S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

,
09/02/2016 - 06:07

నల్లగొండ/నిజామాబాద్, సెప్టెంబర్ 1: అల్పపీడన వర్షాల జోరు నల్లగొండ జిల్లాలో గురువారం కూడా కొనసాగింది. 42 మండలాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురియగా 12.7 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా చండూరులో 70.8, దామరచర్లలో 46.6, నారాయణపూర్‌లో 46.2, నాంపల్లి 41.2, చౌటుప్పల్‌లో 40 మిల్లీమీటర్ల వర్షం పడింది.

09/02/2016 - 06:03

హైదరాబాద్, సెప్టెంబర్ 1: గ్యాంగ్‌స్టర్ నరుూం ముఖ్య అనుచరుల వేట కొనసాగుతోంది. నరుూం కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. దాదాపు 40 మంది నరుూం అనుచరులు, బంధువులు అరెస్టు అయిన ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. నరుూం కేసు దర్యాప్తులో భాగంగా ఆయన అనుచరులు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు.

09/02/2016 - 06:01

నేరేడుచర్ల, సెప్టెంబర్ 1: నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం గుండ్లపహాడ్ గ్రామపంచాయితీ పరిధిలోని పులిచింతల ముంపు గ్రామమైన గుండెబోయినగూడెం గ్రామంలో గృహాలను అధికారులు జెసిబితో గురువారం కూల్చివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గ్రామం పులిచింతల ముంపు పరిధిలోకి రావడంతో ప్రభుత్వం వారికి నర్లెంగులగూడెం గ్రామం సమీపంలో పునరావాస కేంద్రంగా పక్కా గృహాలు నిర్మించడంతో అక్కడికి తరలించారు.

09/01/2016 - 18:01

హైదరాబాద్‌ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తాను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉదయం నుంచి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని, ఒడిశా నుంచి దక్షిణ తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి ఉండడంవలన రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

09/01/2016 - 17:18

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు సోమన్నను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న శేషన్నకు సోమన్న కొరియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

09/01/2016 - 16:01

హైదరాబాద్‌: గోదావరి జలాల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్‌రావు గురువారం చెప్పారు. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందని, జనరేటర్లు, ఇన్వెర్టర్లకు గిరాకీ తగ్గిందన్నారు. నీటి ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమలకు 10శాతం నీటిని కేటాయించనున్నట్లు తెలిపారు.

09/01/2016 - 15:56

హైదరాబాద్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని, జాతీయహోదా రాకుంటే 75వేల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడుతుందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌కు వచ్చిన ప్రధానిని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కేసీఆర్‌ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

09/01/2016 - 14:30

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం సంతకం చేశారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంచినందుకు సీఎం కేసీఆర్కు టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

09/01/2016 - 14:25

హైదరాబాద్ : హైదరాబాద్ లో షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 2,220 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం తెలిపారు. ప్రత్యక్షంగా 378, ఈమెయిల్స్ ద్వారా 165, ఫేస్ బుక్ ద్వారా 320, వాట్సాప్ ద్వారా 162, డయల్ 110 ద్వారా అధికంగా 1157 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు.

09/01/2016 - 14:20

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Pages