S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2018 - 03:54

హైదరాబాద్, ఆగస్టు 21: ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌కార్డులను తిరస్కరించే ఆస్పత్రులపై చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

08/22/2018 - 03:52

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణలో దేవాలయాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నప్పటికీ, తెలంగాణ దేవాలయాల అభివృద్ధి జరగలేదన్నారు.

08/22/2018 - 03:46

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రోడ్లపరిస్థితిపై సచివాలయంలో సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. వర్షాలు ఇంకా కురుస్తున్నాయని, ఇవి తగ్గగానే, జిల్లాల వారీగా రోడ్ల పరిస్థితిపై నివేదిక రూపొందించి తనకు సమర్పించాలని ఆదేశించారు.

08/22/2018 - 03:45

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మరీ ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అధిక ఫీజులపై ఉద్యమించేందుకు తల్లిదండ్రులతో ఒక వేదిక ఏర్పాటైంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీస్ పేరెంట్స్ (జాక్ -ఇసీపీ) పేరిట ఈ వేదిక ఏర్పాటైంది.

08/22/2018 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 21: విదేశాల్లో చదువులకు వాట్సప్ గ్రూప్ ఒకటి ఏర్పాటైంది. యాకెట్ పేరుతో ఏర్పాటైన గ్రూప్‌లో ఇప్పటికే రెండు లక్షల మంది సభ్యులయ్యారు. ఈ గ్రూప్‌లో విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు , కోర్సులు, ఫీజులు గురించి సలహాలు, సంప్రదింపులు అందిస్తున్నట్టు సహ వ్యవస్థాపకుడు సుమీత్ జైన్ చెప్పారు.

08/22/2018 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా రోజురోజుకూ దిగజారుతున్న ఇంజనీరింగ్ విద్యను గాడిలో పెట్టేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పూనుకుంది. ఇంజనీరింగ్ కాలేజీలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా ప్రమాణాలను పాటించేలా చూడటంతో పాటు అక్కడ బోధించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు సైతం అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలని నిర్ణయించింది.

08/22/2018 - 03:43

హైదరాబాద్, ఆగస్టు 21: కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతుగా ఒక రోజు మూల వేతనం చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఒక రోజు మూల వేతనం మొత్తం రూ.47.65 కోట్ల చెక్క్‌ను సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి అందజేసారు.

08/22/2018 - 03:42

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకోవడం కాదు తేలికపాటి వర్షాలతోనే హైదరాబాద్ రోడ్లు ఏ విధంగా దెబ్బతిన్నాయో చూడండి అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే. తారక రామారావునుద్ధేశించి అన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని లోగడ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారన ఆయన తెలిపారు.

08/22/2018 - 03:42

హైదరాబాద్, ఆగస్టు 21: లోగడ తెలుగు దేశం పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం ఆమె తిరిగి టీడీపీలో చేరారు. ఆమె కుమార్తె బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అంబికా కృష్ణ చౌదరిని కూడా పార్టీలో చేర్పించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ వారికి స్వాగతం పలికారు.

08/22/2018 - 03:41

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మానవత్వాన్ని పక్కన పెట్టి, ఒక దొరలా ప్రవర్తించారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య తీవ్రంగా విమర్శించారు. వికలాంగుల సంఘాల ఐక్య వేదిక అధ్వర్యంలో తెలంగాణలో వికలాంగుల పట్ల జరుగుతున్న వివక్ష, అన్యాయాల గురించి మంత్రికి వివరించేందుకు వెళ్లారని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Pages