S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/03/2018 - 02:23

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో టీటీడీపీకి పూర్వవైభవం వస్తుందని పార్టీ ప్రధానకార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్‌గౌడ్‌లు పేర్కొన్నారు.

10/03/2018 - 03:23

పాపన్నపేట: పంటల పరిరక్షణ కోసం సింగూర్ నీటిని విడుదల చేయగా ఘణపురం ప్రాజెక్ట్ పైనుంచి మంజీర పొంగిపొర్లుతూ పరవళ్లు తొక్కుతోంది. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందు నుండి మంజీర నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ముందస్తుగా ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి భక్తుల రాకపోకలను నిలిపివేసి ఆలయాన్ని అధికారులు మంగళవారం మద్యాహ్నం మూసివేశారు.

10/03/2018 - 02:08

తమ్మలి మురళీధర్

10/03/2018 - 02:04

పాలకుర్తి, అక్టోబర్ 2: సమాజ నిర్మాణంలో ఓటు రాజకీయ పాలనకు పునాదిలాంటి దని ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ప్రముఖ రచయిత, కవి ప్రొఫెసర్ యాదనల ప్రభంజన్‌యాదవ్ రచించిన గొల్లకురుమల గొప్ప సంస్కృతి, విప్లవాలు సృషిస్తున్న విగ్రహాలు, నడుస్తున్న చరిత్ర, కాసుల జ్ఞానం, పెత్తనం పుస్తకాలను ప్రజా గాయకుడు గద్దర్ అవిష్కరించారు.

10/03/2018 - 01:59

ఆదిలాబాద్,అక్టోబర్ 2: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గాల్లో ఆదివాసీలు ఈ ఎన్నికల్లో రాజకీయ ఆధిపత్యం చాటుకునే రీతిలో తుడుం మోగించి మూడు సీట్లను కైవసం చేసుకోవాలని, ఇందుకోసం సంఘటితంగా ఎన్నికల ఉద్యమానికి ఆదివాసీలు సిద్దం కావాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు పిలుపునిచ్చారు.

10/03/2018 - 01:57

మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 2: సిఎల్‌పి మాజీ నాయకులు పుత్రవాత్సల్యంతో మట్టికరిచే పరిస్థితి రావద్దని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాము అన్ని కులాల వారి మద్దతుతో గెలిచిన వారమని, ఒక కులం గెలిపిస్తుందని భావించవద్దన్నారు.

10/03/2018 - 01:55

హైదరాబాద్, అక్టోబర్ 2: ముందస్తు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టిక్కెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.

10/03/2018 - 01:54

రామన్నపేట, అక్టోబర్ 2: ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను వేగవంతం చేసి దీపావళి వరకు రైతులకు నీళ్లు అందించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అధికారులను ఆదేశించారు. గోకారం చెరువు నుంచి సాగుబావిగూడెం వరకు ఉన్న కాలువను పలువురు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం పరిశీలించారు.

10/03/2018 - 01:53

నల్లగొండ, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మగాంధీ చూపిన ఆదర్శనీయ మార్గమే సమాజంలోని అన్ని వర్గాలకు అనుసరణీయ మార్గమని ప్రజలంతా గాంధీ జీవిత స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు పీసీసీ మేనిఫెస్టో కమిటీ కో-చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏ.వీ.రంగనాథ్ అన్నారు.

10/02/2018 - 17:09

కల్వకుర్తి: కల్వకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఎక్వాయిపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారు పాక్షికంగా దెబ్బతింది.

Pages