S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/13/2016 - 08:06

వరంగల్, జూలై 12: గోదారమ్మ శాంతించింది. గత నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో వరద ఉద్ధృతికి గోదారమ్మ ఉరకలేసింది. దీంతో ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర్‌ఘాట్, మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహించింది. లోతట్టు గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాంనగర్ లోలెవల్ వంతెనపై వరద ప్రవాహం చేరడంతో రాంనగర్, లంబాడితండా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

07/13/2016 - 08:05

ఖమ్మం, జూలై 12: ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ నేతల మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీలో అన్ని నియోజకవర్గాల్లోనూ మూడు గ్రూపులు ఉండడం, పార్టీ కార్యక్రమాలను కూడా వేరువేరుగా చేపడుతుండడం విశేషం.

07/13/2016 - 08:04

భద్రాచలం, జూలై 12: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో మంగళవారం గరిష్టంగా 52.4 అడుగుల వద్ద నిలకడగా మారింది. దిగువన శబరి ఉప్పొంగడంతో ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. కాళేశ్వరం, పేరూరు, ఏటూరునాగారం వద్ద మంగళవారం సాయంత్రం నాటికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో మరి కొద్ది గంటల్లో భద్రాచలం వద్ద కూడా వరద తగ్గడం ప్రారంభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

07/13/2016 - 08:03

భద్రాచలం, జూలై 12: గోదావరి అంత్యపుష్కరాల ముహూర్తాన్ని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ మంగళవారం ఖరారు చేసింది. ఈ మేరకు దేవస్థానం ఇఒ తాళ్లూరి రమేశ్‌బాబుకు అప్పగించింది. జూలై 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించాలని వైదిక కమిటీ సూచించింది. జూలై 31 ఉ.

07/13/2016 - 08:02

నల్లగొండ, జూలై 12: నల్లగొండ జిల్లాలో సంచలనం రేపిన 35 లక్షల 50 వేల రూపాయల ఎటిఎం నగదు చోరీ కేసులో నిందితులు ఎటిఎం నగదు బదిలీ చేసే సంస్థ ఉద్యోగులేనని తేలింది. చోరీ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించి నిందితులిద్దరినీ అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. జిల్లా ఎస్పీ ఎన్.

07/13/2016 - 08:02

ఆదిలాబాద్,జూలై 12: ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత వర్షాలకు తోడు ఎగువ మహారాష్ట్ర నుండి పోటెత్తిన వరదలతో ఆదిలాబాద్ జిల్లా అస్తవ్యస్తమైంది. జిల్లా సరిహద్దులోని గోదావరి, పెన్‌గంగా, ప్రాణహిత నదులు పోటెత్తి ఉధృతంగా ప్రవహించడంతో బ్యాక్‌వాటర్ కారణంగా లోతట్టు గ్రామాలు మంగళవారం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

07/13/2016 - 08:01

నిజామాబాద్, జూలై 12: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నిన్నమొన్నటి వరకు కూడా ఇసుక తినె్నలు, రాళ్లతో దైన్య స్థితిలో కనిపించిన ‘గోదారమ్మ’కు వరద పోటెత్తడంతో ఒక్కసారిగా జలకళను సంతరించుకుని బిరబిరా ప్రవహిస్తోంది.

07/13/2016 - 07:49

హైదరాబాద్, జూలై 12: శ్రావణ మాసంలో సుదర్శనయాగం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఆయుత చండీయాగం నిర్వహించిన సందర్భంగా ముగింపులో మిషన్ భగీరథ విజయవంతం అయితే సుదర్శన యాగం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. మిషన్ భగీరథ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. గజ్వేల్ నియోజక వర్గంలో పలు గ్రామాలకు పైప్‌లైను పనులు పూర్తయ్యాయి.

07/13/2016 - 05:40

హైదరాబాద్, జూలై 12:కేసీఆర్ నెంబర్ వన్.. శివరాజ్‌సింగ్ చౌహాన్ నెంబర్ టూ.. రమణసింగ్ నెంబర్ త్రీ.. ఆనంది బెన్ నెంబర్ ఫోర్.. అరవింద్ కేజ్రీవాల్ నెంబర్ ఫైవ్! ఈ నెంబర్లేమిటని అనుకుంటున్నారా? సిఎంల పనితీరుపై పిఎం నిర్వహించిన సర్వేలో వచ్చిన స్థానాలివి! అందులో తెలంగాణ సిఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

07/13/2016 - 05:07

హైదరాబాద్, జూలై 12:పాతబస్తీలో గత నెలలో పట్టుబడిన ఉగ్రవాద అనుమానితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తాజాగా మంగళవారం మరో ఇద్దరిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బండ్లగూడెంకు చెందిన యాసిర్ నియామతుల్లా, మొగల్‌పురాకు చెందిన అల్త్ఫా రహ్మాన్‌లను మంగళవారం కోర్టులో హాజరుపరచారు. కాగా వారం రోజుల కస్టడీ ఇవ్వాలని పోలీసుల అభ్యర్థన మేరకు వారిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages