S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/03/2016 - 05:05

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్సీలు, జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్సీలను ఈ నెలాఖరులోగా నియమించడానికి కసరత్తు జరుగుతోంది. ఐఏఎస్ అధికారులకు పోస్టిగ్‌లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐపిఎస్‌లకు అధికారులకు పోస్టింగ్‌లపై డిజిపి ప్రతిపాదనలు రూపొందించి ఈ నెల 15 వరకు ముఖ్యమంత్రికి పంపించడానికి కసరత్తు జరుగుతోంది.

09/03/2016 - 05:02

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళోజి నారాయణరావు అవార్డ్ 2016ను ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఏర్పాటు చేసిన ఈ అవార్డును పొందిన వారిలో గోరటి రెండవ వారు. కాళోజి నారాయణరావు అవార్డుతో పాటు 1,01,116 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. కాళోజీ అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల గోరటి వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు.

09/03/2016 - 04:59

హైదరాబాద్, సెప్టెంబర్ 2: నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

09/03/2016 - 04:57

హైదరాబాద్, సెప్టెంబర్ 2: దేశవ్యాప్తంగా 25వేల నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దోమల్‌గూడలోని ఎవి కాలేజీలో తెలంగాణ జాగృతి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి శుక్రవారం ప్రారంభించారు.

09/02/2016 - 21:56

భువనగిరి, సెప్టెంబర్ 1: అక్రమ ఆయుధాలు కలిగిఉండటంతో పాటు పలువురిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడిన కేసులో నిందితుడు భువనగిరి ఎంపిపి తోటకూరి వెంకటేశ్‌యాదవ్‌ను పోలీసులు ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
భువనగిరి వ్యాపారులను విచారించిన పోలీసులు...

09/02/2016 - 21:56

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 1: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో సిట్ ప్రత్యేక పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గురువారం సిట్ పోలీసులు నరుూం భార్య హసీనా, సోదరి ఖలీమా బేగంలను తమ తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాలని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని 8వ మెట్రోపాలిటన్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

09/02/2016 - 21:55

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ గురుకులాల ముఖచిత్రం మార్చేందుకు కార్యదర్శి సీనియర్ ఐపిఎస్ అధికారి ఆర్ ప్రవీణ్‌కుమార్ తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై రోజుకూ గురుకుల సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

09/02/2016 - 21:54

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణలో భూవినియోగ మార్పిడి చార్జీలు భారీగా పెరిగాయి.

09/02/2016 - 21:54

హైదరాబాద్, సెప్టెంబర్ 1: భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీ వరకూ తిరంగా యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. 17వ తేదీన తిరంగా యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు.

09/02/2016 - 21:53

హైదరాబాద్, సెప్టెంబర్ 1: సీనియర్ ఐఎఎస్ అధికారి, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ మిశ్రాకు ప్రమోషన్ ఇచ్చారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మిశ్రాకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీశ్ శర్మ పేరుతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనను ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగించాలని నిర్ణయించారు.

Pages