో సమావేశమై రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులపై సమీక్షించారు.

10/22/2016 - 07:11

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికలో కీలక ఘట్టమైన తుది రాతపరీక్ష ఈ నెల 23న జరుగనుంది. ఇందుకు పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రిక్రూట్‌మెంట్ విభాగం చీఫ్ సూపరింటెండెంట్ అదనపు పోలీస్ కమిషనర్ (సిఏఆర్) ఎం శివప్రసాద్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 13 కేంద్రాల్లో 7,935 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

10/22/2016 - 05:53

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ తాత్కాలిక సచివాలయ నిర్వహణ కోసం ఆంధ్రకు కేటాయించిన భవనాలు తెలంగాణకు అప్పగించాలని ఉమ్మడి గవర్నర్‌ను కోరుతూ తెలంగాణ మంత్రిమండలి తీర్మానం చేసింది. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో ఆంధ్రకు కేటాయించిన భవనాలతోపాటు, వెలుపల ఉన్న శాసనసభ, శాసనమండలి, ఇతర భవనాలనూ తమకు అప్పగించాలని చేసిన తీర్మానంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది.

10/22/2016 - 05:22

హైదరాబాద్/ సిద్దిపేట, అక్టోబర్ 21: ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన జిహెచ్‌ఎంసి ఆబిడ్స్ బిల్ కలెక్టర్ నర్సింహరెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిపింది. ఏసిబి డిఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలో మూడు బృందాలుగా అధికారులు నగరంలోని మూడు ప్రాంతాల్లోవున్న మూడిళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి, కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు గుర్తించారు.

10/22/2016 - 05:19

హైదరాబాద్, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు చేరువైందని, తెలంగాణ చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర హోంమంత్రి నాయిని నార్సింహరెడ్డి అన్నారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థను చేరువ చేసేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టిందని, పోలీస్ సంక్షేమం, వ్యవస్థ ఆధునికీకరణకు వచ్చే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయింపునకు నిశ్చయించిందని అన్నారు.

10/22/2016 - 05:18

హైదరాబాద్, అక్టోబర్ 21: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా గార్ల మండలం తంగళ్లుపేటకు చెందిన అరుణ్‌కుమార్ (26) ఎంటెక్ పూర్తి కావడంతో అమీర్‌పేట్‌లో జావా కోచింగ్ సెంటర్‌లో చేరాడు.

10/21/2016 - 23:17

హైదరాబాద్, అక్టోబర్ 20: టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల కోసం ఇదిగో ఇది చేశాం అని గర్వంగా చెప్పుకోగలం, కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏముందని టిఆర్‌ఎస్ శాసన మండలి సభ్యులు ప్రశ్నించారు.

Pages