S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/02/2018 - 04:08

హైదరాబాద్, అక్టోబర్ 1: రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అన్ని విభాగాలనూ క్రియాశీలం చేస్తూనే పార్టీని సమాయత్తం చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. వివిధ కమిటీలను వేసి, ప్రచారం ఉద్ధృతం చేసి , ఎపుడు ఎన్నికలు ప్రకటించినా, సర్వం సిద్ధంగా ఉండాలని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

10/02/2018 - 04:06

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలమైందని తెలంగాణ సచివాలయం న్యాయశాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేసిన జయశంకర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సచివాలయ ఉద్యోగులను చైతన్యపరచి, ఉద్యమంలో పాల్గొని సచివాలయ కేసీఆర్‌గా పేరు తెచ్చుకున్న జయశంకర్ పదవీ విరమణ చేశారు.

10/02/2018 - 02:42

వరంగల్, అక్టోబర్ 1: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విశాఖ జిల్లా అరుకు సంఘటనతో తెలుగు రాష్ట్రాలలో మావోల కదలికలు ఉన్నాయనే ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తెలంగాణలోని పలు సమస్యాత్మక జిల్లాలను గుర్తించారు. సోమవారం రాష్ట్ర డీజీపీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు చేరుకొన్నారు.

10/02/2018 - 02:37

మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 1: రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, పరిపాలన సక్రమంగా అందించలేకనే రాష్ట్ర అపద్ధర్మ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ పక్ష మాజీ నాయకులు కుందూరు జానారెడ్డి ఆరోపించారు.

10/02/2018 - 02:35

సిద్దిపేట, అక్టోబర్ 1: తెలంగాణ ఉద్యమ సమయంలో 12వందల మంది విద్యార్థులు, యువకులు స్వరాష్ట్రం కోసం అమరులైనారని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. అమరుల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ఆదుకోవటంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

10/02/2018 - 02:33

గజ్వేల్, అక్టోబర్ 1: తెలంగాణపై దుష్టశక్తులు కనే్నయగా, ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఆంధ్రా బాబేనని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ రూరల్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

10/02/2018 - 02:30

నిజామాబాద్, అక్టోబర్ 1: ఎన్నికల వాతావరణం అంతకంతకూ వేడెక్కుతున్న ప్రస్తుత తరుణంలో అందరి దృష్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పైనే కేంద్రీకృతమై ఉంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున టిక్కెట్‌ను కోరుతూ ఆశావహులంతా పోటాపోటీగా లాబీయింగ్ యత్నాల్లో నిమగ్నమై ఉండగా, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించడంతో అర్బన్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

10/02/2018 - 02:29

జనగామ టౌన్, అక్టోబర్ 1: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణకు చెందిన వారు కాదని, ఆయన పూర్వీకులు ప్రాంతీయేతరులేనని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా మద్దూరు, నర్మెట మండలాల్లో పర్యటించిన ఆయన సోమవారం జనగామ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేశారు.

10/02/2018 - 02:28

నల్లగొండ, అక్టోబర్ 1: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్ఠానానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. హుజూర్‌నగర్ నియోజవర్గం టీఆర్‌ఎస్ టికెట్‌ను తనకే ఇవ్వాలని.. లేదంటే తాను సూచించిన ఎన్నారై అప్పిరెడ్డికే ఇవ్వాలని ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు.

10/02/2018 - 02:28

గోదావరిఖని, అక్టోబర్ 1: భారత దేశానికి వెలుగులను అందజేస్తున్న ఎన్టీపీసీ ఉద్యోగులు హక్కులను కాపాడుకోవడంలో దర్జాగా మోసానికి గురవుతున్నారు..! హక్కులను సాధించి పెట్టే కార్మిక సంఘాల చేతిలో దగా పడుతున్నారు..! అక్కడ... తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు నమ్మిన జాతీయ కార్మిక సంఘాలన్ని కూడా యాజమాన్యం ముందు ‘హక్కులను తాకట్టు’ పెట్టాయని ఉద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.

Pages