S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/02/2016 - 21:53

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ పోలీస్ విభాగంలో భారీ మార్పులు, చేర్పులు జరిగాయి. ఒకేసారి ఏడుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేస్తున్న వి నవీన్‌చంద్‌ను బదిలీ చేస్తూ ఐజిపి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఎన్ శివధర్‌రెడ్డిని ఐజిపి పర్సనల్‌గా డిజిపి ఆఫీస్‌కు బదిలీ అయ్యారు.

09/02/2016 - 21:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: టిపిసిసి ఎస్సీ విభాగం విస్తరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు వైస్‌చైర్‌పర్సన్లు, పదిమంది కన్వీనర్లు, ముగ్గురు కార్యనిర్వాహక సభ్యులను నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన ద్వివేది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వైస్‌చైర్మన్లుగా ఎం.గమయ్య, సిద్ద ముత్యం, పల్లెపగు ప్రశాంత్, ఎస్.రాజలింగం, ఎస్.హేమంత్ కుమార్‌లను నియమించారు.

09/02/2016 - 21:50

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాల మూలంగా కురుస్తున్న వర్షం, ప్రధాన నదుల్లో నీటిప్రవాహాలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసేందుకు అధికారులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. ప్రదీప్ చంద్ర పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ 1 న ప్రారంభమైన నైరుతీ రుతుపవనాలు సెప్టెంబర్ 30 వరకు ఉంటాయి.

09/02/2016 - 21:50

హైదరాబాద్, సెప్టెంబర్ 1: బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్త బంద్‌కు ట్రేడ్ యూనియన్లు పిలుపునివ్వడంతో జెఎన్‌టియు హెచ్ శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. అదే విధంగా తెలంగాణలో పలు పాఠశాలలు, విద్యాసంస్థలు శుక్రవారం నాడు సెలవు ప్రకటించాయి. పలు విశ్వవిద్యాలయాలు పరీక్షలను రీ షెడ్యూలు చేశాయి.

09/02/2016 - 21:49

హైదరాబాద్, సెప్టెంబర్ 1: హీరో కంపెనీ ఏర్పాటు చేసిన బిఎంఎల్ ముంజల్ యూనివర్శిటీలో ఆపరేషనల్ ఎక్స్‌లెన్స్ రీసెర్చి సెంటర్‌ను ప్రారంభించినట్టు సంస్థ అధ్యక్షుడు అక్షయ్ ముంజల్ తెలిపారు.

09/02/2016 - 21:48

హైదరాబాద్, సెప్టెంబర్ 1: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని నాణ్యమైన విత్తన ఉత్పత్తి కేంద్రంగా తయారు చేసేందుకు, రైతులకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

09/02/2016 - 18:19

హైదరాబాద్: చదువుల తల్లి సరస్వతి ఇపుడు లక్ష్మీదేవిలా మారిందని, లోపాలమయంగా మారిన నేటి విద్యావ్యవస్థను ఇకనైనా ప్రక్షాళన చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు.

09/02/2016 - 18:06

హైదరాబాద్: 108 మందితో తెలంగాణ తెలుగు యువత కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడిగా వీరేందర్‌గౌడ్‌కు ఎన్నుకున్నారు. కమిటీలో 10 మంది ఉపాధ్యక్షులు, 11 మంది ప్రధాన కార్యదర్శులుగా ఉంటారని టీడీపీ నేతలు తెలిపారు.

09/02/2016 - 18:03

హైదరాబాద్: నయీమ్ కేసులో మరో 10 మంది అరెస్ట్ చేశామని, ఇప్పటివరకు 62 కేసులు నమోదు చేశామని సిట్ ఐజీ నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. కోరుట్లలో అహ్మద్‌ఖాన్‌ను, భువనగిరిలో 9 మంది అరెస్ట్‌ చేశామని ఆయన చెప్పారు. భువనగిరిలో అరెస్టైన వారని పాశం శీను అనుచరులుగా గుర్తించామని తెలిపారు. పాశం శీనుతో కలిసి భువనగిరిలో కిడ్నాప్‌లు, బలవంత రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని నాగిరెడ్డి వెల్లడించారు.

09/02/2016 - 17:31

హైదరాబాద్: నగరంలోని బోయిన్ పల్లిలో ఎన్ఆర్ఐ గౌతం రెడ్డి(29) దారుణ హత్య కు గురయ్యాడు. ఓ డెయిరీ ఫామ్ వద్ద శుక్రవారం మృత దేహం లభ్యమవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గౌతం రెడ్డి(29) ఆరేళ్ల నుంచి కెన్యా లో ఉంటున్నాడు. గత నెల 29 న నగరానికి వచ్చిన ఆయన మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలింపు చేపట్టారు.

Pages