S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/15/2016 - 06:10

హైదరాబాద్, జూలై 14: ముంపు ప్రాంతాల బాధితుల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్ తెలిపారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో టిజెఎసి పర్యటించిందని, సదస్సులు నిర్వహించినట్టు చెప్పారు. పలువురు న్యాయవాదులు సైతం సదస్సుకు హాజరై న్యాయపరమైన అంశాలు వివరించారని చెప్పారు. సమస్యలు, న్యాయపరమైన అంశాలు అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయనున్నట్టు చెప్పారు.

07/15/2016 - 06:09

హైదరాబాద్, జూలై 14: హరితహారం కార్యక్రమంలో భాగంగా సిఎస్‌ఆర్ ఎస్టేట్స్ అధినేత, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన శేఖర్‌రెడ్డి తన సొంత డబ్బుతో సుమారు 4లక్షల 18వేల మొక్కలను నాటడంతో పాటు మరో రెండు లక్షల మొక్కలను ఇతర సంస్థలతో నాటించారు. హరితహారం కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నాటి నుంచి ఈ కార్యక్రమంలో శేఖర్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా పాల్గొన్నారు.

07/15/2016 - 06:08

ధర్మపురి, జూలై 14: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధానిస్తున్న రాయపట్నం లోలెవల్ బ్రిడ్జి అంచులను తాకుతూ గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి 9.30 గంటల నుండి వంతెన పైనుండి రాకపోకలను నిలిపి వేశారు.

07/15/2016 - 06:07

హైదరాబాద్, జూలై 14: అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దేశంలో మరే రాష్ట్రం కల్పించని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. జర్నలిస్టు సంఘాల నాయకులు క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రిని కలిశారు.

07/15/2016 - 06:06

హైదరాబాద్, జూలై 14 : మెదక్ జిల్లాలో నేషనల్ ఇన్‌వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలికసదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) కు ప్రభుత్వం అనుమతించింది. నిమ్జ్ ఏర్పాటు చేసేందుకు 12,635 ఎకరాల భూమి కావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది.

07/14/2016 - 07:44

హైదరాబాద్, జూలై 13: ‘రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నాం, మీరూ పోటీ పడండి..’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చురుకైన నేతలను, కార్యకర్తలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని అన్నారు.

07/14/2016 - 07:44

హైదరాబాద్, జూలై 13 : హరితహారం కార్యక్రమంలో నాటుతున్న మొక్కలను పెంచిపోషించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేర్కొన్నారు. హరితహారంలో పాల్గొంటున్న వివిధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించారు.

07/14/2016 - 07:30

నిజామాబాద్, జూలై 13: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ నీటిమట్టం గణనీయంగా పెరగుతోంది. 1091.00 అడుగులు, 90టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో, బుధవారం సాయంత్రం నాటికి 1060.30 అడుగులు, 13.91టిఎంసిల నీరు నిలువ ఉంది.

07/14/2016 - 07:29

పెద్దఅడిశర్లపల్లి, జూలై 13: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలం చిలకమర్రి స్టేజీ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి బైక్, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

07/14/2016 - 07:28

సంగారెడ్డి, జూలై 13: నమ్మి పట్టం కట్టిన ప్రజలను మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో నిట్ట నిలువునా ముంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చూస్తుందని, అలాంటి ఆటలకు మన తెలంగాణలో కొనసాగవని, మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేకూర్చడానికి అవసరమైతే ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని రప్పించడానికి కూడా సిద్దంగా ఉన్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం కల్పించారు.

Pages