S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/16/2016 - 18:02

వరంగల్: నాంపల్లి కోర్టులో హాజరు పరచి తిరిగి వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకొస్తుండగా ఉప్పల సూరి అనే ఖైదీ ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన సోమవారం జరిగింది. వాహనంలో వరంగల్‌కు సూరిని తరలిస్తుండగా జనగామ సమీపంలో యశ్వంతపూర్ వద్ద టాయ్‌లెట్ కోసమని ఆగారు. వాహనంలో నుంచి ఎస్కార్టు పోలీసులతో పాటు సూరి కిందకు దిగాడు. ఆ సమయంలో సూరి పరారయ్యాడు.

05/16/2016 - 18:01

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా కార్మికులు సోమవారం నాడు సమ్మె నోటీసు ఇచ్చారు. వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, సంస్థ విభజనను వెంటనే పూర్తి చేయాలని, ప్రైవేటు బస్సులను నియంత్రించాలని తదితర 14 డిమాండ్లతో కూటిన సమ్మె నోటీసును టి.ఎస్. ఆర్.టి.సి జెఎండి రమణారావుకు ఎన్‌ఎంయు సహా 7 కార్మిక సంఘాల నేతలు అందజేశారు.

05/16/2016 - 16:19

హైదరాబాద్: తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ వైకాపా అధినేత జగన్ కర్నూలులో మూడురోజుల జలదీక్ష ప్రారంభించడంపై ఓయు విద్యార్థి జెఎసి, తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని లోటస్‌పాండ్ వద్ద వైకాపా కార్యాలయాన్ని ముట్టడించేందుకు సోమవారం మధ్యాహ్నం వారు ప్రయత్నించారు.

05/16/2016 - 16:19

హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి ఆరు రోజుల పాటు హైదరాబాద్‌లో 5వేల మంది యువ సాంకేతిక నిపుణులు పాల్గొనేలా ‘టెక్‌ఫెస్ట్’ జరుపుతామని తెలంగాణ ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సోమవారం తెలిపారు. సిఐఎం గ్లోబల్ సంస్థతో కలిసి దీన్ని నిర్వహిస్తామని, 2018 ఫిబ్రవరిలోగా టి.హబ్ రెండోదశను ప్రారంభిస్తామన్నారు.

05/16/2016 - 13:56

హైదరాబాద్: పరిశ్రమలు నెలకొల్పేవారికి అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ ఆదేశించారు. పరిశ్రమల శాఖపై ఆయన సోమవారం జరిగిన సమీక్షలో మాట్లాడుతూ, ఆన్‌లైన్ ద్వారా కొన్ని రకాల అనుమతులను జాప్యం లేకుండా ఇవ్చవచ్చన్నారు. పరిశ్రమలకు కేంద్రం ఇచ్చే రాయితీల గురించి ప్రచారం చేయాలన్నారు. పరిశ్రమలు, అటవీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

05/16/2016 - 13:52

ఆదిలాబాద్: వైకాపా అధినేత వైఎస్ జగన్ ఎన్ని దీక్షలు చేసినా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ఆగే ప్రసక్తే లేదని మంత్రి హరీష్ రావు సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. న్యాయబద్ధంగా తమకు చెందాల్సిన నీటినే తాము వాడుకుంటున్నామని, ఆంధ్రాప్రాంత రైతులకు అన్యాయం చేయాలన్న ఆలోచన తెలంగాణ సర్కారుకు లేదన్నారు. ఎపి సిఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

05/16/2016 - 11:50

హైదరాబాద్: పాతబస్తీ ప్రాంతంలోని ఆసిఫ్‌నగర్, గోషామహల్ ప్రాంతాల్లో పశ్చిమ మండలం పోలీసులు సోమవారం ఉదయం రౌడీషీటర్ల ఇళ్లల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఈ సందర్భంగా 27 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు.

05/16/2016 - 11:49

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కె.టి.ఆర్ సోమవారం ఉదయం ఖైరతాబాద్‌లోని ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వచ్చి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీఎ అధికారులు తమ శాఖ పనితీరును మంత్రికి వివరించారు.

05/16/2016 - 11:49

కరీంనగర్: జిల్లెలగడ్డలోని ఓ ప్రైవేటు పత్తిమిల్లులో సోమవారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగి సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

05/16/2016 - 11:47

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక సందర్భంగా సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు జనం ఉత్సాహంగా చేరుకుంటున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి ఆదర్శ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు.

Pages