S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/14/2016 - 08:14

నర్సంపేట, మే 13: కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిన కాళేశ్వరం బ్యారేజిని నిర్మించి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు.

05/14/2016 - 08:14

వరంగల్, మే 13: సందర్భాలను బట్టి ప్రజల దృష్టిని మళ్లించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిట్ట అని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కరువు కోరల్లో విలవిలలాడుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ తెరపైకి తాజాగా జిల్లాల విభజన తీసుకొచ్చాడని ఆయన అన్నారు.

05/14/2016 - 08:13

వరంగల్, మే 13: వరంగల్‌లో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం 6వ రోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం జరిపిన తరువాత చతుఃస్థానార్చన సదస్యం ఉదయం 11 గంటలకు అమ్మవారిని పల్లకిసేవలో ఊరేగింపు జరిపారు. సాయంత్రం భద్రకాళీ అమ్మవారిని ధనలక్ష్మీ అలంకరణతో శేష వాహనంపై ఊరేగింపు జరిపారు.

05/14/2016 - 08:06

ఖమ్మం, మే 13: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఆయా పార్టీల రాష్ట్ర నేతలు ఖమ్మంలో మకాం వేసి గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే ఇక మిగిలిన రెండు రోజులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి గెలిచే ప్రయత్నాలు చేయనున్నారు.

05/14/2016 - 07:38

హైదరాబాద్, మే 13: నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ పథకాన్ని ఇక నుంచి వెనుకబడిన (బిసి), ఆర్థికంగా వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు వర్తిం ప చేస్తున్నట్టు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు.

05/14/2016 - 05:45

హైదరాబాద్, మే 13: తెలంగాణ ఎమ్సెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్, జెఎన్‌టియుహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్‌వి రమణారావు శుక్రవారంనాడు చెప్పారు. ఇంజనీరింగ్‌కు 1,43,481 మంది, మెడికల్‌కు 1,00,983 మంది దరఖాస్తు చేశారని, వారందరికీ హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇంజనీరింగ్‌కు 276, మెడికల్‌కు 190 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

05/14/2016 - 05:35

హైదరాబాద్, మే 13: తెలంగాణకు సంబంధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారుల తుది జాబితాను ఖరారు చేస్తూ శుక్రవారం డివోపిటి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణకు తొలుత 167మంది ఐఏఎస్ అధికారులను కేటాయించారు. అయితే కొత్త రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నందున ఏఎఎస్‌ల కేటాయింపు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని కోరింది.

05/14/2016 - 05:34

హైదరాబాద్, మే 13: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వివాదంలో ఉన్న స్ధలంలో పోలీసు కమాండ్ జంట టవర్ల నిర్మాణాన్ని రెండు వారాల పాటు నిలుపుదల చేయాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

05/14/2016 - 05:31

హైదరాబాద్, మే 13: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతుంటే, ప్రధానంగా మూడు జిల్లాల నుంచి సమస్య తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. మిగిలిన ఏడు జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదురుతున్నట్టు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్టవ్య్రాప్తంగా గ్రామం మొదలుకుని, మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా వరకు తెలంగాణ స్వరూపం పూర్తిగా మారనుంది. ఈమేరకు ప్రతిపాదనలపై కసరత్తు నడుస్తోంది.

05/13/2016 - 16:25

హైదరాబాద్:బీసి, ఈబిసిలకు చెందిన యువతుల వివాహానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి పథకానికి రూ.300 కోట్లు కేటాయించినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సంక్షేమశాఖ కార్యాలయంలో కల్యాణలక్ష్మి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వివాహం కాని యువతులు సహాయంకోసం వెబ్‌సైట్‌ను విజిట్ చేసి కోరవచ్చని ఆయన తెలిపారు.

Pages