S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/01/2018 - 06:18

హైదరాబాద్, సెప్టెంబర్ 30: రైతుబంధు పథకం కింద రైతులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం అక్టోబర్ మొదటివారంలో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఇదే అంశంపై బ్యాంకర్లతో రెండురోజుల క్రితమే సుదీర్ఘంగా చర్చించారు. వెంటనే రైతుల పేర్లతో చెక్కులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

09/30/2018 - 03:24

సంగారెడ్డి, సెప్టెంబర్ 29: అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను, రక్తం పంచుకుని పుట్టిన కూతురు, కొడుకులను మోసం పరాయి వ్యక్తులు తమ కుటుంబ సభ్యులని ఇతర దేశాలకు తరలించిన జగ్గారెడ్డిని చక్కగా మాట్లాడే జానారెడ్డి సమర్థిస్తారా అంటూ అపధర్మ మంత్రి టీ.హరీష్‌రావు బహిరంగంగా ప్రశ్నించారు. జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణాపై రాష్ట్ర మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

09/30/2018 - 03:19

నిజామాబాద్, సెప్టెంబర్ 29: ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మిగిలేది కష్టాలు, కన్నీళ్లేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పాత సంస్కృతి పునరావృతం అవుతూ, దోపిడీ ధోరణి పెచ్చుమీరుతుందని ఆయన ఆక్షేపించారు. జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా శనివారం ఎంపీ కవితతో కలిసి క్యాంపు కార్యాలయంలో ఈటల విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

09/30/2018 - 03:17

నకిరేకల్, సెప్టెంబర్ 29: ప్రస్తుతం అన్ని పార్టీలను కలుపుకొనిపోతేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. చెరుకు సుధాకర్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని ఇంటిపార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు కాంగ్రెస్ అధిష్టానం గుర్తింపు ఇవ్వడం లేదన్నారు.

09/30/2018 - 05:59

సిరిసిల్ల: గతంలో ఎన్టీ రామారావుకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు నేడు కాంగ్రెస్‌తో జత కట్టి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రగతినగర్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

09/30/2018 - 03:13

నల్లగొండ, సెప్టెంబర్ 29: రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతు టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచారు.

09/30/2018 - 03:12

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతికి సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే ఫైలుకు ఆమోదం తెలపాలని, ఎలాంటి ఆటంకం కలిగించవద్దంటూ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) ని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు కోరారు. టీఈఏ అధ్యక్షుడు సిహెచ్. సంపత్ కుమార స్వామి, గౌరవాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.

09/30/2018 - 03:00

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ప్రజాసమస్యల పరిష్కారానికి ఎడతెగని పోరు సాగించే తత్వం ఎమ్మెల్సీ రామచందర్‌రావుదని, ఆత్మవిశ్వాసంతో ఆయన ముఖం తొణికిసలాడుతుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. ఎన్ రామచందర్‌రావు రాసిన ‘శాసనమండలిలో ప్రసంగాలు ’ అనే పుస్తక ఆవిష్కరణ సమావేశానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

09/30/2018 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్ర ఆర్‌టీసీని నష్టాల నుంచి లాభాల వైపు తీసుకురావడానకి ఏర్పాటు చేసిన నిపుణుల అధ్యయన కమిటి శుక్రవారం భేటీ అయ్యింది. హైదరాబాద్ బస్సుభవనంలో ఆర్‌టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన నిపుణుల అధ్యయన కమిటి ఆర్‌టీసీ స్థితిగతులపై సుధీరంగా చర్చించింది.

09/30/2018 - 02:56

హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో జరగబోయే ముందస్తు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు మద్దతు ప్రకటిస్తున్నామని శివ సేన తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి ఎ. గంగపుత్ర సుదర్శన్ తెలిపారు. శనివారం సుదర్శన్ ఆర్.కృష్ణయ్యతో సమావేశమై ముందస్తు ఎన్నికల గురించి చర్చించారు.

Pages