S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/24/2016 - 17:36

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని కొన్ని చోట్ల ఉగ్రవాదుల కదలికలు ఇటీవల అధికమయ్యాయని, మజ్లిస్ పార్టీ ఇందుకు ప్రోత్సహిస్తోందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆరోపించారు. దేశ ద్రోహులైన ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ సహకరిస్నున్నందునే శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయన్నారు.

01/24/2016 - 16:02

హైదరాబాద్: ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిన తెరాస నాయకులు నేడు గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం సీమాంధ్రులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ కాంగ్రెస్ వల్లే సాధ్యమన్నారు.

01/24/2016 - 16:01

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజల కనీస సౌకర్యాలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోను టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో విడుదల చేశారు. తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.

01/24/2016 - 16:01

వరంగల్: వరంగల్ జిల్లా ములుగు వద్ద ఆదివారం రోడ్డుపై ఆగిఉన్న జీపును వేగంగా దూసుకొస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. జీపులో నుంచి వారు గొర్రె పిల్లలను కిందకు దించుతుండగా మృత్యురూపంలో లారీ దూసుకొచ్చింది.

01/24/2016 - 16:00

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులను కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు, మల్లు భట్టివిక్రమార్క తదితరులు ఆదివారం పరామర్శించారు. విద్యార్థుల ఆందోళనకు వారు సంఘీభావం ప్రకటించారు.రోహిత్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

01/23/2016 - 12:56

ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో మహిళా కోర్టు, భార్యాభర్తల కౌన్సిలింగ్ కేంద్రం నేడు ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ సునీల్ చౌదరిలు పాల్గొన్నారు.

01/23/2016 - 14:34

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆమరణ దీక్షలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. దీక్షలో పాల్గొంటున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది.

01/23/2016 - 11:50

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ఉదయం ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఇండిగో విమాన సంస్థ సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ప్రయాణీకులు ఆందోళన ప్రారంభించి, ఎయిర్‌పోర్ట్‌లో బైఠాయించారు. దీంతో 48 మంది ప్రయాణీకులను ఎయిర్‌పోర్ట్‌లోనే ఇండిగో సిబ్బంది వదిలేశారు. కొద్దిమంది ప్రయాణికులతో ఆ విమానం రాయ్‌పూర్ బయల్దేరింది.

01/23/2016 - 11:50

నల్గొండ: యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉదయం పూజలు చేశారు. ఆలయం వద్ద ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సిఎస్ వెంట జిల్లా కలెక్టర్, తదితర అధికారులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ సమావేశంలో రాజీవ్‌శర్మ పాల్గొంటారు.

01/23/2016 - 11:49

హైదరాబాద్: వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో రెండు కార్లు దగ్ధమయ్యాయి. వరంగల్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ కారులో ఆకస్మికంగా మంటలు వ్యాపించటంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కిందకి దూకారు. మంటల్లో దగ్ధమైన ఈ కారు జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ది గుర్తించారు.

Pages