S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/30/2018 - 01:05

హైదరాబాద్, జూన్ 29: పౌరసరఫరాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎన్నో రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రేషన్ డీలర్లు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్య దోరణితో వ్యవహారిస్తున్నదని పొన్నం శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రేషన్ షాపులు తొలగిస్తామని బెదిరించడం భావ్యం కాదని ఆయన అన్నారు.

06/30/2018 - 01:04

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో యుజీ అడ్మిషన్ల మూడో దశ కౌనె్సలింగ్ ప్రక్రియ ముగిసింది. శనివారం నాడు సీట్ల కేటాయింపు జరగనుంది. అనంతరం మరో విడత కౌనె్సలింగ్ జూలై రెండో వారంలో నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు , దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. దోస్త్‌లో ఇంత వరకూ 2,17,338 మంది రిజిస్టర్ చేసుకున్నారు.

06/29/2018 - 04:35

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్ధిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి అద్బుతమని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యన్ ప్రశింసించారు. గురువారం రాత్రి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో సమావేశం అయ్యారు.

06/29/2018 - 04:34

హైదరాబాద్, జూన్ 28: ఇటీవల మోకాలి మార్పిడి శస్తచ్రికిత్స చేయించుకున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని గురువారం మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆయన ఆరా తీశారు. పోచారం త్వరగా కోల్కొని తిరిగి సాదారణ స్థితికి రావాలని హరీష్ ఆకాంక్షించారు.

06/29/2018 - 04:32

హైదరాబాద్, జూన్ 28: ఆర్మీకి ఎదురయ్యే సవాళ్లను టెక్నాలజీతో దీటుగా ఎదుర్కొనాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. అందివస్తున్న అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా అద్భుతమైన సేవలు అందించాలని గవర్నర్ కోరారు.

06/29/2018 - 04:32

హైదరాబాద్, జూన్ 28: భారతదేశానికి లభించిన అరుదైన నాయకుడు మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం పీవీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి ఘనంగా నివాళ్ళర్పించారు. అనంతరం పీవీ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు.

06/29/2018 - 04:31

హైదరాబాద్, జూన్ 28: ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యా కళాశాలల్లోని ఏ కేటగిరి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది.

06/29/2018 - 04:31

హైదరాబాద్, జూన్ 28: బీసీ జనాభాకు అనుగుణంగా రాష్టవ్య్రాప్తంగా తగినన్ని బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్రంలోని 31 జిల్లా కలెక్టరేట్ల ముందు బీసీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

06/29/2018 - 04:30

హైదరాబాద్, జూన్ 28: దేశంలో యూజీసీ స్థానే భారత ఉన్నత విద్యా కమిషన్ (హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా/ హెచ్‌ఇసిఐ)ను తీసుకురావాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

06/29/2018 - 04:27

హైదరాబాద్, జూన్ 28: దేశవ్యాప్తంగా సేవాదళ్‌ను బలోపేతం చేసేందుకు దళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్‌జీ దేశాయ్ విశేషంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర సేవాదల్ చైర్మన్ కనుకుల జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సేవాదళ్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీసేందుకు జాతీయ నాయకత్వం రాష్ట్రానికి వస్తున్నట్టు ఆయన చెప్పారు.

Pages