S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2018 - 02:11

మెదక్ రూరల్, ఆగస్టు 21: నిన్నమొన్నటి వరకు నీరులేక వెలవెలబోయిన పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి వరద రావడంతో మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టులోకి పెద్దఎత్తున నీరు చేరింది. మంగళవారం మధ్యాహ్నం వరకు పదహారున్నర అడుగులకు నీటిమట్టం చేరుకుంది.

08/22/2018 - 02:08

సిద్దిపేట, ఆగస్టు 21 : కాంగ్రెస్ పార్టీ కుట్రలు భగ్నమైనాయని, నిజమాబాద్ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రతిపక్షానికి వరుణ దేవుడు సరైన బుద్ధి చెప్పాడని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

08/22/2018 - 02:06

సిరిసిల్ల, ఆగస్టు 21: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి, సిరిసిల్ల, ఇల్లంతకుంట మండలాలలో ‘్ఫల్ ఆర్మీవామ్ రకం’ (కత్తెర పురుగు) ఆనవాళ్లు వెలుగు చూశాయి. తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ కత్తెర పురుగు శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కీటకం మొక్కజొన్న పంటను ధ్వంసం చేస్తున్నట్టు వ్యవసాయ సీనియర్ శాస్తవ్రేత్త డా.

08/21/2018 - 04:07

నల్లగొండ, ఆగస్టు 20: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న కృష్ణా వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రాత్రి కల్లా సాగర్ జలాశయం నీటి మట్టం 547 అడుగులకు, 201 టీఎంసీలకు చేరుకుంది.

08/21/2018 - 04:01

ట్రెజరరీ ద్వారా తమకు జీతాలివ్వాలని రోడ్ నెం1 బంజారాహిల్స్ హనుమాన్ దేవాలయం దగ్గర తెలంగాణ అర్చక ఉద్యోగులు, అర్చకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు

08/21/2018 - 03:54

వనపర్తి, ఆగస్టు 20: తమ భూములను ఇతరులు అక్రమించుకున్నారని ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించడం లేదని విసుగు చెం దిన ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వైనం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి జరుగుతుండగా వంటిపై కిరోసిన్ పోసుకొని వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గోపాల్‌పేట మండల కేంద్రానికి చెందిన కే.

08/21/2018 - 03:51

ఆదిలాబాద్, ఆగస్టు 20: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రెండు రోజుల క్రితమే కురిసిన కుంభవృష్టికి అంతరాష్ట్ర వంతెనలు, రహదారులు తెగిపోగా సోమవారం కురిసిన భారీ వర్షానికి వృద్ధురాలు మృతి చెందగా మరో ఇద్దరు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు.

08/21/2018 - 03:44

సంగారెడ్డి, ఆగస్టు 20: ఉత్తర, ఈశాన్య, దక్షిణ భారతాన్ని వణికిస్తూ పెను వరదలను సృష్టిస్తున్న వరుణుడు మంజీర (గరుడగంగ) నది పరీవాహక ప్రాంతంపై కరుణ చూపడం లేదు. మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు మచ్చుకైనా రావడం లేదు. దేశం, తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకోగా సింగూర్ ప్రాజెక్టు మాత్రం ఇంకా వెలవెలబోతోంది.

08/21/2018 - 03:16

హైదరాబాద్, ఆగస్టు 20: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీస్‌మార్ ఖాన్ కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ధ్వజమెత్తారు. ముందుస్తు ఎన్నికలు నిర్వహించాలని, అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉబలాటపడుతున్నారని ఆయన సోమవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అయితే ప్రభుత్వాన్ని రద్దు చేసినంత మాత్రాన వెంటనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని అన్నారు.

08/21/2018 - 04:54

హైదరాబాద్: 60 ఏళ్లుగా వివిధ కోర్టుల్లో విచారణ కొనసాగుతున్న వివాదాస్పద ‘పైగా’ భూములపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పుతో ఈ భూములపై ప్రత్యేకంగా సమీక్షించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. 1958 నుండి వివిధ కోర్టుల్లో కొనసాగుతున్న సీఎస్-7, సీఎస్-14 కేసుల్లో అనేక మలుపులు తిరుగుతున్న వివాదాస్పద భూ వివాదం చివరకు కోర్టు ధిక్కరణ కేసు విచారణతో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతం చేసింది.

Pages