S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/24/2018 - 03:10

హైదరాబాద్, ఆగస్టు 23: బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పూజారుల శంభయ్యను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు. హైదరాబాద్‌లో పెరిక కులస్తులకు భవనం నిర్మించేందుకు అవసరమైన స్థలం, నిధులను సైతం కేటాయించాలని సీఎం ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కలిశారు.

08/24/2018 - 03:10

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆర్థికంగా ఉన్నతిని సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం పురుషోత్తం ఇడి (రెవెన్యూ, ఐటి) నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్, సంస్థ ఎండీ సునీల్ శర్మను గౌరపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే పలు అంశాలపై చర్చించారు.

08/24/2018 - 03:09

హైదరాబాద్, ఆగస్టు 23: రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి ప్రచార ఆర్భాటాలతో రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశాన్ని మోసం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మవతి, డికే.అరుణలతో కలిసి ఆయన మాట్లాడారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోందని అన్నారు.

08/23/2018 - 06:19

హైదరాబాద్, ఆగస్టు 22: పిల్లలకు కళలపై అవగాహన కల్పించేందుకే బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్న ఆట బాలోత్సవ్ బ్రోచర్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు.

08/23/2018 - 06:18

హైదరాబాద్, ఆగస్టు 22: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంబీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిర్సిల్లా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గత 24 గంటల్లో తెలంగాణ మొత్తంలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

08/23/2018 - 06:17

హైదరాబాద్, ఆగస్టు 22: పుట్టుకతో చీలిన పెదవి (గ్రహణంమొర్రి)తో బాధపడుతున్న పిల్లల ముఖాల్లో చిరునవ్వులు వెలగించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ‘స్మయిల్ ట్రయిన్ ఇండియా’ స్వచ్ఛంద సంస్థకు ‘ఒరాకిల్’ నిధులు సమకూర్చి అండగా నిలిచింది. ఉన్నత చదువులు, పర్యావరణ పరిరక్షణ, సమాజ బలోపేతానికి తమ సంస్థ కృషి చేస్తున్నదని ఒరికాలఇ కార్పోరేట్ సిటీజన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోలిన్ క్యాసిటీ తెలిపారు.

08/23/2018 - 05:41

సిద్దిపేట, ఆగస్టు 22: అన్ని వర్గాల వారు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణా నేడు గడీల పాలనలో ఆగమైపోతుందని, ప్రాజెక్టులు, పథకాల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధ అవుతుందని టీజేఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ప్రజాధనం వృథా చేయకుండా సద్వినియోగం చేసి ప్రజా సంక్షేమానికి వినియోగిస్తే పేదలు దుబాయ్, ముంబాయి వలసలు వెళ్లేవారు కాదన్నారు.

08/23/2018 - 05:39

నాగర్‌కర్నూల్, ఆగస్టు 22: కేసీఆర్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం ప్రచార ఆర్భాటాలు, మాయమాటలు తప్ప మరేమీ లేదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

08/22/2018 - 03:57

హైదరాబాద్, ఆగస్టు 21: బ్రిటీష్ కమిషనరేట్ అధికారులు టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. మంగళవారం గాంధీ భవన్‌కు వచ్చిన బ్రిటీష్ మినిస్టర్ కౌన్సిల్ పొలిటికల్, ప్రెస్ విభాగాల ప్రతినిది కైరెన్ డ్రాకె, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూస్ ప్లీమింగ్‌కు చేరుకోగానే టీ.పీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు.

08/22/2018 - 03:56

హైదరాబాద్, ఆగస్టు 21: హరిత పాఠశాల- హరిత తెలంగాణ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. అదే విధంగా ఈ నెల 24వ తేదీన బాలికా ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని కూడా 31 జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టాలని నిర్ణయించారు.

Pages