S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/02/2018 - 05:31

నల్లగొండ, జూలై 1: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ఎస్‌ఎల్‌బీసీ (ఏఎమ్మార్పీ) సొరంగం ప్రాజెక్టు పనులు మరోసారి నిలిచిపోయాయి.

07/02/2018 - 05:28

నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో వరద జలాలు దిగువ గోదావరి వైపు పరుగులు తీశాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ ఆదివారం బాబ్లీకి చెందిన మొత్తం 14 గేట్లను పైకి లేపడంతో ఎగువ ప్రాంతం నుండి వచ్చే ఇన్‌ఫ్లోకు అడ్డంకులు తొలగిపోయాయి.

07/01/2018 - 05:27

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ ఆర్టీసిలో పని భారం తట్టుకోలేక ఉద్యోగులు ఆకస్మికంగా మరణిస్తున్నారని ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ నెల చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఉద్యోగులు పనిభారం వల్ల మృతి చెందారని అన్నారు.

07/01/2018 - 05:27

హైదరాబాద్, జూన్ 30: పేదలకు పెద్దాసుపత్రులుగా పేరొందిన ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో నూతన భవనాలను సాధ్యమైనంత త్వరగా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. గతంలో శిధిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి ఆ స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. కాగా చారిత్రత్మక కట్టాల కూల్చివేతను కొంత మంది వ్యతిరేకించడంతో వెనెక్కి తగ్గింది.

07/01/2018 - 05:26

హైదరాబాద్, జూన్ 30: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందించే వైద్యులు ప్రత్యక్ష దైవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇటీవలే ప్రభుత్వ వైద్యులుగా నియమితులైన 20 మంది వైద్యులు శనివారం సెక్రెటరియేట్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉన్న సంతృప్తి మరే వృత్తిలోనూ ఉండదని అన్నారు.

07/01/2018 - 05:25

హైదరాబాద్, జూన్ 30: మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం) కోర్సు కోసం ధరఖాస్తు చేసుకునే గడువును పొడగించారు. ఆసుపత్రుల నిర్వహన, అనుసంధాం తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు నిమ్స్ ఆసుపత్రి ప్రవేశపెట్టిన కోర్సులో మరికొంత మందికి అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అకడమిక్ ఇన్‌చార్జ్ మార్తా రమేష్ తెలిపారు. వచ్చేనెల 7వరకు అభ్యర్ధుల నుంచి ధరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు.

07/01/2018 - 05:25

హైదరాబాద్, జూన్ 30: ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సమ్మె విరమించబోమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు అన్నారు. డీలర్ల సమస్యలు పరిష్కరించాలని చాలాకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. దీంతో శాంతియుత నిరసనల ద్వారా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ప్రభుత్వం సస్పెండ్ల పేరుతో భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

07/01/2018 - 05:24

హైదరాబాద్, జూన్ 30: ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు. ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మంత్రి కె. తారక రామారావు విమర్శించడాన్ని విహెచ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్చరిక చేశారు. పైగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావునుద్ధేశించి ‘నీ కుమారున్ని అదుపులో పెట్టుకో..’ అని తీవ్రంగా హెచ్చరించారు.

06/30/2018 - 23:47

సిద్దిపేట, జూన్ 30 : బంగారు తెలంగాణలో సంచార జాతు ల బతుకులు అత్యంత దుర్భరంగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ఆరోపించారు. ఆ జాతులను ఆదుకోవటంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శిం చారు. సకల జనుల సర్వే, ఎంబీసీ కార్పొరేషన్ అంటు గొప్పలకు పోయిన తెలంగాణ సర్కార్ సంచార జాతుల సంక్షేమానికి చేపట్టిన చర్యలు శూన్యమన్నారు.

07/01/2018 - 01:33

కరీంనగర్: తమ న్యాయమైన హక్కులను పరిష్కరించాలని రేషన్ డీలర్లు కోరితే..సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ చర్యలను సహించేదిలేదని సీనియర్ కాంగ్రెస్ నేత, సీఎల్పీ ఉప నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో రాచరిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

Pages